E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: సోనియాను టార్గెట్ చేసి తప్పించిన కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ హౌస్‌లో కొత్త చీఫ్ ఎవరంటే?

Bigg Boss 8 Telugu: సోనియాను టార్గెట్ చేసి తప్పించిన కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ హౌస్‌లో కొత్త చీఫ్ ఎవరంటే?
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి మూడు వారాలు పూర్తయ్యింది. అయితే ఈ మూడువారాల పాటు నిఖిల్ మాత్రమే చీఫ్ స్థానం నుండి పక్కకు తప్పుకోకుండా టీమ్‌ను నిలబెట్టుకున్నాడు. మణికంఠ మాత్రమే తన అండగా ఉన్నప్పుడు కూడా టీమ్‌ను నిలబెట్టుకొని గెలిచాడు నిఖిల్. తనతో పాటు హౌస్‌లో చీఫ్స్ మారుతున్నా కూడా తను మాత్రమే నిలకడగా ఉన్నాడు. ఇప్పుడు తనతో పాటు హౌస్‌కు మరో చీఫ్ అవసరం వచ్చింది. దానికోసం తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో పోటీ కూడా జరిగింది. ఆ పోటీలో కంటెస్టెంట్స్ స్ట్రాటజీలు, ఎత్తుకు పైఎత్తులు అన్నీ ముగిసిన తర్వాత నిఖిల్‌తో పాటు కొత్త చీఫ్‌గా మరో అమ్మాయే ఎంపికయ్యింది.

మొదట్లోనే ఔట్

Advertisement

గార్డెన్ ఏరియాలో ఒక సుత్తి పెట్టి ఉంటుంది. సమయానుసారం బజర్ మోగుతుంది. ఆ బజర్ మోగినప్పుడు చీఫ్స్ రేసు నుండి తప్పుకున్న కంటెస్టెంట్స్‌లో ఎవరైతే ముందుగా సుత్తిని పట్టుకుంటారో వారు మరొక కంటెస్టెంట్‌ను ఆ రేసు నుండి తొలగించవచ్చు. దీంతో హౌస్‌లో కొత్త చీఫ్ ఎవరు అవ్వాలి అనే విషయంలో స్ట్రాటజీలు మొదలయ్యాయి. ఇప్పటికే నిఖిల్ చీఫ్ అవ్వడంతో ముందుగా చీఫ్ రేసు నుండి ఎవరిని తొలగించాలనే అవకాశం తనకు వచ్చింది. దీంతో ఆదిత్య ఓంను రేసు నుండి తప్పించి తనకు లీడర్ అయ్యే లక్షణాలు లేవని అన్నాడు నిఖిల్. ఆ తర్వాత ఆదిత్య ఓం సుత్తిని దక్కించుకొని పృథ్వికి ఇవ్వగా తను మణికంఠ స్ట్రాంగ్ కాదనే కారణంతో తనను చీఫ్ రేసు నుండి తప్పించాడు.

Also Read: అబ్బాయిల కోసం అమ్మాయిల లొల్లి.. మరోసారి మాట నెగ్గించుకున్న సోనియా, నారదుడిగా మారిన నిఖిల్

Advertisement

నబీల్‌పై అటాక్

ఆ తర్వాత నిఖిల్‌కు సుత్తి దక్కడంతో సీతకు ఇచ్చాడు. తను యష్మీ ఇప్పటికే ఒకసారి చీఫ్ అయ్యిందనే కారణంతో తనను రేసు నుండి తొలగించింది. మరోసారి కూడా సుత్తి నిఖిల్‌కే దక్కగా ఈసారి తను సోనియాకు ఇచ్చాడు. దీంతో నబీల్‌తో ఎప్పటినుండో పగ పెంచుకున్న సోనియా.. నబీల్ ఎవరితో సరిగా మాట్లాడడం లేదని, ఎవరితో ఎలా ఉండాలో తనకు తెలియడం లేదని కారణం చెప్పింది. దీంతో నబీల్ మాత్రమే కాదు.. మిగతా కంటెస్టెంట్స్ కూడా హర్ట్ అయ్యారు. సోనియాను ఎలాగైనా రేసు నుండి తప్పించాలని కలిసికట్టుగా ప్లాన్ చేశారు. నిఖిల్ చేతికి సుత్తి వెళ్తే కచ్చితంగా తను సోనియాకే ఇస్తాడని తన చేతికి అది దక్కకుండా ఫైట్ చేశారు. తను మాత్రం తన టీమ్ సభ్యుల్లోనే ఒకరిని చీఫ్ చేయాలని అనుకున్నాడు.

సోనియానే టార్గెట్

సోనియా చీఫ్ అవ్వకూడదనే ఉద్ధేశ్యంతోనే ఒక స్ట్రాటజీతో విష్ణుప్రియాను రేసు నుండి తప్పించింది నైనికా. ఇక సోనియాను రేసు నుండి తప్పించే ఛాన్స్ ప్రేరణకు వచ్చింది. ఒకసారి చీఫ్ అయ్యే అవకాశం వచ్చినా తను సీరియస్‌గా తీసుకోలేదని కారణం చెప్పింది. దానికి సోనియా కూడా సైలెంట్ అయిపోయింది. చివరిగా సీత, నైనికా, ప్రేరణ చీఫ్స్ రేసులో నిలిచారు. నైనికా ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యిందనే కారణంతో తనను తప్పించింది సీత. దాంతో నైనికా చాలా ఫీల్ అయ్యింది. అయినా కూడా తన చేతికి సుత్తి వచ్చినప్పుడు తను సీతకే ఇచ్చి ప్రేరణను రేసు నుండి తప్పించి సీత చీఫ్ అయ్యేలా చేసింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌కు సీతే కొత్త చీఫ్.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×