BigTV English

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగార్జున వ్యాఖ్యలు వైరల్

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగార్జున వ్యాఖ్యలు వైరల్

Akhil Akkineni: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీకి  అడుగుపెట్టాడు  నాగార్జున చిన్నకొడుకు అఖిల్ అక్కినేని. మనం సినిమా చివర్లో  అఖిల్ ఎంట్రీకే  బాక్సాఫీస్ లు బద్దలు అయ్యిపోయాయి. ఇక  అఖిల్ అనే సినిమాతో అయ్యగారు ఎంట్రీ  ఇండస్ట్రీలోనే అత్యధిక హైప్ తెచ్చుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతోనే ఈ కుర్రాడు   తండ్రి పేరు నిలబెడతాడేమో అనుకున్నారు. కానీ, అఖిల్ కు  ఆ అవకాశం  దక్కలేదు.


ఆ తరువాత అఖిల్ ను హీరోగా నిలబెట్టడానికి నాగ్  ఎంతో కష్టపడదు.. రీ లాంచ్.. రీరీ లాంచ్ చేస్తూ వచ్చాడు. హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలతో అపజయాలను అందుకున్న అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మొదటి హిట్ ను అందుకున్నాడు. సరే ఈ హిట్ తో అఖిల్ తలరాత మారుతుంది అనుకున్నారు. కానీ, మళ్లీ ఏజెంట్ లాంటి సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఏజెంట్ కోసం  అఖిల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.

కథ దగ్గర నుంచి ఫిట్ నెస్ వరకు పర్ఫెక్ట్ గా ఎంచుకున్నాడు. కానీ, అఖిల్ దురదృష్టం.. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నిజం చెప్పాలంటే.. అఖిల్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా ఏజెంట్ నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీకి కూడా నోచుకోలేదు. ఏజెంట్ సినిమా తరువాత అఖిల్ పూర్తిగా మీడియాకు దూరమయ్యాడు. అప్పుడప్పుడు ఏదైనా సెలబ్రిటీ ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప..  బయట కనిపించడం పూర్తిగా తగ్గించేశాడు.


మీడియా కంట పడితే.. ఏజెంట్ ప్లాప్ గురించి అడుగుతారనో.. లేక తరువాత సినిమా గురించి చెప్పడం ఇష్టం లేకనో అని ఫ్యాన్స్ కూడా  అఖిల్ ను కదిలించడం మానేశారు.  తాజాగా అక్కినేని నాగార్జున తన కొడుకు ఎందుకు బయట రావడం లేదో చెప్పుకొచ్చాడు. ANR100 ఇయర్స్ ఈవెంట్ లో నాగ్ మాట్లాడుతూ..  ఈ ఈవెంట్ కు అఖిల్ రాలేదు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక దీంతో ఫ్యాన్స్ అందరు..  అయ్యగారు.. ఇంత కసి మీలో ఇప్పటివరకు చూడలేదే అంటూ కామెంట్స్  పెడుతున్నారు. ప్రస్తుతం అఖిల్ యూవీ క్రియేషన్స్ లో ఒక మూవీ  చేస్తున్నాడు. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని టాక్. దీనికోసం అఖిల్ చాలా ఎక్కువ కష్టపడుతున్నాడని టాక్. మరి ఈ సినిమాతోనైనా  అయ్యగారు హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×