BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో అవినాష్ ఔట్.. బిగ్ బాస్ 8 వల్ల ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 8 Telugu: మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో అవినాష్ ఔట్.. బిగ్ బాస్ 8 వల్ల ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చారు. అందులో అవినాష్ కూడా ఒకడు. బిగ్ బాస్ సీజన్ 4లో కూడా అవినాష్ కంటెస్టెంట్‌గా వచ్చాడు. కానీ ఆ సీజన్‌లో తను ఇంతకాలం హౌస్‌లో ఉండలేకపోయాడు. త్వరగానే ఎలిమినేట్ అయ్యాడు. కానీ బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఫైనల్స్ వరకు ఉన్నాడు. అంతే కాకుండా ఈ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్ కూడా అయ్యాడు. అలాంటి అవినాష్‌పై మిడ్ వీక్ ఎలిమినేషన్ వేటు పడిందని తెలుస్తుంది. విన్నర్ కాకపోయినా మంచి లాభాలతో ఇంటికి తిరిగి వెళ్తున్నాడని సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ 8 వల్ల తను ఎంత సంపాదించడానే వివరాలు బయటికొచ్చాయి.


లాభంతో వెళ్తున్నాడు

బిగ్ బాస్ సీజన్ 8లో 8వ వారంలో అడుగుపెట్టాడు అవినాష్. ప్రస్తుతం అవినాష్ కామెడియన్‌గా పలు షోస్‌లో కనిపిస్తున్నాడు. ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. అందుకే మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా రావడం కోసం తను భారీగానే డిమాండ్ చేశాడట. మొత్తానికి మిడ్ వీక్ నుండి ఎలిమినేట్ అవుతున్నా కూడా తనకు రూ.34 లక్షలు రెమ్యునరేషన్ అందుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా తను వెళ్లిపోయే ముందు ప్రైజ్ మనీ నుండి రూ.10 లక్షలు కూడా అందుకున్నాడని తెలుస్తోంది. అలా మొత్తంగా రూ.44 లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లిపోతున్నాడని టాక్. ఇది తెలిసిన ప్రేక్షకులు.. ఈ సీజన్ వల్ల తనకు బాగానే లాభం వచ్చిందని ఫీలవుతున్నారు.


Also Read: బిగ్ బాస్ 8 లో విష్ణు ప్రియా ఎంత సంపాదించిందో తెలుసా..?

అవకాశాన్ని దక్కించుకున్నాడు

మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఫినాలే వీక్ వచ్చేసరికి ఒక సూట్‌కేస్ లోపలికి వస్తుంది. అందులో కొంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్‌ను తీసుకొచ్చి అప్పటికప్పుడు ఏ కంటెస్టెంట్ అయినా బిగ్ బాస్ నుండి తప్పుకోవచ్చని ఆఫర్ ఇస్తారు. అలా బిగ్ బాస్ 8లోకి వచ్చిన రూ.10 లక్షల ఆఫర్‌ను అవినాష్ అందుకున్నాడని అర్థమవుతోంది. ఈసారి బిగ్ బాస్‌లో ప్రైజ్ మనీకి సంబంధించిన అమౌంట్‌ను కంటెస్టెంట్సే టాస్కులు ఆడి సంపాదించుకున్నారు. అలా దాదాపుగా వారి ఖాతాలో రూ.56 లక్షల ప్రైజ్ మనీ వచ్చి చేరింది. ఆ ప్రైజ్ మనీ నుండి రూ.10 లక్షలు అవినాష్ తీసుకెళ్లిపోతున్నాడు కాబట్టి విన్నర్‌గా దక్కే అమౌంట్‌లో రూ.10 లక్షలు తగ్గుతుంది.

ఎంటర్‌టైన్మెంట్.. ఎంటర్‌టైన్మెంట్..

బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంటర్ అయినప్పటి నుండి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో అస్సలు ఫెయిల్ అవ్వలేదు అవినాష్. ఎన్నోసార్లు కిచెన్ టైమింగ్ అయిపోయినా కూడా తన ఎంటర్‌టైన్మెంట్‌తోనే ఆ టైమర్‌ను మళ్లీ ప్రారంభించి కంటెస్టెంట్స్‌గా హ్యాపీగా వంట చేసుకునేలా చేశాడు. అంతే కాకుండా ప్రేక్షకులకు ఎప్పుడు బోర్ కొడుతుందని అనిపించినా ఇతర కంటెస్టెంట్స్‌తో కలిసి వారిని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశాడు. అలా ఇప్పటివరకు ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాని అవినాష్.. టాప్ 5కు చేరుకున్నా కూడా ముందుగా ఎలిమినేట్ అయ్యేవారిలో తన పేరే ఉండడం వల్ల తన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×