E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu Promo: వెంట్రుకలు పీకి మరీ మగాళ్లను హింసించిన బిగ్ బాస్, నావల్ల కాదంటూ పృథ్వి పరుగులు.. యష్మీ మహానటన

Bigg Boss 8 Telugu Promo: వెంట్రుకలు పీకి మరీ మగాళ్లను హింసించిన బిగ్ బాస్, నావల్ల కాదంటూ పృథ్వి పరుగులు.. యష్మీ మహానటన
Advertisement

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో విన్ అయ్యేవారికి ప్రైజ్ మనీ ఎంత అనే విషయం మేకర్స్ ముందే చెప్పలేదు. అలా కాకుండా కంటెస్టెంట్సే కష్టపడి టాస్కులు ఆడి గెలిచి ప్రైజ్ మనీని సంపాదించుకోవాలని మొదటిరోజే బిగ్ బాస్ వివరించారు. దానికి కంటెస్టెంట్స్ కూడా ఒప్పుకున్నారు. అలా బిగ్ బాస్ 8 రెండోవారంలో హౌజ్‌మేట్స్ అంతా ప్రైజ్ మనీ కోసం పోటీ మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రైజ్ మనీ కోసం హౌజ్‌మేట్స్ రెండు టాస్కులు ఆడిన ప్రోమో విడుదలయ్యింది. తాజాగా దానికి సంబంధించిన రెండో ప్రోమో కూడా విడుదల కాగా ఇందులో బిగ్ బాస్.. అబ్బాయిలకు కాస్త కష్టమైన టాస్కులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

గ్లాస్‌లో జ్యూస్

Advertisement

‘‘బిగ్ బాస్ మీకు ఇస్తున్న నాలుగో అవకాశం విలువ రూ.1,50,000’’ అంటూ అభయ్, నిఖిల్, ఆదిత్య ఓంకు ఛాలెంజ్ విసిరారు బిగ్ బాస్. ఈ ముగ్గురు ఒక గ్లాస్‌లో జ్యూస్‌ను పోస్తుండాలి. ఏ టీమ్ సభ్యుడు అయితే జ్యూస్ పోసినప్పుడు అది గ్లాస్ నుండి బయటికి కారిపోతుందో ఆ టీమ్ సభ్యుడితో పాటు మొత్తం ఆ టీమ్ కూడా ఆట నుండి తప్పుకోవాల్సిందే అని బిగ్ బాస్ వివరించారు. దీంతో ఈ ముగ్గురి మధ్య ఆట మొదలయ్యింది. ముందుగా ఆదిత్య ఓం వచ్చి గ్లాస్‌లో సగానికి పైగా జ్యూస్ నింపాడు. అభయ్, నిఖిల్ ఆడిన తర్వాత గ్లాస్ మొత్తం జ్యూస్‌తో నిండిపోయింది. అయినా చాకచక్యంతో మూతతోనే ఒక చుక్క జ్యూస్‌ను గ్లాస్‌లో పోశాడు అభయ్, ఆ తర్వాత వచ్చిన నిఖిల్.. చిటికెన వేలుతో ఒక చుక్క జ్యూస్‌ను గ్లాస్‌లో పోసే ప్రయత్నం చేశాడు.

Also Read: బొక్కబోర్లా పడ్డ సోనియా.. నిఖిల్ హర్ట్, తొక్కలో సెంటిమెంట్స్ అంటూ యష్మీ ఫైర్

Advertisement

నొప్పితో అరుపులు

నాలుగో ఛాలెంజ్‌లో గ్లాస్‌లో నుండి జ్యూస్ పడకుండా నిఖిల్, అభయ్, ఆదిత్య ఓం ప్రయత్నించారు. దాని తర్వాత అయిదో ఛాలెంజ్‌లో నిఖిత్, నబీల్, పృథ్విరాజ్ వ్యాక్సింగ్ చేయించుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఆ ఛాలెంజ్ విలువ రూ.50 వేలు అని కూడా చెప్పారు. నిఖిల్ అయితే టీమ్‌ను గెలిపించడం కోసం వ్యాక్సింగ్ వల్ల వస్తున్న నొప్పిని ఓర్చుకున్నాడు. కానీ నిఖిల్ మాత్రం అరవడం మొదలుపెట్టాడు. వ్యాక్సింగ్ చేయించుకోవడం పృథ్వికి అస్సలు ఇష్టం లేకపోవడంతో అభయ్.. అతడిని గట్టిగా పట్టుకున్నాడు. అయినా అందరినీ వదిలించుకొని మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు పృథ్వి.

యష్మీ దబాయింపు

ఇప్పటికే నైనికా, యష్మీ టీమ్స్ టాస్కులు ఆడి రేషన్‌ను గెలుచుకున్నాయి. యష్మీ టీమ్‌కే ఎక్కువ రేషన్ దక్కినా కూడా అన్యాయంగా నైనికా టీమ్ గెలుచుకున్న చికెన్‌ను దొంగతనం చేసి తిన్నారు. తాజాగా యష్మీ టీమ్ గెలుచుకున్న పాల ప్యాకెట్‌ను విష్ణుప్రియా తీసేసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ‘‘మా చికెన్ కూడా మీరు తీసుకున్నారు’’ అని విష్ణుప్రియా అనగానే ‘‘నీ దగ్గర మేము తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా? అలా నీకు ఎవరు చెప్పారు?’’ అని అరవడం మొదలుపెట్టింది యష్మీ. ఎందుకు అరుస్తున్నావు అని అడిగితే.. నేను ఇలాగే మాట్లాడతాను అని మళ్లీ అరిచింది. దొంగతనం చేసింది కాకుండా మహానటిలాగా నటిస్తుందని, పైగా తిరిగి వారినే దబాయిస్తుందని ప్రేక్షకుల్లో యష్మీపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతోంది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×