E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: ఇది నామినేషన్స్‌లాగా లేదే.. ఇంత కరువేంటి రోహిణి.? ట్రాక్ తప్పిన కంటెస్టెంట్

Bigg Boss 8 Telugu: ఇది నామినేషన్స్‌లాగా లేదే.. ఇంత కరువేంటి రోహిణి.? ట్రాక్ తప్పిన కంటెస్టెంట్
Advertisement

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎన్నడూ లేని విధంగా సీజన్ 8లో నామినేషన్స్ మారాయి. మామూలుగా ప్రతీ కంటెస్టెంట్ వచ్చి ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలి. కానీ గత రెండు వారాలుగా అలా జరగడం లేదు. ఈసారి జరిగిన నామినేషన్స్ అయితే మరీ డిఫరెంట్. ఒక్క కంటెస్టెంట్స్ కేవలం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి కాబట్టి బాగా ఆలోచించుకోమన్నారు. అలా నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యింది. అయితే ఒకవైపు నామినేషన్స్ జరుగుతుండగా.. మరోవైపు రోహిణి చూపు మాత్రం గౌతమ్‌పైనే ఉంది. ఇప్పుడు కూడా ఈ కరువేంటి అని ప్రేక్షకులకు అనిపించేలా ప్రవర్తించింది.

కోల్డ్ వార్

Advertisement

ముందుగా పృథ్వి వచ్చి రోహిణిని నామినేట్ చేశాడు. గతవారం జరిగిన టాస్కుల్లో నెక్ ఫ్యాంటసీ అనే పదం ఉపయోగించిందని, ఆ పదం తనకు తప్పుగా అనిపించిందని కారణం చెప్పాడు. ఆ మాట బూతు కాదని రోహిణి చెప్పింది. కానీ ఎక్కువగా వాదించడానికి ప్రయత్నించలేదు. నీతో వాదించడం వేస్ట్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత హరితేజ వచ్చి ప్రేరణను నామినేట్ చేసింది. హరితేజ, ప్రేరణ మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి హరితేజ కూడా ప్రేరణను నామినేట్ చేస్తూ ఓపెన్‌గా తమ మధ్య రిలేషన్ బాలేదు అనే విషయాన్ని బయటపెట్టింది. అంతే కాకుండా ఇప్పటినుండి మంచిగా ఉందామని కూడా చెప్పింది.

Also Read: అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

Advertisement

అశ్వద్ధామ ఈజ్ బ్యాక్

హరితేజ, ప్రేరణ మధ్య అనుకున్నట్టుగానే కాసేపు మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తప్పులు చెప్పుకున్నారు. ప్రేరణ.. హరితేజను నామినేట్ చేసిన తర్వాత ఇకపై ఇలా ఉండకూడదు అనుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతోనే వారి మధ్య గొడవలు సర్దుకున్నాయంటే ప్రేక్షకులకు కూడా నమ్మడం కష్టమే. ఆ తర్వాత నిఖిల్ వచ్చి గౌతమ్‌ను నామినేట్ చేశాడు. గౌతమ్‌ను తన సొంత కారణాలకు నామినేట్ చేయడం కంటే తనకు, యష్మీకి గొడవ జరగడానికి కారణం గౌతమే అన్న ఉద్దేశ్యంతోనే నామినేట్ చేశాడా అనే అనుమానం వస్తుంది. నిఖిల్ తన నామినేషన్ గురించి చెప్పగానే మరోసారి అశ్వద్ధామ డైలాగ్ కొట్టి ఇప్పటినుండి ఇలాగే ఉంటాను అని ఛాలెంజ్ విసిరాడు గౌతమ్.

గౌతమ్‌పైనే ధ్యాస

నిఖిల్ నామినేట్ చేశాడని గౌతమ్ వెళ్లి వాటర్ పడే చోట కూర్చున్నాడు. తన మీద వాటర్ పడుతున్నప్పుడు కూడా రోహిణి తనను చూసి చాలా బాగున్నాడు కదా అని తన పక్కన ఉన్న కంటెస్టెంట్‌తో చెప్తోంది. నామినేషన్స్ హీట్ వేరే లెవెల్‌లో ఉంటే రోహిణి మాత్రం అదేమీ పట్టించుకోకుండా గౌతమ్‌ను చూసి అలా ఫీల్ అవ్వడమేంటి అని ప్రేక్షకులకు అనిపించడం ఖాయం. అంతే కాకుండా గౌతమ్‌ను హెల్తీ బాయ్ అంటూ, తనను అక్క అని పిలవద్దు అంటూ పదేపదే ఇదే విషయాన్ని రిపీట్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైనర్‌గా ఉండే రోహిణి.. ఇలా గౌతమ్ చుట్టూ తిరుగుతూ విష్ణుప్రియాలాగా మారిపోతోంది అని ఆడియన్స్ విమర్శలు మొదలుపెట్టారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×