BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: హౌస్ నుండి గంగవ్వ ఎలిమినేట్.? మరోసారి అదే కారణం..

Bigg Boss 8 Telugu: హౌస్ నుండి గంగవ్వ ఎలిమినేట్.? మరోసారి అదే కారణం..

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8లో మరోవారం మరో ఎలిమినేషన్ జరిగింది. కానీ ఈసారి ఎవరూ ఊహించని ఎలిమినేషన్ జరిగినట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినవారిలో గంగవ్వ కూడా ఒకరు. అయితే గంగవ్వ వచ్చినప్పటి నుండి కేవలం ఒక్క వారం మాత్రమే తను నామినేట్ అయ్యింది. ఆ తర్వాత వారం నుండి తను ఆట ఆడినా ఆడకపోయినా.. ఎలా ఉన్నా కూడా అసలు తనను నామినేషన్స్‌లోకి తీసుకురాలేదు కంటెస్టెంట్స్. అయినా కూడా మరోసారి తన అనారోగ్య సమస్యల కారణంగా గంగవ్వ ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.


క్లారిటీ లేదు

అయితే ఈవారం గంగవ్వ మాత్రమే ఎలిమినేటా? లేదా ఇంకొక కంటెస్టెంట్ కూడా తనతో పాటు హౌస్‌ను విడిచి వెళ్లిపోతారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. కానీ గంగవ్వ మరోసారి అనారోగ్య సమస్యలు అనే కారణంతోనే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతుందని చాలామంది ప్రేక్షకులు ఊహించలేదు. యూట్యూబర్‌గా ఫేమ్ సంపాదించుకున్న తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వకు కంటెస్టెంట్‌గా అవకాశం వచ్చింది. అప్పుడు కూడా గంగవ్వను ఒక స్పెషల్ కంటెస్టెంట్‌గా ట్రీట్ చేసి తనను అస్సలు నామినేషన్స్‌లోకి తీసుకురాలేదు ఇతర కంటెస్టెంట్స్. ఇప్పుడు కూడా మరోసారి అదే జరిగింది.


Also Read: ఆ ముగ్గురిపై నెటిజన్స్ ఫైర్.. ఎలిమినేట్ చేయాలంటూ డిమాండ్..!

చాలా మారిపోయింది

బిగ్ బాస్ 8లో ఎంటర్ అయినప్పటి కూడా గంగవ్వ పెద్దగా టాస్కుల్లో పాల్గొనలేదు. అయినా కూడా తనను ఎవరూ నామినేట్ చేయడానికి ముందుకు రాలేదు. అంతా సౌకర్యంగా ఉన్నా కూడా తన అనారోగ్య సమస్యల వల్ల గంగవ్వ బయటికి రాక తప్పలేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 4తో పోలిస్తే బిగ్ బాస్ 8లో గంగవ్వ మరింత యాక్టివ్ అయ్యింది. అప్పట్లో తను టాస్కులు పెద్దగా ఆడేది కాదు అలాగే కంటెస్టెంట్స్‌తో కూడా తనకు అంతగా ఇంటరాక్షన్ లేదు. కానీ ఈసారి అలా జరగలేదు. కంటెస్టెంట్స్ తనతో మాట్లాడినా మాట్లాడకపోయినా గంగవ్వే వారిపై సెటైర్లు వేస్తూ కామెడీ పండించడానికి ట్రై చేసింది. అలా బిగ్ బాస్ 8లో తను కూడా కాస్త ఎంటర్‌టైన్మెంట్ అందించిందని ప్రేక్షకులు ఫీలయ్యారు.

కంటెస్టెంట్స్ హర్ట్

ఇదంతా పక్కన పెడితే పలు సందర్భాల్లో గంగవ్వ కూడా తన నోటి దురుసుతో కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేసింది. గౌతమ్ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాల్సింది అని, అయినా ఇంకా హౌస్‌లోనే తిరుగుతున్నాడని దురుసుగా మాట్లాడింది. అదే వేరే కంటెస్టెంట్స్ ఇలా మాట్లాడి ఉండుంటే ఇప్పటికే వారు నామినేషన్స్‌లో ఉండేవారు. గంగవ్వకు బిగ్ బాస్ 8 హౌస్‌లో కొందరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అందుకే వారు ఏం చేసినా, ఎలా ఉన్నా వారికే సపోర్ట్ చేస్తుంది. అలాగే తాజాగా జరిగిన మెగా చీఫ్ టాస్కులో రోహిణికే సపోర్ట్ చేసింది. ఇక గౌతమ్‌పై అమితంగా ప్రేమ పెంచుకున్న గంగవ్వ.. కంటెస్టెంట్స్ తనను టార్గెట్ చేస్తే తట్టుకోలేదు. వారిపై రివర్స్ అయ్యింది.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×