BigTV English

OTT Movie : స్విమ్మింగ్ ఫూల్ లో ఇరుక్కుపోయిన అక్కా, చెల్లెలు… నైట్ అంతా ఏం చేశారంటే

OTT Movie : స్విమ్మింగ్ ఫూల్ లో ఇరుక్కుపోయిన అక్కా, చెల్లెలు… నైట్ అంతా ఏం చేశారంటే

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలు ఎక్కువగా యూత్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అయితే సిస్టర్ సెంటిమెంట్ తో ఒక మూవీ థియేటర్ లలో మంచి విజయం సాధించింది. ఈ మూవీని ఒక ఫీల్ గుడ్ స్టోరీ తో తెరమీదకు తీసుకువచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ హాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘12 ఫీట్ డీప్‘, (12 feet Deep). ఒక స్విమ్మింగ్ ఫూల్ లో అక్క, చెల్లెలు ఇరుక్కుపోతారు. వాళ్లు అందులో నుంచి ఎలా బయటికి వస్తారు అనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

బ్రీ అనే అమ్మాయి స్విమ్మింగ్ ఫూల్ లో టైం స్పెండ్ చేయడానికి వస్తుంది. కాసేపటి తర్వాత అక్కడికి బ్రీ సిస్టర్ జోనా కూడా వస్తుంది. వీళ్ళిద్దరూ కలసి స్విమ్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ ఫుల్ మేనేజర్ ఆరోజు ఒక పార్టీ ఉండటంతో, తొందరగా వెళ్లాలని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. అందరూ వెళ్ళిపోతారు. వీళ్లు కూడా వెళ్దాం అనుకునేలోగా బ్రీ ఎంగేజ్మెంట్ రింగ్ ఫుల్ లో పడిపోతుంది. దానిని తీసుకుంటూ ఉండగా, ఫుల్ మేనేజర్  అందరూ వెళ్లిపోయారు అనుకుని ఫూల్ టాప్ ను క్లోజ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఫూల్ లోనే ఉండిపోవటంతో, బయటికి వెళ్లే మార్గం కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా వారికి బయటికి వెళ్ళే మార్గం కనిపించదు. అక్కడ వీళ్ళిద్దరూ వారి విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంగేజ్మెంట్ చేసుకొని, నన్ను పట్టించుకోకుండా ఉన్నావంటూ జోనా, బ్రీే తో అంటుంది. వీరి మాటల్లో జోనా ఆ రింగ్ ని ఫుల్ లో పడేసిందని బ్రీ తెలుసుకుంటుంది. ఆమెపై బ్రీ కోపం పెంచుకుంటుంది.

అయినా సిస్టర్ కావడంతో ఆమెను ఏమీ అనలేక పోతుంది. జోనా కు ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఫూల్ లో వారి ఫీలింగ్స్ చెప్పుకొని కంటతడి పెట్టుకుంటారు. అయితే బ్రీ లోబీపీ తో అక్కడ శక్తి కోల్పోతూ ఉంటుంది. స్విమ్మింగ్ ఫూల్ లోకి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి వస్తుంది. అయితే ఆమె వీరికి హెల్ప్ చేయకుండా, ఆ డైమండ్ రింగ్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా అక్కడ నుంచి బయటికి వెళ్తుంది. బ్రీ ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో, ఆమె బాయ్ ఫ్రెండ్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఫూల్ లో పనిచేసే అమ్మాయి, పోలీసులు వస్తే దొరికిపోతానని భయపడుతుంది. చివరికి ఆ స్విమ్మింగ్ ఫూల్ లోకి పోలీసులు వస్తారా? పనిచేసే అమ్మాయి సిస్టర్స్ ని చంపుతుందా? ఆ స్విమ్మింగ్ ఫూల్ నుంచి వీళ్ళు బయట పడతారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×