Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. ఇక తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా తను నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చాడు. తను హౌస్‌లోకి వచ్చి, కంటెస్టెంట్స్‌తో కబుర్లు చెప్పి, వారితో కలిసి కామెడీ చేయడం మాత్రమే కాకుండా కిచెన్ టైమ్‌ను పెంచి వెళ్లాడు. అంతే కాకుండా అవినాష్‌కు స్పెషల్‌గా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అంతే కాకుండా చివరి మెగా చీఫ్ ఎవరు అవుతారు అని జరిగిన పోటీలో అయిదుగురు మెగా చీఫ్ కంటెండర్లు సెలక్ట్ అయ్యారు. వారి మధ్య టాస్కులు కూడా మొదలయ్యాయి.
మెకానిక్ రాకీగా విశ్వక్
నవంబర్ 22న ‘మెకానిక్ రాకీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ చాలా కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ 8లోకి కంటెస్టెంట్స్‌ను కలవడానికి వచ్చాడు. అంతే కాకుండా వారితో ప్రమోషన్స్ చేయించడానికి ట్రై చేశాడు. హౌస్ లోపలికి రాగానే అందరినీ సరదాగా పలకరించిన తర్వాత ఈ ప్రమోషన్స్ ద్వారా తనకు కనీసం 200 టికెట్స్ అమ్ముడుపోయాయని అనిపిస్తే వారికి కిచెన్ టైమ్‌లో 2 గంటలు పెంచుతానని మాటిచ్చాడు. ‘మెకానిక్ రాకీ’ నుండి డైలాగులు చెప్పి అందరినీ ఎంటర్‌టైన్ చేశాడు. ఆ తర్వాత అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై బయట ట్రోల్స్ ఎలా జరుగుతున్నాయో హింట్ ఇచ్చాడు.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టికి గాయాలు.. అయ్యో పాపం పడిందా…
ట్రోల్స్ చేస్తారు
బిగ్ బాస్‌లో తాను ఏం మాట్లాడాలన్నా చాలా శ్రద్ధగా మాట్లాడుతున్నానని లేకపోతే ట్రోల్ చేస్తారేమో అని భయమేస్తుందని అన్నాడు. అలా కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు అంటూ కూర్చునే విధానంపై కూడా ట్రోల్ చేస్తారని అన్నాడు. ఒక ఫీమేల్ కంటెస్టెంట్‌ను చూసి కాస్త నవ్వినా కూడా దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసి వైరల్ చేస్తారని చెప్పాడు. బయట మనుషులు చాలా డేంజర్ ఉన్నారని వారికి హింట్ ఇచ్చాడు. ఆ తర్వాత విష్ణుప్రియా గురించి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతూ.. తను పృథ్విపై చూపించే ప్రేమలో కొంచెమైనా తనకు ఎవరైనా చూపిస్తే కచ్చితంగా వారిని వదులుకోనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత అవినాష్, రోహిణితో కలిసి స్కిట్ చేశాడు.
గిఫ్ట్ ఇచ్చాడు
రోహిణి, విశ్వక్ సేన్, అవినాష్ కలిసి స్కిట్ చేసి అందరినీ ఎంటర్‌టైన్ చేశారు. స్కిట్ అయిపోగానే అవినాష్ వచ్చి విశ్వక్ సేన్ టీషర్ట్ ఇవ్వమని కోరాడు. నీకు టీషర్ట్ ఇచ్చేస్తే నేనేం వేసుకోవాలి అనగానే నా టీషర్ట్ ఇస్తానని అన్నాడు అవినాష్. వెంటనే టీషర్ట్ తీసుకొని రమ్మని, తన టీ షర్ట్ ఇస్తానని చెప్పాడు. దీంతో అవినాష్ వెళ్లి తన కొత్త టీషర్ట్ తీసుకొచ్చి విశ్వక్ సేన్ టీషర్ట్ కొట్టేశాడు. ఇక వెళ్లిపోయే ముందు కిచెన్ టైమ్‌ను 2 గంటలు పెంచి వెళ్లాడు విశ్వక్ సేన్. చివరిగా రోహిణి, టేస్టీ తేజ, విష్ణుప్రియా, పృథ్వి, యష్మీ మధ్య మెగా చీఫ్ పోటీ మొదలవ్వగా.. అందులో ఫస్ట్ రౌండ్ పూర్తయ్యే సమయానికి టేస్టీ తేజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. యష్మీ చివరి ప్లేస్‌లో ఉంది.