BigTV English

Bigg Boss 8 Remuneration: పృథ్వీ అవుట్.. 7 వారాలకు గానూ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Bigg Boss 8 Remuneration: పృథ్వీ అవుట్.. 7 వారాలకు గానూ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Bigg Boss 8 Remuneration..బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss season 8) ఏడవ వారం చివరి రోజుకు చేరుకుంది. మొత్తం ఆరువారాలలో 7 మంది ఎలిమినేట్ అవ్వగా.. ఇక ఏడవ వారం పృథ్వీ రాజ్ శెట్టి (Prithviraj Shetty) ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మరి ఈ ఏడు వారాలకు గానూ ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.


నాగ పంచమి సీరియల్ తో గుర్తింపు..

కర్ణాటక ప్రాంతానికి చెందిన పృథ్వీరాజ్ తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తూ పర్వాలేదనిపించుకున్నారు. ముఖ్యంగా దొరసాని , మావారు మాస్టారు లాంటి సీరియల్స్ లో నటించిన ఈయన నాగపంచమి (Naga panchami) సీరియల్ తో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి కలిగిన పృథ్వీరాజ్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మోడలింగ్ ను వృత్తిగా ఎంచుకున్నారు. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే కన్నడలో అర్ధాంగి అనే సీరియల్ లో అవకాశం లభించగా.. అలా ఆ సీరియల్ ద్వారా తన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఈయనకు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి కాస్త సమయం పట్టిందని సమాచారం. నెమ్మదిగా తెలుగు కూడా నేర్చుకొని పర్వాలేదనిపించుకుంటున్నాడు. ఇక తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రావడంతో హౌస్ లోకి వచ్చి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా విష్ణు ప్రియ (Vishnu Priya)తో లవ్ ట్రాక్ నడుపుతూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. దీనికి తోడు ఆరు వారాలుగా నామినేషన్ లోకి వచ్చిన పృథ్వీరాజ్ ఒకరకంగా విష్ణు ప్రియ కారణంగానే సేవ్ అయ్యాడు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఎట్టకేలకు ఏడవ వారం ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మొత్తం 9 మంది నామినేషన్స్ లోకి రాగా అందులో భాగంగానే ఏడో వారం పృథ్వీ రాజ్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు.


పృథ్వీ రాజ్ శెట్టి రెమ్యూనరేషన్..

బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ ఒకటవ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగుపెట్టగా.. ఈసారి చాలామంది కన్నడ ఇండస్ట్రీకి చెందినవారు హౌస్ లోకి వచ్చారు. వారిలో పృథ్వీ కూడా ఒకరు. వారానికి రూ. 1.5 లక్షల రెమ్యునరేషన్ ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టారు పృథ్వీ. ఒక నాగ పంచమి మినహా ఈయనకు పాపులారిటీ పెద్దగా లేని కారణంగానే ఇంత తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే..?

ఇకపోతే మొత్తం ఏడు వారాలు హౌస్ లో కొనసాగారు. ఈ మేరకు వారానికి రూ.1.5 లక్షల చొప్పున మొత్తం ఏడు వారాలకు గానూ మొత్తం రూ.10.5 లక్షలు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు జీఎస్టీ కూడా యాడ్ అవుతుందని తెలుస్తోంది. మొత్తానికైతే పెద్దగా గుర్తింపు లేని కారణంగానే కేవలం రూ.10 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గత రెండు మూడు వారాలుగా తన ఆట తీరులో పర్ఫామెన్స్ కనబరచకపోవడం వల్లే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు అని సమాచారం.. ఏది ఏమైనా ఏడు వారాల పాటు హౌస్ లో కొనసాగి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు పృథ్వీరాజ్.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×