BB Telugu 8.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 15వ తేదీన గ్రాండ్ ఫినాలే చాలా ఘనంగా జరగబోతుందని సమాచారం. దీంతో ఒక వారం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు? ఎవరు విన్నర్ గా నిలుస్తారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే దీనికి తోడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం ఉత్కంఠ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
14వ వారం నామినేషన్స్ చాలా కీలకంగా మారాయి. ఫినాలేకి ఒక్క అడుగు దూరంలో జరిగే ఈ నామినేషన్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రతి సీజన్లో కూడా ఒకరు టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటారు. ఇక ఈసారి కూడా అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుపొందారు. ఆ విధంగా అవినాష్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచి టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకున్నారు. ఇక మిగతా ఆరుగురు నామినేషన్ లో ఉన్నట్లు నేరుగా బిగ్ బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే డిసెంబర్ 6వ తేదీన శుక్రవారం ఓటింగ్ కూడా ముగిసింది. లైన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి ఓటింగ్ లో ఎవరు సత్తా చాటారు? డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు? అని అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఓటింగ్ లో నిఖిల్, గౌతమ్ పోటీ పడగా వీరిద్దరి మధ్య టఫ్ వార్ కూడా నడుస్తోంది. టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం అవుతున్న నిఖిల్ కి గౌతమ్ ఛాలెంజ్ లు విసురుతున్నాడు. దీంతో వీరిద్దరిలో ఎవరు విన్నర్ అనే చర్చ మొదలయ్యింది. ఇక తాజాగా ఓటింగ్ బట్టి చూస్తే నిఖిల్ కంటే గౌతం మొదటి స్థానంలో కొనసాగుతున్నారుగౌతం , నిఖిల్ మధ్య కేవలం మూడు శాతం ఓట్లు తేడా మాత్రమే ఉంది. మొదటి రెండు స్థానాలలో గౌతమ్, నిఖిల్ ఉండగా.. మూడో స్థానంలో నబీల్ ఉన్నారు. రెండు రోజుల క్రితం వరకు డేంజర్ జోన్ లో ఉన్న ఈయన అనూహ్యంగా ముందంజలో దూసుకుపోతున్నారు. నాలుగవ స్థానంలో ప్రేరణ ఉంది. విష్ణు ప్రియ , రోహిణి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. దీంతో చివరి దశలో రోహిణి వెనుకబడి డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. అలా ఈవారం వీరిద్దరూ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రోహిణి శనివారం ఎలిమినేట్ అయిందని సమాచారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన చివరి వారాల్లో బాగా ఆడింది. ముఖ్యంగా కీలకంగా మారిన 14వ వారం మాత్రం ఆడియన్స్ రోహిణికి హ్యాండ్ ఇవ్వడంతో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఎనిమిది వారాల పాటు హౌస్లో కొనసాగిన రోహిణి వారానికి రూ.4లక్షల ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెతట్టింది.అలా ఈమె మొత్తం 8 వారాలకు రూ.32 లక్షలు దక్కించుకున్నట్లు సమాచారం.