Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఫినాలే వీక్‌కు ఇంకా కొన్నిరోజులే ఉంది. కంటెస్టెంట్స్ చేసింది తప్పా ఒప్పా అని చెప్పడానికి నాగార్జున వచ్చేది ఈవారం మాత్రమే. ఆ తర్వాత అందరినీ నేరుగా ఫైనల్స్‌లోనే కలుస్తారు. అందుకే బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటివరకు వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని వారినే అడిగి తెలుసుకున్నారు నాగార్జున. అంతే కాకుండా ఈవారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి కూడా వారితో మాట్లాడారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక ఈ ప్రోమో చివర్లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి అందరికీ షాకిచ్చారు నాగ్. దీంతో అసలు ఈ వీకెండ్ ఏం జరగబోతుందని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది.
సంచాలకురాలిగా సేఫ్ గేమ్
‘‘14వ వారంలోకి వచ్చేశాం. ఈ హౌస్‌లో మీకు ఏదో ఒక రిగ్రెట్ తప్పకుండా ఉండే ఉంటుంది. అదేంటి, ఏ వారంలో అని చెప్తూ ఈరోజును మొదలుపెడతాం’’ అని నాగార్జున చెప్పడంతో బిగ్ బాస్ 8 లేటెస్ట్ ప్రోమో ప్రారంభమయ్యింది. ముందుగా ప్రేరణ వచ్చి 11వ వారంలో తనకు రిగ్రెట్ ఉందని చెప్పి కారణం ఏంటో చెప్పింది. ‘‘నేను మెగా చీఫ్ అయిన వారం. సాఫ్ట్‌గా చేయాల్సింది కానీ కొంచెం కంట్రోల్ కోల్పోయాను. అదే నా రిగ్రెట్’’ అని తెలిపింది. ఈవారం సంచాలకురాలిగా తన పర్ఫార్మెన్స్ గురించి చెప్పమన్నారు నాగార్జున. తాను నిఖిల్, గౌతమ్ మధ్య టై ఇవ్వాలనుకుంటే బిగ్ బాస్ ఒకరి పేరే చెప్పాలన్నారని గుర్తుచేసుకుంది ప్రేరణ. దీంతో తను సంచాలకురాలిగా సేఫ్‌గా ఆడిందని స్టేట్‌మెంట్ ఇచ్చారు నాగార్జున.
Also Read: షాకిస్తున్న వీకెండ్ ఓటింగ్.. డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్..!
నబీల్‌కు తిత్తర
ఈవారం నిఖిల్ నిర్ణయం కరెక్ట్ కాదా అని రోహిణిని అడిగారు నాగార్జున. ‘‘నాకు అది నచ్చలేదు. నిఖిల్ చాలా ఈజీ సమాధానాలు వెతుక్కుంటాడు’’ అని మనసులోని మాట బయటపెట్టింది రోహిణి. ఆ తర్వాత నాగార్జున అడిగారని ఒక చీర తీసుకొచ్చింది విష్ణుప్రియా. దానిని టవర్ చుట్టూ కట్టి చూపించింది ప్రేరణ. ‘‘సరిగ్గా చుట్టడం అంటే ఇది నబీల్. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? చెక్ మీద రూ.15 లక్షలు రాశావు. ఆ రాసింది మళ్లీ ఎందుకు చింపేశావు?’’ అంటూ నబీల్ ఈవారంలో చేసిన తప్పులను గుర్తుచేశారు నాగార్జున. ముఖ్యంగా ఫైనలిస్ట్ అయ్యే విషయంలో నబీల్ వెంటవెంటనే తన నిర్ణయం మార్చుకోవడం గురించి అడిగారు.
డబుల్ ఎలిమినేషన్
‘‘కాసేపు సెల్ఫిష్‌గా ఉందామని రాశాను కానీ బయటికి రాగానే ఎక్కువ అమౌంట్ రాసేశాను కదా అనిపించింది’’ అని నబీల్ చెప్పుకొచ్చాడు. అయితే తనకు గెలవాలని ఉందా లేదా అని నాగార్జున అడిగారు. గెలవాలనే ఉందని అన్నాడు నబీల్. ‘‘ప్రపంచంలో విన్నర్స్ అందరూ సెల్ఫిష్ అనుకొని ఆట సరిగా ఆడకపోతే వాళ్లు విన్నర్స్ కాలేరు’’ అని కంటెస్టెంట్స్‌కు హితభోద చేశారు నాగార్జున. ఆ తర్వాత ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా షాకయ్యారు. ఆపై నబీల్ టవర్‌ను పడగొట్టారు. అంటే దానికి నబీల్ ఎలిమినేట్ అవుతున్నాడని అర్థమా కాదా అని తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.