BigTV English

Bigg Boss 8 Telugu : మెగా చీఫ్ కోసం నిఖిల్ పోరాటం.. అవినాష్ తో నబీల్ మ్యాచ్ ఫిక్సింగ్..

Bigg Boss 8 Telugu : మెగా చీఫ్ కోసం నిఖిల్ పోరాటం.. అవినాష్ తో నబీల్ మ్యాచ్ ఫిక్సింగ్..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 తొమ్మిదో వారం హౌస్ లో దీపావళి సంబరాలతో పాటుగా మెగా చీఫ్ కోసం జరిగిన టాస్క్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో నబీల్ ప్రవర్తన అందరికి షాక్ అయ్యేలా చేస్తుంది. షేర్ అంటే తానే అన్నట్లుగా ఇప్పటివరకూ టాస్కులు ఆడాడు నబీల్. ముఖ్యంగా పృథ్వీతో పోటీ పడి మరీ టాస్క్ లో కష్ట పడే నబీల్ నిన్న టాస్క్ లో మాత్రం చేతులు ఎత్తేసాడు. ఇక చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. నబీల్ వదిలెయ్యడం వల్లే అవినాష్ అయ్యాడని నిన్నటి ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. నబీల్ ఓడిపోయిన తర్వాత ఎందుకిలా చేశావ్ అంటే స్టామినా అయిపోయిందంటూ మరో అబద్ధం కూడా ఆడాడు నబీల్. అసలు నబీల్ ఆట తీరు చూసిన ఎవరికైనా ఊరికినే ఇచ్చేశాడనే విషయం తెలిసిపోతుంది.అసలు నబీల్ ఎందుకు అలా చేసాడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


నిన్నటి ఎపిసోడ్ మొదటనే ఒక టాస్క్ లి పోటీ పడుతూ ఉంటారు. మెగా చీఫ్ ఎంపిక కోసం పెట్టిన టాస్కులో నిన్నటి ఎపిసోడ్‌లోనే హరితేజ, తేజ ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన నలుగురి మధ్య జరిగిన గేమ్‌ను ఈరోజు చూపించారు. అయితే నబీల్, నిఖిల్, ప్రేరణ.. ముగ్గురు అంతకుముందు ఒకే క్లాన్‌లో ఉన్నారు. అవినాష్ ఒక్కడే రాయల్స్ క్లాన్ మెంబర్.. అతన్ని తీద్దామని అనుకున్నా నబీల్ మాత్రం లైట్ తీసుకున్నాడు దగ్గరుండి మరి అవినాష్ ను గెలిపించాడు.

ఇక ప్రేరణ కూడా గట్టి పోటీని ఇచ్చింది. ప్రేరణ.. నిఖిల్ , నబీల్ సపోర్ట్ కూడా అడిగింది. కానీ అవినాష్ తెలివిగా అందరూ కలిసి ఆడుతున్నారా అన్నట్లు రెచ్చగొట్టాడు. దీంతో వాళ్లు సాయం రాలేదు. ఇంకేముంది బజర్ మోగే లోపు ప్రేరణ బ్యాగ్‌ను దాదాపు ఖాళీ చేశాడు అవినాష్.. ప్రేరణ ఔట్ అవ్వగానే నిఖిల్ సంచిని కాళీ చేశారు. ఇక అవినాష్ ను ఊరికే గెలిపించాడు నబీల్.. ఈసారి నబీల్, అవినాష్ కలిసి నిఖిల్‌పై గట్టిగానే ఫైట్ చేశారు. దీంతో నిఖిల్ బ్యాగ్‌లో బాల్స్ లీక్, కానీ నబీల్‌ను గట్టిగా టార్గెట్ చేశాడు నిఖిల్. దీంతో నబీల్ కింద పడిపోయి బ్యాగ్ కాపాడుకున్నాడు. ఈ మధ్యలో గ్యాప్‌లో నబీల్ బ్యాగ్‌లో నుంచి కూడా బాల్స్ బయటపడేసేందుకు అవినాష్ ట్రై చేశాడు.. మొత్తానికి ఈ వారం మెగా చీఫ్ గా అవినాష్ అయ్యాడు.. ఇక ఈరోజు ఎలాంటి టాస్క్ లు ఇస్తాడో చూడాలి..


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×