BigTV English

Bigg Boss 8 Telugu: సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణ.. అదే నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అంటున్న అవినాష్

Bigg Boss 8 Telugu: సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణ.. అదే నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అంటున్న అవినాష్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్స్‌కు ఇంకా కొన్ని గంటలే ఉంది. అందుకే కంటెస్టెంట్స్ అంతా ఇప్పటివరకు తాము పడిన కష్టమంతా మర్చిపోయి ఈ కొంత సమయాన్ని బిగ్ బాస్ హౌస్‌లో పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. బిగ్ బాస్ కూడా ఇక వారు గొడవపడే టాస్కులు ఏమీ ఇవ్వడం లేదు. తాజాగా తాము హౌస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని బ్లాక్ చేయాలనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడిగారు. అంతే కాకుండా తమ జీవితంలోని బెస్ట్ అండ్ వరస్ట్ మూమెంట్స్‌ను కూడా షేర్ చేసుకోమన్నారు. అలా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది.


సోనియా వద్దు

ముందుగా ప్రేరణ వచ్చి తాను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత దాదాపు అందరితో మళ్లీ టచ్‌లో ఉంటానని ఫ్రెండ్‌షిప్ చేస్తానని చెప్పుకొచ్చింది. సోనియాను మాత్రమే బ్లాక్ చేస్తానని చెప్పింది. తను హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నామినేషన్స్ సమయంలో తిరిగొచ్చినా కూడా తనతో పాటు నెగిటివిటీని తీసుకొచ్చిందని ఓపెన్‌గా చెప్పేసింది ప్రేరణ. మిగతా కంటెస్టెంట్స్ కూడా తాము అందరినీ ఫాలో అవుతామని అన్నారు. గౌతమ్ అయితే పృథ్విని బ్లాక్ చేస్తానని చెప్పాడు. తమరి ఆలోచనలు ఎప్పుడూ కలిసేవి కాదని, అందుకే ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవని గుర్తుచేసుకున్నాడు. అవినాష్ కూడా తనను ఎప్పుడూ నామినేట్ చేసేవాడు కాబట్టి పృథ్వినే బ్లాక్ చేస్తానని అన్నాడు.


Also Read: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈసారి కూడా..?

నింద వేసింది

నబీల్ కూడా సోనియా, హరితేజను బ్లాక్ చేస్తానని చెప్పాడు. హరితేజ ఎలిమినేట్ అయ్యి వెళ్లేటప్పుడు కూడా పాములాగా పగ పెట్టుకుంటాను అని చెప్తూ వెళ్లిందని బయటపెట్టాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేస్తానని అన్నాడు. బేబక్క తనపై చాలా నెగిటివ్ అభిప్రాయం పెంచుకుందని, ఇక నామినేషన్స్ కోసం సీత మళ్లీ హౌస్‌లోకి వచ్చినప్పుడు తనపై వేసిన నింద కరెక్ట్ కాదని తెలిపాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా తమ జీవితంలోని బెస్ట్, వరస్ట్ మూమెంట్స్‌ను గుర్తుచేసుకున్నారు. ముందుగా నబీల్ బిగ్ బాస్‌లోకి రావడం తన బెస్ట్ మూమెంట్ అన్నాడు. ఇంటర్‌లో జాయిన్ అయ్యే ముందు తనకు జరిగిన యాక్సిడెంట్ వరస్ట్ అని తెలిపాడు.

చదువు ఆగిపోయింది

నిఖిల్‌కు చదువుకున్న సమయంలోనే సినిమా ఆఫర్ వచ్చిందని, దానికోసం చదువును పక్కన పెట్టుకున్నానని, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉండి తిట్లు తినడం తన వరస్ట్ మూమెంట్ అన్నాడు. ఆ తర్వాత సీరియల్ యాక్టర్ అవ్వడం తన బెస్ట్ మూమెంట్ అని చెప్పాడు. గౌతమ్ కూడా బిగ్ బాస్‌లోకి రావడమే తన బెస్ట్ మూమెంట్ అన్నాడు. వరస్ట్ అంటే తన బ్రేకప్ అని తెలిపాడు. అవినాష్ జీవితంలో బెస్ట్ మూమెంట్ అంటే బిగ్ బాస్ 4 ఫైనల్స్‌కు చిరంజీవి వచ్చినప్పుడు తనను రాజబాబు లాంటి కామెడియన్‌తో పోల్చడం తాను మర్చిపోలేనని గుర్తుచేసుకున్నాడు. ఇక తన బిడ్డ చనిపోవడం తన జీవితంలోనే వరస్ట్ మూమెంట్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అవినాష్.

Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×