Indian Railways: భార్య భర్తలు అన్నాక.. కోపాలు, తాపాలు ఉంటాయి. గొడవలు, అలకలు కామన్. కానీ, సతాయింపు మరీ ఎక్కువైతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి జీవితంలో కోలుకోలేని తప్పులు జరిగే ప్రమాదం ఉంటుంది. ఓ రైల్వే మాస్టర్ భార్య మీద ఫ్రస్టేషన్ తో చేసిన పనికి ఉద్యోగం ఊడటంతో పాటు భారతీయ రైల్వే సంస్థ ఏకంగా రూ. 3 కోట్లు ఫైన్ కట్టాల్సి వచ్చింది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఈ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకల విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. రాత్రిపూట నిషిద్ధ ప్రాంతాల్లో ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా రైళ్లు వెళ్లేందుకు అనుమతించరు. కానీ, భార్య మీద కోపంతో ఓ రైల్వే మాస్టర్ చెప్పిన ‘ఓక’ అనే మాట అతడి జీవితాన్నే మార్చివేసింది. ఉద్యోగం పోవడంతో పాటు భార్యతో విడాకులు అయ్యాయి. ఆయన చేసిన పనికి భారతీయ రైల్వే సంస్థ పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చింది.
స్టేషన్ మాస్టర్ చేసిన పొరపాటు ఏంటంటే?
ఓ వ్యక్తి విశాఖపట్నం స్టేషన్ మాస్టర్ రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నాడు. ఓ రోజు భార్యతో గొడవ పడ్డాడు. అదే కోపంలో స్టేషన్ కు వచ్చాడు. భార్య ఫోన్ చేసిన మళ్లీ సతాయించడం మొదలు పెట్టింది. కొద్ది సేపు ఫోనోలోనే గట్టి గట్టిగా కేకలు వేసుకున్నారు. “మనం ఇంట్లో మాట్లాడుకుందాం, ఒకే” అన్నాడు. ఆ సమయంలో స్టేషన్ మాస్టర్ తన మైక్రో ఫోన్ ఆన్ లో ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన సహోద్యోగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోకి గూడ్స్ రైలు పంపేందుకు ‘సరే‘ అన్నాడని భావించాడు. ఆ రైలును డైవర్ట్ చేసేందుకు డ్రైవర్ కు సిగ్నల్ ఇచ్చారు. ఆ రైలు నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత ప్రాంతం మీదుగా ప్రయాణం చేసింది. అదృష్టవశాత్తూ, ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా భారతీయ రైల్వే సంస్థ రూ. 3 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
12 సంవత్సరాల తర్వాత భార్యతో విడాకులు
నిబంధనలకు విరుద్ధంగా రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టేషన్ మాస్టర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. దీనంతటికీ తన భార్యే కారణం అని భావించి విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. భార్య కూడా తన భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. అతని విడాకుల పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించడంతో, స్టేషన్ మాస్టర్ చత్తీస్ గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. అతడిపై, అతడి కుటుంబంపై భార్య చేసిన ఆరోపణలను తప్పుడు ఆరోపణలుగా భావించి డివిజన్ బెంచ్ విడాకులను ఆమోదించింది. భార్య అతికోపం కారణంగా సమాజంలో అతడు తీవ్ర అవమానాలకు గురయ్యాడని, అతడి మూలంగా భారతీయ రైల్వే సంస్థ జరిమానా కట్టే పరిస్థితి వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనలు అన్నింటికీ ఆయన భార్యే కారణంగా భావిస్తూ విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: ఓడియమ్మ.. ఒకే రోజు 3 కోట్ల మంది రైలు ప్రయాణం, రైల్వే చరిత్రలోనే అరుదైన రికార్డు