E-Paper
Advertisement

Bigg Boss 8 Tamil: కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి.. తమిళ్ బిగ్ బాస్ లాంచ్‌కు రంగం సిద్ధం, పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss 8 Tamil: కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి.. తమిళ్ బిగ్ బాస్ లాంచ్‌కు రంగం సిద్ధం, పూర్తి వివరాలు ఇవే..
Advertisement

Bigg Boss 8 Tamil: బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఇండియాలో ముందుగా హిందీ భాషలోనే మొదలయ్యింది. ఆ తర్వాత సౌత్ భాషలు కూడా ఈ షోను ప్రారంభించాయి. అలా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ ప్రారంభమయ్యింది. ఇటీవల తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పుడు తమిళంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇన్నాళ్లు తమిళంలో బిగ్ బాస్ షోను కమల్ హాసన్ హోస్ట్ చేసేవారు. ఈసారి నుండి అలా కాదని ఆయనే స్వయంగా ప్రకటించారు. దీంతో ఆ స్థానంలోకి విజయ్ సేతుపతి వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది.

కొత్త టచ్

Advertisement

అక్టోబర్ 6న బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 గ్రాండ్‌గా లాంచ్ కానుంది. విజయ్ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. ఇప్పటివరకు విడుదలయిన ప్రోమోలు చూస్తుంటే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8కు మేకర్స్ కొత్త టచ్ ఇవ్వనున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటివరకు కమల్ హాసన్ ఈ షోను హోస్ట్ చేశారు కాబట్టి కచ్చితంగా విజయ్ సేతుపతి హోస్టింగ్‌ను కమల్ హోస్టింగ్‌తో పోలుస్తారు. అయితే ఇప్పటివరకు ఇందులో కంటెస్టెంట్స్‌గా వచ్చేవారి వివరాలు బయటికి రానివ్వలేదు మేకర్స్. కానీ కోలీవుడ్ మాత్రం తమిళ్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్‌గా కొందరి పేర్లను పదేపదే వినిపిస్తోంది. ఈసారి కూడా ఎక్కువశాతం ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులే హౌస్‌లో కంటెస్టెంట్స్‌గా కనిపించనున్నారు.

Also Read: వీకెండ్స్ లో నాగ్ ధరించే షర్ట్స్ ఖరీదు తెలిస్తే షాక్.. రెండు కుటుంబాల వార్షికాదాయం..!

Advertisement

వీరే కంటెస్టెంట్స్

మణిమేఘలై, షాలిన్ జోయా, ఆర్జే అనంతి, వీటీవీ గణేశ్, విజయ్ విషాల్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమలా షాజి, నిర్మాత రవీందర్, నటి దివ్యా దురైసామి, యాక్టర్ సెంథిల్.. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించిన మొదటి టీజర్.. సెప్టెంబర్ 4న విడుదలయ్యింది. ఈ షోను విజయ్ సేతుపతి హోస్ట్ చేయనున్నాడని అప్పటివరకు కేవలం రూమర్స్ మాత్రమే వినిపించినా.. ఈ టీజర్‌తో ప్రేక్షకులకు వార్త కన్ఫర్మ్ అయిపోయింది. అంతకంటే ముందుగా ఆగస్ట్‌లోనే తాను హోస్ట్‌గా కొన్నాళ్లు బ్రేక్ తీసుకోనున్నట్టు కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు.

కాంట్రవర్సీలు ఎక్కువ

తమిళంతో పాటు హిందీ బిగ్ బాస్ కూడా వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. హిందీలో బిగ్ బాస్ సీజన్ 18.. అక్టోబర్ 5న గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమయ్యింది. ఈ భాషకు సంబంధించిన టీజర్ కూడా విడుదలయ్యింది. మరోసారి హిందీ బిగ్ బాస్‌కు సల్మాన్ ఖానే హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్ అవ్వడానికి 14 కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తోంది. వారంతా 100 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండాలి. తెలుగుతో పోలిస్తే ఇప్పటివరకు జరిగిన తమిళ బిగ్ బాస్ షోలలోనే ఎక్కువగా కాంట్రవర్సీలు నడిచాయి. గొడవలు, కాంట్రవర్సీలు అక్కడే ఎక్కువ అని కామన్ బిగ్ బాస్ ప్రేక్షకులు అంటుంటారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×