BigTV English

Bigg Boss 8 Telugu :బయటకొచ్చిన బిగ్ బాస్ పోలింగ్ వివరాలు… ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్..

Bigg Boss 8 Telugu :బయటకొచ్చిన బిగ్ బాస్ పోలింగ్ వివరాలు… ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్..

Bigg Boss 8 Telugu : బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఏకైక షో బిగ్ బాస్.. తెలుగులో ఎనిమిదోవ సీజన్ ఎనిమిదోవ వారం జరుపుకుంటుంది.. ఈ వారం నామినేషన్స్ కాస్త ఘాటుగానే జరిగాయి. ఈ వారం హౌస్ లో జరిగిన నామినేషన్ లో పృథ్వి, నిఖిల్, ప్రేరణ, రోహిణి, మెహబూబ్, విష్ణు ప్రియా, నయని నామినేట్ అయ్యారు. హరితేజను సేవ్ చేసాడు మెగా చీఫ్ గౌతమ్.. బిగ్ బాస్ మరో ఏడో వారాలు మాత్రమే ఉండటం తో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారా అనే ఆసక్తి జనాల్లో మొదలైంది. అయితే మొన్నటివరకు టాప్ ఉన్న వాళ్ళే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారో ఒకసారి చూసేద్దాం..


ఓటింగ్ లో టాప్ లోకి ప్రేరణ.. 

సీజన్ మొదలైనప్పటి నుంచి ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్న నిఖిల్ ఇప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయారు. నిఖిల్‌ ను వెనక్కు నెట్టి ప్రేరణ మొదటి స్థానంలో ఉంది. నామినేషన్స్‌లో ఉన్నవారికంటే ప్రేరణకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయట.. ఈమెకు ఈ వారం ఓట్లు బాగానే పడ్డాయనే టాక్ వినిపిస్తుంది. ఆడియన్స్ కు ప్రేరణ తీరు, ఆట నచ్చడంతో ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఆటలో శివంగిలా పోరాడుతుంది. ఎవరి సపోర్ట్‌ లేకపోయినా సింగిల్‌గా ఫైట్‌ చేస్తుంది. ఈ మధ్య పృథ్వీ ఆమెను టార్గెట్‌ చేయడంతో తనపై కాస్త సింపతీ కూడా వర్కవుట్‌ అయింది.. ఇక ఈ సీజన్‌ లో హౌస్‌ అంతా మణికంఠకు వ్యతిరేకంగా నిలబడ్డారు. దీంతో ప్రతివారం నామినేషన్‌లో ఉన్నా సరే సేవ్‌ అవుతూ వచ్చాడు. చివరకు ఒత్తిడి తట్టుకోలేక తనంతట తానే ఎలిమినేట్‌ అయ్యాడు.


ఇక పృథ్వి, నయని పావని మధ్య గట్టి ఫైట్ నడుస్తుంది. ప్రేరణను ఆడనివ్వకుండా అడ్డుపడ్డారు. అప్పుడామె కన్నీళ్లు పెట్టుకుంటే కూడా హౌస్‌లో ఎవరూ తనను ఓదార్చలేదు, సపోర్ట్‌ చేయలేదు. చివరాఖరకు యష్మి సపోర్ట్‌గా నిలబడ్డప్పటికీ ఆమె మొసలి కన్నీళ్లను ఎవరూ నమ్మలేదు. మరి ప్రేరణ మున్ముందు వారాల్లోనూ ఓటింగ్‌లో ఇదే దూకుడు ప్రదర్శిస్తే విన్నర్ అవ్వడం పక్కా.. ఇక ఈ వారం పృథ్విని ఎక్కువ మంది నామినేట్ చేసారు.. మరి ఈ వారం పృథ్వి ఎలిమినేట్ అవుతాడని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. చూద్దాం మరి ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో.. ఇక ఈ సీజన్ మొత్తం కన్నడ బ్యాచ్ ను దించారని వార్తలను బిగ్ బాస్ మూటగట్టుకుంది..

ఇక ఈరోజు ప్రోమో విషయానికొస్తే.. పట్టుకో, కార్ట్ లో పెట్టుకో అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.. రైతులు ఎలా కష్టపడుతున్నారు అనేది ఇందులో చూపించారు. బస్తాల కోసం హౌస్ లోని వాళ్ళు భీకర యుద్ధం చేసారు. ఈరోజు ఎపిసోడ్ రసవత్తరంగా సాగనుంది. మరి ఎపిసోడ్ ఎలా ఉందో తెలియాలంటే ఈరోజు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ ను చూడాల్సిందే..

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×