BigTV English

Rahul sipligunj: నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే.. జీవితాంతం..!

Rahul sipligunj: నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే.. జీవితాంతం..!

Rahul Sipligunj : బిగ్ బాస్ (Bigg Boss) మాజీ కంటెస్టెంట్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఒక్క పాటతో గ్లోబల్ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) మల్టీస్టారర్ మూవీ గా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొని, తెలుగు సినీ పరిశ్రమకు ఊహించని గుర్తింపును అందించింది. అంతేకాదు ఆస్కార్ (Oscar) బరిలో దిగిన ఈ సినిమా ఏకంగా రెండు విభాగాలలో ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. ఇక ఈ పాటను ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ (Kala Bhairava) తో కలిసి ఆస్కార్ వేదికపై మరొకసారి ఆలపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలా ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు రాహుల్ సిప్లిగంజ్.


జానపద పాటలతో తొలుత గుర్తింపు..

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన కెరియర్లో తాను చేసిన అతి పెద్ద తప్పు అదే అంటూ తెలిపారు. జానపద పాటల గాయకుడిగా తొలుత గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత తెలుగు సినిమా పాటలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్లో భారీ పాపులారిటీ దక్కించుకొని , 2009లో వచ్చిన జోష్ సినిమాలో కాలేజ్ బుల్లోడా అనే పాటతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ఎన్టీఆర్ దమ్ము సినిమాలో వాస్తు బాగుందే, ఛల్ మోహన్ రంగా సినిమాలో పెద్దపులి, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది, రంగస్థలం సినిమాలో రంగా రంగా రంగస్థలానా ఇలా పలు పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు.


సూపర్ స్టార్ నమ్మకాన్ని ఒమ్ము చేశాను..

ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. నేను సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కు వీరాభిమానిని. ఒక రోజు ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అయితే ఆయన అన్నాత్తే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయనను కలవడానికి వెళ్లగా ఆయన ఆ మూవీ లుక్కులో ఉన్నారు. నేను వెళ్లి అడగగానే ఆయన అదే గెటప్ లో నాతో ఫోటో దిగారు. అయితే అప్పటికి ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. కాబట్టి నేను ఆ ఫోటోని ఎక్కడా కూడా పోస్ట్ చేయకూడదని వారు నాతో చెప్పారు. నేను కూడా సరే అన్నాను. అయితే కొద్ది రోజులకు నేను ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశా.. అది నేను చేసిన తప్పే. దానికి నేను ఇప్పటికీ కూడా బాధపడుతున్నాను అంటూ తెలిపారు రాహుల్. ఇలా సినిమా విడుదల అవ్వకముందే, అందులోనూ..రజనీకాంత్ లుక్ విడుదల చేయకముందే నేను షేర్ చేయడంతో టీం మొత్తం డిసప్పాయింట్ అయింది. నేను సూపర్ స్టార్ కి అభిమానిని అయినా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేశాను.. ఇక ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణనాతీతం అంటూ తన కెరియర్ లో తాను చేసిన అతి పెద్ద తప్పు గురించి చెప్పుకొచ్చారు రాహుల్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×