E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu Promo: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా..? పాపం టెస్టీ తేజా..

Bigg Boss 8 Telugu Promo: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా..? పాపం టెస్టీ తేజా..
Advertisement

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో నెలరోజుల నుండి ఉన్న పాత కంటెస్టెంట్స్‌తో పాటు ఇప్పుడు కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యాడ్ అయ్యారు. ఇప్పుడు మొత్తం హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నా ఇంకా ఎంటర్‌టైన్మెంట్ విషయంలో వెలితి ఉందని ప్రేక్షకులు ఓపెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అందుకే వ్యూస్ వచ్చే విధంగా టాస్కులను ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గురువారం ఎపిసోడ్‌లో ‘సేవ్ ది వాటర్’ టాస్క్ చూస్తుంటే బిగ్ బాస్ ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఈ టాస్క్ వల్ల టేస్టీ తేజ బలైపోయాడు. ఫిజికల్ టాస్కులను తాను ఎందుకు దూరంగా ఉంటారో మరోసారి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు.

వారిలో వారికే గొడవ

Advertisement

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో బీబీ హోటల్ టాస్క్ జరుగుతోంది. అందులో ఓజీ టీమ్ అంతా హోటల్ స్టాఫ్‌లాగా, రాయల్స్ టీమ్ అంతా ఆ హోటల్‌కు వచ్చే గెస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఫుడ్ కోసం కూడా గెస్టుల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ తమ ఖాతాను పెంచుకోవాలని చూస్తోంది హోటల్ స్టాఫ్. డబ్బులు ఇస్తున్నాం కదా అని రాయల్స్ కూడా ఓజీ టీమ్‌తో రకరకాల వంటలు చేయించుకొని తింటున్నారు. రాయల్స్ టీమ్.. ఐస్ క్రీమ్‌తో గులాబ్ జామ్ కావాలని అడగగానే ఫ్రిడ్జ్‌లో వెళ్లి చూస్తే ఒకటే గులాబ్ జామ్ ఉంటుంది. దానివల్ల అసలు అవి ఎవరు తిన్నారు అనే విషయంపై, దాంతో పాటు డబ్బుల విషయంలో ఓజీ టీమ్ మధ్య గొడవ జరుగుతుంది.

Also Read: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మిస్ ఫైర్.. ఇక ఎవరూ కాపాడలేరు..

Advertisement

కష్టమైన టాస్క్

అప్పుడే ఇరు టీమ్స్‌కు ‘సేవ్ ది వాటర్’ టాస్క్ ఇస్తారు బిగ్ బాస్. ‘‘ఎక్కువ నీటిని సేకరించి రూ.25 వేలు పొందడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ సేవ్ ది వాటర్. ఈ టాస్క్‌లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా.. మీ ముందు ఉన్న నీటిని ఐల్యాండ్స్ మీదుగా తీసుకెళ్లి మీకు సంబంధించిన అక్వేరియంలో నింపాల్సి ఉంటుంది’’ అని టాస్క్ గురించి వివరిస్తారు. అయితే ఈ టాస్క్ చూడడానికి సింపుల్‌గా అనిపించినా ఆడడం కష్టమని కంటెస్టెంట్స్ పడిన కష్టాలు చూస్తేనే అర్థమవుతుంది. నీటిని తీసుకెళ్లే క్రమంలో అవి అక్కడ ఏర్పాటు చేసిన ఐల్యాండ్స్‌పై పడడంతో అది జారుతుంది. అలా కంటెస్టెంట్స్ జారి కిందపడ్డారు కూడా.

జారిపడ్డారు

‘సేవ్ ది వాటర్’ టాస్క్‌లో కొంత ఆట ముగిసిన తర్వాత అది రెండో లెవెల్‌కు చేరుకుందని బిగ్ బాస్ తెలిపారు. ఆ రెండో లెవెల్‌లో ఇరు టీమ్స్ నుండి ముగ్గురు సభ్యులు వచ్చి ఆడాలని వివరించారు. టాస్క్ మళ్లీ మొదలయిన తర్వాత టేస్టీ తేజ రెండుసార్లు కిందపడ్డాడు. నయని పావని కూడా నీటిపై కాళ్లు పెట్టగానే పలుమార్లు జారింది. దీంతో వ్యూస్ కోసమే బిగ్ బాస్.. ఇలాంటి టాస్కులు పెడుతున్నారంటూ ప్రోమో చూసిన ప్రేక్షకులు భావిస్తున్నారు. మొదటి లెవెల్ అయిపోయిన తర్వాత టాస్క్‌ను ఆపేసే ఛాన్స్ ఉన్నా రెండో లెవెల్‌లో వేరేవాళ్లు వచ్చి ఆడాలని బిగ్ బాస్ తెలిపారు. ఇదంతా ప్రోమోలోనే చూపించడం వల్ల ఎపిసోడ్ చూసేవారి సంఖ్య పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×