BigTV English

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో మరో మిడ్ వీక్ ఎలిమినేషన్.. మళ్లీ అదే రిపీట్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో మరో మిడ్ వీక్ ఎలిమినేషన్.. మళ్లీ అదే రిపీట్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 అనేది అన్‌లిమిటెడ్ ట్విస్టులతో ఉంటుందని నాగార్జున ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రంగంలోకి దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది కూడా మునుపటి సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారికే మరోసారి బిగ్ బాస్ 8 ద్వారా అవకాశమిచ్చారు. అయితే వాళ్లు ఎంటర్ అయినప్పటి నుండి ఇద్దరు పాత కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. ఇక ఈ వారంలో జరగనున్న మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఒక రాయల్స్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. అది మరెవరో కాదు గంగవ్వ.


మళ్లీ అదే

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చింది గంగవ్వ (Gangavva). ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో తనదైన స్టైల్‌లో కామెడీ చేయడంతో అది ప్రేక్షకులకు నచ్చింది. దీంతో తను పూర్తిస్థాయి యూట్యూబర్‌గా మారిపోయింది. ఇలాంటి ఒక యూట్యూబర్‌కు బిగ్ బాస్‌లో అవకాశం ఇవ్వడం వల్ల షోకు మంచి రేటింగ్ వస్తుందని భావించారు మేకర్స్. అందుకే తనను బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఆహ్వానించారు. అప్పట్లో కంటెస్టెంట్‌గా ఎంటర్‌టైన్మెంట్ విషయంలో, టాస్కుల విషయంలో అంతగా తన పర్ఫార్మెన్స్ ఏమీ కనిపించలేదు. అంతే కాకుండా కొన్నాళ్ల తర్వాత తన ఆరోగ్యం సహకరించడం లేదని తానే స్వయంగా ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేసింది. మరోసారి అదే జరగనున్నట్టు తెలుస్తోంది.


Also Read: బయటకొచ్చిన బిగ్ బాస్ పోలింగ్ వివరాలు… ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్..

ఎన్నో మార్పులు

బిగ్ బాస్ సీజన్ 8లోకి మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంటర్ అయ్యింది గంగవ్వ. బిగ్ బాస్ 4లోనే తన ఆరోగ్యం బాలేదని స్వయంగా వెళ్లిపోయిన తనను.. మళ్లీ ఇప్పుడు కంటెస్టెంట్‌గా ఎందుకు తీసుకొచ్చారా అని చాలామంది ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే బిగ్ బాస్ 4కి, ఇప్పటి సీజన్‌కు తనలో చాలా మార్పులు వచ్చాయని వారు గమనించారు. వయసు సహకరించక టాస్కులు ఆడకపోయినా.. ఎంటర్‌టైన్మెంట్ అందించే విషయంలో మాత్రం తన ప్రయత్నం తను చేస్తుందని మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇంతలోనే బిగ్ బాస్ 8లో 8వ వారంలో జరగనున్న మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా గంగవ్వ బయటికి వచ్చేయనుందని సమాచారం.

కేసు నమోదు

బిగ్ బాస్ 8 నుండి గంగవ్వను ఎలిమినేట్ చేయడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉందట. ఇటీవల ఆదులపురం గౌతమ్ అనే ఒక యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్.. గంగవ్వపై కేసు నమోదు చేశాడు. రెండేళ్ల క్రితం మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్‌లో ‘గంగవ్వ చిలుక పంచాంగం’ అనే వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో చిలుకను ఉపయోగించారు. అలా జంతువులను, పక్షులను ఉపయోగించడం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఉల్లంఘించినట్టే అని గంగవ్వపై, మరొక యూట్యూబర్ రాజుపై కేసు నమోదయ్యింది. ఇక ఈ కేసు విషయం వల్ల గంగవ్వను బిగ్ బాస్ 8 నుండి కంటెస్టెంట్‌గా తప్పించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×