BigTV English

Bigg Boss 8 Telugu Promo: నేను మాట్లాడుతున్నప్పుడు నోరుమూసుకో.. గౌతమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగ్

Bigg Boss 8 Telugu Promo: నేను మాట్లాడుతున్నప్పుడు నోరుమూసుకో.. గౌతమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగ్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లో ఈ వారమంతా మెగా చీఫ్ రేసులోనే బిజీగా ఉన్నారు కంటెస్టెంట్స్. ఆ పోటీ సమయంలోనే వారి మధ్య గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. ముఖ్యంగా గ్రూప్స్‌గా ఉండి ఆడుతున్నారంటూ పాత కంటెస్టెంట్స్‌పై కొత్త కంటెస్టెంట్స్ పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ ఆరోపణల వల్లే గౌతమ్, పృథ్విల మధ్య గొడవ మొదలయ్యింది. ఆ గొడవ గురించి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ప్రస్తావించనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. గౌతమ్, పృథ్వి కలిసి నాగార్జునకు కోపం తెప్పించగా దానివల్లే నాగార్జున వారిపై విపరీతంగా సీరియస్ అయ్యారు.


మగవాళ్ల గొడవ

‘‘ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య ఇద్దరు మగవాళ్ల మధ్య’’ అని నాగార్జున అనడంతో ప్రోమో మొదలవుతుంది. అయితే ఆ సమస్య ఏంటో తనకు తెలుసు అని ఎగ్జైట్ అయ్యాడు అవినాష్. ‘‘మీరేం అడుగుతారో నాకు తెలుసు. పృథ్వి, గౌతమ్’’ అని వారి పేర్లు చెప్పాడు. అయితే వాళ్లిద్దరిలో తప్పు ఎవరిది అంటూ అవినాష్ అభిప్రాయం అడిగారు నాగార్జున. ‘‘ముందు వాడు, వీడు అని స్టార్ట్ చేశాడు పృథ్వి. ఆ తర్వాత గౌతమ్.. ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఏం పీక్కుంటావో అంటావా అని పృథ్వి వచ్చి తన చెస్ట్‌పై వెంట్రుకలు తీసి పడేశాడు’’ అంటూ ఆరోజు జరిగిన విషయాన్ని స్పష్టంగా వివరించాడు అవినాష్.


Also Read: మీ క్యారెక్టర్ ఏంటో బయటపడింది.. రోహిణి, విష్ణుప్రియాలపై నాగార్జున ఫైర్

ఏం నిరూపించాలనుకుంటున్నావు

ఆ తర్వాత అసలు తన సమస్య ఏంటో చెప్పుకొచ్చాడు గౌతమ్. ‘‘వైల్డ్ కార్డ్స్‌ను మనం టార్గెట్ చేసి నామినేట్ చేద్దామని అందరూ కలిసి మాట్లాడుకొని ఒక మాట మీదకు వచ్చారు’’ అని తను చెప్తుండగానే అందులో తప్పేముంది అని నాగార్జున రివర్స్ అయ్యారు. ‘‘వాళ్ల ఉద్దేశ్యంలో అది తప్పు కాకపోవచ్చు. నా ఉద్దేశ్యంలో తప్పే’’ అని గౌతమ్ అన్నాడు. వాళ్ల ఉద్దేశ్యంలో తప్పు కాదని నాగ్ క్లారిటీ ఇస్తుండగానే నా ఉద్దేశ్యంలో తప్పే అని రివర్స్ అయ్యాడు. ‘‘నిఖిల్‌ను నేను కాపాడుతున్నానని గౌతమ్ అన్నాడు. ఎలాగో వివరించమని అడిగాను’’ అని పృథ్వి వివరించాడు. ‘‘అయితే మీద మీదకు వెళ్లి అడగాలా? నువ్వు మీద మీదకు వెళ్లి ఏం నిరూపించాలనుకుంటున్నావు’’ అని పృథ్విపై సీరియస్ అయ్యారు నాగ్.

జోక్యం చేసుకోవద్దు

‘‘నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజమా కాదా’’ అంటూ గౌతమ్‌లోని తప్పులు కూడా బయటపెట్టాలని అనుకున్నారు నాగార్జున. ‘‘ఎప్పుడూ సపోర్ట్ చేయడం గ్రూపిజమా? ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా?’’ అని నాగ్‌పైనే రివర్స్ అయ్యాడు గౌతమ్. గ్రూపిజం తప్పే కాదన్నట్టుగా మాట్లాడారు నాగ్. ‘‘అతడు వాడు అంటే నువ్వు బొచ్చు కూడా పీకలేవు అని అనేస్తావా. నాకు నువ్వు అన్న ఆ మాట తప్పు అనిపించింది. నేను మాట్లాడుతున్నప్పుడు నోరుమూసుకో. నేను మాట్లాడుతున్నప్పుడు జోక్యం చేసుకోవడానికి హౌస్‌మేట్‌ను కాదు. నువ్వు కూడా మధ్యలో జోక్యం చేసుకుంటావు పృథ్వి. అలా చేయకు. అవతలి వాళ్లను మాట్లాడనివ్వు’’ అంటూ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×