BigTV English

Bigg Boss 11 Kannada : బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టికి గాయాలు.. అయ్యో పాపం పడిందా…

Bigg Boss 11 Kannada : బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టికి గాయాలు.. అయ్యో పాపం పడిందా…

Bigg Boss 11 Kannada : వరల్డ్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతి సీజన్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఒకవైపు విమర్శలు వచ్చినా మరోవైపు మాత్రం టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. ప్రతి ఇండస్ట్రీలోను ఈ షో మంచి పాపులారిటిని సొంతం చేసుకున్నాయి. తెలుగులో 8 వ సీజన్ ప్రసారం అవుతుంది. ఈ సీజన్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇక కన్నడలో మాత్రం 11 వ సీజన్ ను జరుపుకుంటుంది. అయితే ఈ కన్నడ బిగ్ బాస్ లోకి రీసెంట్ గా సీరియల్ యాక్టర్ శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈమెకు టాస్క్ లో గాయాలు తగిలినట్లు తెలుస్తుంది.


తెలుగు బిగ్ బాస్ గత సీజన్ లో తన ఆటతో అందరిని మెప్పించింది. ఇక ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్‌లో శోభాశెట్టి కన్నింగ్ గేమ్‌కి మెచ్చి ఆమెకు కన్నడ బిగ్ బాస్‌లో అవకాశం ఇచ్చారు. ఈ వైల్డ్ కంటెస్టెంట్‌ని వైల్డ్ కార్డ్‌గా కన్నడ బిగ్ బాస్ హౌస్‌లోకి పంపారు. అక్కడ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన ఆట మాటతో ఆకట్టుకుంటుంది. కన్నడ అలా హౌస్‌లోకి వెళ్లిందో లేదో.. ఆమెలోని మోనితను నిద్రలేపుతూ.. రియల్ క్యారెక్టర్‌ని బయటపెట్టేసింది. వెళ్లడం వెళ్లడమే హౌస్‌లో వాళ్లతో గొడవలు వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఈమె వెళ్లే వరకూ హౌస్ అంతా ప్రశాంతంగానే ఉంది. ఇక ఈమె వెళ్లడంతో కన్నడ బిగ్ బాస్‌లో కల్లోలం మొదలైంది. ఏ ప్రోమో చూసినా కూడా ఈమె గోంతే ఎక్కువగా వినిపిస్తుంది..

తెలుగుతో పోలిస్తే కన్నడ బిగ్ బాస్‌లో టాస్క్‌లు ఇంట్రస్టింగ్‌గా జరుగుతున్నాయి. తెలుగులో కిల్లర్ టాస్క్ మాదిరే అక్కడ కూడా ఒక టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్‌లో పై నుంచి కింద పడ్డ శోభాశెట్టికి నడుము విరిగినంత పని అయ్యింది. హౌస్‌లో ఉన్న వాళ్లు రెండు గ్రూప్‌లుగా డివైడ్ చేసి వాళ్లకి ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చారు.. ఆ టీమ్ లకు ఇచ్చిన బ్యాగ్లతో ఆ టాస్క్ ను పూర్తి చెయ్యాల్సి ఉంది. హౌస్ లో ఏర్పాటు చేసిన ఎత్తైన స్తంభానికి వేలాడదీశారు. వాటిని దక్కించుకోవాలంటే.. నలుగురు వ్యక్తులు స్ట్రెక్చర్‌పై తీసుకుని వచ్చి పైకి లేపుతారు. ఆ స్ట్రెక్చర్‌పై నుంచే ఆ బ్యాగ్‌ని తీసుకోవాలి. అలా శోభాశెట్టి.. చాలా ఫాస్ట్‌గా వచ్చి.. స్ట్రెక్చర్‌పై నుంచే ఆ బ్యాగ్‌కి ఉన్న ముడులన్నింటినీ విప్పేసి.. శోభ శెట్టి దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఫాస్ట్ గా తిరిగి వెళ్తున్న టైం లో శోభా కింద పడింది. ఈ క్రమంలో గాయాలు తగిలినట్లు తెలుస్తుంది. ప్రమాదకరమైన గాయాలు తగిలాయో లేదో తెలియాల్సి ఉంది.. ఈ ఎపిసోడ్ కు సంబందించిన వీడియోను శోభా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Shobha Shetty (@shobhashettyofficial)

Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×