Bigg Boss 8 Telugu Latest Episode Highlights: ప్రతీ సీజన్ లాగా బిగ్ బాస్ 8లో విన్నర్ అయ్యేవారికి ఎంత ప్రైజ్ మనీ వస్తుందనే విషయం ముందుగా చెప్పలేదు మేకర్స్. ఈసారి ప్రైజ్ మనీ జీరో అని, కంటెస్టెంట్స్ అంతా ఆటలు ఆడి ఆ జీరోకు అన్‌లిమిటెడ్ అమౌంట్‌ను యాడ్ చేయవచ్చని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పటికీ కంటెస్టెంట్స్ అంతా కష్టపడి ప్రైజ్ మనీని రూ.54,30,000కు తీసుకొచ్చారు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఆ ప్రైజ్ మనీ గెలిస్తే ఎవరెవరు ఏం చేస్తారు అనే విషయాన్ని చెప్పమని అడిగారు నాగార్జున. దీంతో కంటెస్టెంట్స్ అంతా ప్రైజ్ మనీపై తమకు ఉన్న ఆశలను బయటపెట్టారు. అంతే కాకుండా కంటెస్టెంట్స్‌లో ఎవరికి థాంక్యూ, ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారో కూడా చెప్పారు.
ప్రైజ్ మనీపై ఆశలు
ముందుగా అవినాష్.. ప్రైజ్ మనీని గెలిస్తే తన అన్నయ్య కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నానని అన్నాడు. తన అన్నయ్యకు ముగ్గురు కూతుళ్లు అని, అందులో పెద్ద కూతురి పెళ్లికి ప్రైజ్ మనీతో ఆర్థిక సాయం అందించాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ప్రేరణ విషయానికొస్తే.. తన అమ్మనాన్నలకు ఉన్న అప్పులు తీర్చేస్తానని, ఆ తర్వాత మిగిలిన ప్రైజ్ మనీ అమౌంట్‌తో ఎక్కడైనా పెట్టుబడి పెడతానని తెలిపింది. నబీల్ ఏమో తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని గుర్తుచేస్తూ ప్రైజ్ మనీతో సినిమా తెరకెక్కిస్తానని అన్నాడు. ఇప్పటికే తాను ఒక వెబ్ సిరీస్ ప్రారంభించినా కూడా డబ్బులు లేక అది ఆపేయాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నాడు.
Also Read: రోహిణి ఎలిమినేట్..8 వారాలకు ఎంత రెమ్యునరేషన్ అందుకుందంటే..?
అందరికీ పంచుతాను
విష్ణుప్రియా మాత్రం అందరికంటే భిన్నంగా ప్రైజ్ మనీని ఎలా ఉపయోగిస్తుందో చెప్పింది. ఆదిత్య ఓం ఎప్పుడూ తన ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్లలేదు కాబట్టి తన డబ్బులతో ఆ ట్రిప్‌కు పంపిస్తానని, మణికంఠకు నానో కార్ కొనిస్తానని, గంగవ్వకు కాస్త ఆర్థిక సాయం అందిస్తానని, పృథ్వికి బంగారపు చెవిపోగు చేయిస్తానని బయటపెట్టింది. గౌతమ్ కూడా గంగవ్వకు ప్రైజ్ మనీలో రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని అన్నాడు. అలా గంగవ్వకు ఆర్థిక సాయం చేయడానికి కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ఇక కంటెస్టెంట్స్‌లో ఎవరికి థాంక్యూ, ఎవరికి సారీ చెప్తారని అడగగా.. నిఖిల్, గౌతమ్ ఒకరికొకరు పడిన గొడవలను గుర్తుచేసుకొని సారీ చెప్పుకున్నారు.
థాంక్యూ, సారీ
విష్ణుప్రియా అయితే సీతకు థాంక్యూ చెప్పింది. తనకు హౌస్‌లో ఎమోషనల్ సపోర్ట్‌గా ఉందని కారణం చెప్పింది. రోహిణిని తన మాటలతో హర్ట్ చేశానని సారీ చెప్పింది. నబీల్ అయితే మణికంఠకు థాంక్యూ చెప్పాడు. తన మనసులో ఏం అనిపించినా ఎప్పటికప్పుడు తనకు చెప్పుకునేవాడిని అని గుర్తుచేసుకున్నాడు. మొదట్లో ప్రేరణను నామినేట్ చేసినందుకు తనకు సారీ చెప్పాడు. నిఖిల్.. తన ఫ్రెండ్ పృథ్వికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ అయితే పెళ్లయ్యి ఏడాది కాకపోయినా తనను బిగ్ బాస్‌కు పంపినందుకు తన ఫ్యామిలీకి థాంక్యూ చెప్పింది. విష్ణుప్రియాతో మొదట్లో గొడవపడినందుకు తనకు సారీ చెప్పింది. తన బాధలన్నీ ఓపికతో విన్నందుకు నబీల్‌కు థాంక్యూ చెప్పుకుంది ప్రేరణ.