BigTV English

Vettayain: రజినీ సినిమాను అభిమానులతో కలిసి చూసిన ధనుష్, విజయ్..

Vettayain: రజినీ సినిమాను అభిమానులతో కలిసి చూసిన ధనుష్, విజయ్..

Vettayain: సూపర్ స్టార్ రజినీకాంత్.. వయస్సుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వెట్టయాన్ ది హంటర్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభస్కరన్ నిర్మించాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్ లాంటి స్టార్ క్యాస్టింగ్ నటించారు.


ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలు ఉన్నాకొద్దీ తగ్గుతూ వచ్చాయి. ఈ మధ్యలో తెలుగు టైటిల్ వివాదం, సినిమాను బ్యాన్ చేయాలనీ ట్రెండ్ చేయడం  జరిగింది.  ఇంకోపక్క  మనసిలాయో సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ ఏమి హైప్ తీసుకురాలేదు. పోనీ.. ట్రైలర్ అయినా  ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా.. ? అంటే అది లేదు. అసలు ఇంతమంది స్టార్స్ ఉన్న సినిమాకు బజ్ లేకపోవడం అనేది ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్.

అయినా కూడా నేడు రిలీజ్ అయిన వెట్టయాన్ ది హంటర్ సినిమా మిక్స్డ్  టాక్ ను తెచ్చుకుంది. ఎలాంటి అంచనాలను లేకుండా వెళ్తే.. సినిమాను ఒకసారి చూడొచ్చు అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. కొంతమంది బావుంది అని అంటున్నారు. ఇక తమిళ్ లో అయితే రజినీ మాస్ వేరే లెవెల్ అని చెప్పుకొస్తున్నారు. అభిమానులతో పాటు స్టార్ హీరోలు కూడా సినిమాను  చూసి వస్తున్నారు. వెట్టయాన్ సినిమా మొదటి షోకే రజినీ కాంత్ కుటుంబం థియేటర్ కు వచ్చి అభిమానులతో కలిసి వీక్షించింది.


రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య, ధనుష్, వారి పిల్లలు, రజినీ భార్య లత.. అందరూ చెన్నైలోని ఒక థియేటర్ లో సందడి చేశారు. ధనుష్ – ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారన్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం వీరు విడాకులు ప్రకటించారు. నిన్ననే వీరి విడాకుల కేసు విచారణకు వచ్చింది. అయితే ఆ విచారణకు వీరిద్దరూ హాజరుకాకపోవడంతో.. ఈ విడాకులను రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ మరుసటి రోజే .. ఇలా కలిసి సినిమాకు రావడంతో కచ్చితంగా ఈ జంట మళ్లీ కలిసి ఉండబోతున్నట్లే అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఇంకోపక్క వెట్టయాన్ సినిమాను దళపతి విజయ్ కూడా వీక్షించాడు. ముఖానికి ముసుగు వేసుకొని ఒక థియేటర్ కు వెళ్లి సినిమాను చూసి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన  వీడియో నెట్టింట వైరల్ గా మారింది.విజయ్ కేవలం రజినీ సినిమాలు మాత్రమే కాదు.. తెలుగు సినిమాలను కూడా ఇలాగే మాస్క్ పెట్టుకొని అభిమానుల తో కలిసి  చూస్తాడని చాలామందికి తెలుసు. అందుతున్న సమాచారం ప్రకారం వెట్టయాన్.. విజయ్ కు బాగా నచ్చిందని కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. మరి ఈ సినిమా కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉండనున్నాయో తెలియాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Big Stories

×