ATM Timeout Error : ఏటీఎం.. డబ్బులు డ్రా చేయటానికి సులభంగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ సాధనమే మోసం చేయటానికి కారణమైతే.. అవును నిజం. ఈ షాకింగ్ సంఘటనే తిరువనంతపురంలో జరిగింది. ఏటీఎంలో టైమ్ అవుట్ ఎర్రర్ తో రూ.2.52 లక్షలు మాయమయ్యాయి. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు సైతం గుర్తించలేకపోయారు. అసలు ఏం జరిగింది? ఈ టైమ్ అవుట్ ఎర్రర్ ఏంటి? డబ్బులు ఏమయ్యాయి అనే విషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
ఇద్దరు కేటుగాళ్లు ఏటీఎం మిషన్ ను బురిడీ కొట్టించారు. బ్యాంక్ అధికారులకు సైతం అంతుపట్టని విధంగా డబ్బులు తీసుకొని మాయమయ్యారు. ఏటీఎంలో టైం అవుట్ ఎర్రర్ ను ఆధారంగా చేసుకుని లక్షలు దోచేశారు. అసలు ఈ తెలివైన స్కామ్ ఎలా చేశారు? చివరికి ఎలా పట్టుబడ్డారో తెలుసుకుందాం.
తిరువనంతపురం పద్మ విలాస్ రోడ్ లో ఉన్న ఎస్బిఐ ఏటిఎంను లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు రెండేళ్ల క్రితం ఈ ఏమోసానికి పాల్పడ్డారు. ఏటీఎంకు వచ్చిన కస్టమర్స్ డెబిట్ కార్డులను వదిలి వెళ్లిపోవడం గుర్తించి ఆ కార్డ్స్ నే లక్ష్యంగా చేసుకొని ఈ నేరానికి పాల్పడ్డారు. ఏటీఎం కార్డులో మర్చిపోయి వెళ్ళిపోయిన కస్టమర్స్ నుంచి వాటిని దొంగలించి ఏటీఎం మిషన్లలో డబ్బులు తీయటానికి ప్రయత్నించేవారు. ఏటీఎంలో పూర్తిగా జరగని లావాదేవీలను ఆధారంగా చేసుకొని కాష్ డెలివరీ కంపార్ట్మెంట్లో ప్రతీసారి ఈ నోట్ ను వదిలేసి వెళ్లేవారు. ఇలా డబ్బులు ఉపసంహరణ తర్వాత దానికి సంబంధించిన నోట్ వదిలేయడం వల్ల తర్వాత వచ్చే కస్టమర్ సైతం ఏటీఎం కార్డు నుంచి డబ్బులు తీయాలి అనుకున్నప్పటికీ ముందు వదిలేసిన వారి నోట్ ను చూసి భ్రమ పడేవారు. దీంతో ఒకటీ, రెండుసార్లు ప్రయత్నించి డబ్బులు రాకపోవడంతో వదిలేసి వెళ్ళిపోయేవారు. ఇక కస్టమర్ వెళ్లిపోగానే అక్కడికి వెళ్లిన కేటుగాళ్లు డబ్బులు తీసుకుని పరారయ్యేవాళ్లు.
చివరికి విషయం బ్యాంక్ అధికారులు సైతం కొన్నేళ్లపాటు గుర్తించలేకపోయారు. ఏటీఎంలో డిపాజిట్ చేసిన మొత్తం నగదుకు విత్ డ్రా చేసిన మొత్తానికి తేడా రావటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ కమిటీ అక్రమాలపై దర్యాప్తు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కొన్నిసార్లు బ్యాంకు సిబ్బందిని సైతం అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఏటీఎంలో సీసీటీవీ ఫుటేజీలను గుర్తించినప్పుడు బయటపడింది. ఈ కేటుగాళ్లు ప్రతీసారి ఏటీఎంలోకి వచ్చి అనుమానాస్పదంగా తిరగడం, డబ్బులు తీసుకొని వెళ్లడం వంటివి చూసి వారిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి సీసీటీవీ విజువల్స్ ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇక ఈ ఘటనతో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. కేటుగాళ్లు ఏ విధంగా అయినా డబ్బులు అపహరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని తెలుస్తుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఏటీఎంలో పాటు ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ విషయంలో సైతం అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు.
ALSO READ : సేల్‌లో 90% డిస్కౌంట్.. మీరూ నమ్ముతున్నారా? ముంచేస్తారు జాగ్రత్త!