R.K.Sagar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో పాటు ఆయన తమ్ముళ్లు ఇద్దరు కూడా సినిమా తెరపై పట్టు సాధించారు. విభిన్న కథల ఎంపికలతో పాటూ ఇతివృత్తంగా చిత్రాలలో నటించి, ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు ఏమాత్రం తీసిపోని విధంగా మెగా బ్రదర్ నాగబాబు(Nagababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)రాజకీయ వ్యవహారాలలో వేగంగా దూసుకుపోతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాలలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి నుంచి నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న కారణంగా అది సాధ్యపడలేదు. అటు రాజ్యసభ స్థానానికి కూడా వీలు కాలేదు.
డబుల్ ధమాకా కొట్టేసిన నాగబాబు..
ఇక దీంతో నాగబాబుకు ఎమ్మెల్సీ , మంత్రి పదవి ఇస్తారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు రాగా.. ఆ వార్తలను నిజం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు(CM.Chandrababu naidu). తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన నాగబాబుకు ఎమ్మెల్సీ ,మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శాసనమండలిలో కూడా వైసీపీ సభ్యులు రాజీనామా చేయడంతో ఆస్థానంలో ఒకరికి కొణిదెల నాగబాబుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి దక్కకుండానే నాగబాబు మంత్రి అయితే విభజిత రాష్ట్రంలో కూడా.. ఇది ఒక రికార్డుగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాగబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో విడుదల..
ఇదిలా ఉండగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ప్రముఖ సీరియల్ నటుడు ఆర్కే సాగర్ (RK.Sagar) శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ విడుదల చేశారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఏముందనే విషయానికొస్తే.. “జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నకి శుభాకాంక్షలు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఒక అన్న గానే కాకుండా ఒక అంగరక్షకుడిలా ఉంటూ జనసేన గెలుపులో కీలక బాధ్యత పోషించిన నాగబాబు అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ బాధ్యతలను మీ ప్రత్యేకమైన శైలిలో ముక్కు సూటిగా, నిస్వార్ధంగా, నిజాయితీగా నిర్వహిస్తారని అందరికీ నమ్మకం ఉందన్న. మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ ఆర్కే సాగర్ ఒక పోస్ట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఆర్కే సాగర్ కెరియర్..
ఆర్కే సాగర్ విషయానికి వస్తే.. చక్రవాకం,మొగలిరేకులు వంటి సీరియల్లో లీడ్రోల్ పోషించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక 2009లో ఉత్తమ నటుడిగా టీవీ నంది అవార్డును కూడా అందుకున్నారు సాగర్..ఇక 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో నవంబర్ 6న బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఇక ఈయన సీరియల్స్ లోనే కాదు సినిమాలలో కూడా నటించారు.2021లో దిల్ రాజు నిర్మించిన తెలుగు చిత్రం షాదీ ముబారక్ సినిమాలో హీరోగా నటించారు. అంతేకాదు స్క్రీన్ రైటర్ బివీఎస్ రవి నిర్మాణంలో కూడా ఒక సినిమా చేశారు.
Inspirational leader, outstanding achievement- Hearty Congratulations @NagaBabuOffl Anna! #nagababukonidela #JanaSenaParty #Janasena #Pawanakalyan #inspiration pic.twitter.com/Ua2wbK3Sr4
— RK Sagar (RK Naidu) (@urRKsagar) December 10, 2024