Tea Strainer: టీ స్ట్రైనర్ ప్రతి ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే ఈ ఫిల్టర్ సరిగా శుభ్రం చేయకపోవడం లేదా కొన్నిసార్లు కాలిపోవడం వల్ల నల్లగా మారుతుంది. సమయానికి సరిగ్గా శుభ్రం చేయకపోతే, నల్లని మరకలను తొలగించడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు టీ స్ట్రైనర్ శుభ్రం చేసుకోవాలి. మరి మురికిగా మారిన స్ట్రైనర్ లను కూడా తెల్లగా మార్చేయొచ్చు.
పూర్తిగా నల్లబడిన టీ స్ట్రైనర్‌ను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. దీని కోసం, కొన్ని చిట్కాలు మీకు చాలా సహాయపడతాయి. అలాంటి 5 చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టీ స్ట్రైనర్‌ను ఎలా శుభ్రం చేయాలి ?
1. కావలసినవి:
బేకింగ్ సోడా
వెనిగర్
పాత టూత్ బ్రష్
శుభ్రం చేసే విధానం: ముందుగా స్ట్రైనర్‌ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత దానిపై బేకింగ్ సోడా చల్లి పాత టూత్ బ్రష్‌తో రుద్దండి.అనంతరం వెనిగర్ అప్లై చేసి మరో సారి క్లీన్ చేయండి. కొన్ని నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. తర్వాత శుభ్రమైన నీటితో వాస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎంత మురికిగా ఉన్న స్ట్రైనర్ అయినా తెల్లగా మెరిసిపోతుంది.
2.కావలసినవి:
ఉప్పు
నిమ్మకాయ
పాత టూత్ బ్రష్
శుభ్రం చేసే విధానం: ముందుగా స్ట్రైనర్‌ను గోరువెచ్చని నీటితో కడగాలి. తర్వాత దానిపై ఉప్పు చల్లి నిమ్మరసంతో రుద్దాలి. తర్వాత కొన్ని నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. అనంతరం వేడి నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే చాలు టీ స్ట్రైనర్ తెల్లగా మెరిసిపోతుంది.
3. కావలసినవి:
డిష్ వాషింగ్ లిక్విడ్
హాట్ వాటర్
పాత టూత్ బ్రష్
శుభ్రం చేసే విధానం : డిష్ వాషింగ్ లిక్విడ్‌ను వేడి నీళ్లలో మిక్స్ చేసి స్టయినర్ ను ఈ ద్రావణంలో కాసేపు నానబెట్టాలి. తర్వాత పాత టూత్ బ్రష్ తో స్క్రబ్ చేసి శుభ్రమైన నీటితో కడగాలి.
4. కావలసినవి:
వెనిగర్
నీరు
నిమ్మరసం
శుభ్రం చేసే విధానం: సమాన పరిమాణంలో వెనిగర్, నీరు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని టీ స్ట్రైనర్ పై రుద్దండి. తర్వాత పాత బ్రష్‌తో క్లీన్ చేయండి. తర్వాత ఇందులో కాస్త నీరు వేసి స్ట్రైనర్ ద్రావణంలో కొంత సమయం పాటు నానబెట్టండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి.
5. కావలసినవి:
ఫుడ్ సోడా
హాట్ వాటర్
శుభ్రం చేసే విధానం: ఫుడ్ సోడాను వేడి నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను స్ట్రైనర్‌పై అప్లై చేసి రుద్దండి. కాసేపు ఇలాగే వదిలేయండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి.
Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే మీ ఇల్లు మెరిసిపోతుంది తెలుసా ?
కొన్ని అదనపు చిట్కాలు:
ఫిల్టర్‌పై నల్లదనం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండండి.
ఫిల్టర్ కడిగిన తర్వాత, పొడి ప్రదేశంలో ఉంచండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.