Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారానికి చేరుకుంది. అందుకే గొడవలు, అల్లర్లు ఏమీ లేకుండా కంటెస్టెంట్స్ అంతా కబుర్లు చెప్పుకుంటూ, ఖాళీగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగే మునుపటిలాగా కిచెన్ టైమ్ లిమిట్ లేకుండా అన్‌లిమిటెడ్‌గా మార్చేశారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అంతా తమకు నచ్చింది వండుకుంటూ సరదాగా కాలాన్ని గడిపేస్తున్నారు. అందులో భాగంగానే పెద్దగా వంట రాని నబీల్, అవినాష్ కలిసి బిగ్ బాస్‌కు బజ్జీలు చేసి ఇచ్చారు. ఆ బజ్జీలు బాగున్నాయని, కానీ కొన్నే ఇచ్చారని బిగ్ బాస్ ఫీలయ్యాడు. అలా బజ్జీల వంకతో కాసేపు కంటెస్టెంట్స్‌ను ఆడుకున్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్టులు వచ్చి హౌస్‌లో సందడి చేశారు.
బజ్జీలు కావాలి
బజ్జీలు వేసి బిగ్ బాస్‌కు ఇవ్వగానే కొంచెం పంపిచారని ఆయన ఫీల్ అయ్యారని, దీంతో మరికొన్ని బజ్జీలు వేసి పంపించారు. అవి కూడా సరిపోలేదని, కొంచమే పంపిస్తున్నారని అవినాష్‌ను పిసినారి అన్నాడు బిగ్ బాస్. అందుకే మళ్లీ కష్టపడి ఇంకొన్ని బజ్జీలు వేసి బిగ్ బాస్‌కు ఇవ్వబోయాడు అవినాష్. ఇంతలోనే కంటెస్టెంట్స్ కోసం పిజ్జా సర్‌ప్రైజ్ సిద్ధంగా చేశారు బిగ్ బాస్. అలా వారంతా పిజ్జా తిని ఎంజాయ్ చేయడంతో పాటు మా పరివారంలోని మరికొందరు సీరియల్ ఆర్టిస్టులతో తలపడ్డారు. ముందుగా హౌస్‌లోకి ‘వంటలక్క’ సీరియల్ ఫేమ్ కృష్ణ, వైష్ణవి వచ్చారు. వారితో కాసేపు ఫన్నీ యాక్టివిటీ ఆడి కంటెస్టెంట్స్ అంతా రిలాక్స్ అయ్యారు. కోతిలాగా అవినాష్ బాగా యాక్ట్ చేశాడు.
Also Read: మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో అవినాష్ ఔట్.. బిగ్ బాస్ 8 వల్ల ఎంత సంపాదించాడంటే?
చిన్నప్పటి జ్ఞాపకాలు
కృష్ణ, వైష్ణవితో కలిసి టాస్క్ ఆడారు కంటెస్టెంట్స్. ఆ టాస్క్ గెలిస్తే ప్రైజ్ మనీ మరింత పెరుగుతుంది. అయితే ఇప్పటివరకు మా పరివారం నుండి వచ్చిన అందరితో కంటెస్టెంట్స్ టాస్కులు ఆడారు. ఆ టాస్కులు అన్నింటిలో బీబీ పరివారమే గెలిచి రికార్డ్ సాధించారు. వైష్ణవ్, కృష్ణతో ఆడిన టాస్క్‌లో కూడా బీబీ పరివారమే గెలిచింది. కృష్ణ, వైష్ణవి వెళ్లిపోయిన తర్వాత ‘మగువ ఓ మగువ’ సీరియల్ నుండి చంటి, సింధూర వచ్చారు. ముందుగా వారు కంటెస్టెంట్స్ చిన్నప్పటి జ్ఞాపకాలను అడిగి తెలుసుకున్నారు. అందులో ముందుగా అవినాష్.. స్కూల్‌లో చీటింగ్ ఎలా చేసేవాడో చెప్పి అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత ప్రేరణ.. తను చిన్నప్పుడు కుర్చీలో నుండి పడిపోయి తలకు గాయమయిన సంఘటనను గుర్తుచేసుకుంది.
పాపం నబీల్
చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న తర్వాత చంటి, సింధూరతో కలిసి మరొక టాస్క్ ఆడారు కంటెస్టెంట్స్. ఆ సరదా టాస్కులో అవినాష్‌ను అందరి గురించి ఫేక్ ముచ్చట్లు చెప్పాడు. కంటెస్టెంట్స్‌తో దెబ్బలు తిన్నాడు. ఇక నబీల్ అయితే రెండు ఉల్లిపాయలు, పచ్చిమిర్చీ తినాల్సి వచ్చింది. నిఖిల్ తన క్రియేటివ్ డ్యాన్స్‌తో అందరినీ అలరించాడు. అలా సరదా టాస్క్ ముగిసిన తర్వాత సీరియస్ టాస్క్ మొదలయ్యింది. ప్రైజ్ మనీ పెంచుకోవడం కోసం చంటి, సింధూరతో తలపడ్డారు గౌతమ్, ప్రేరణ. ఈ టాస్క్‌లో కూడా బీబీ పరివారమే గెలిచి ప్రైజ్ మనీని మరింత పెంచుకోవడంతో పాటు ఈ టాస్కులను క్లీన్ స్వీప్ చేసింది. అలా బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ ఆర్టిస్టులు రాక ముగిసింది.