BigTV English

Nara Lokesh Viral video: తండ్రి తిన్న ప్లేట్ ని స్వయంగా తీసిన మంత్రి లోకేష్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Nara Lokesh Viral video: తండ్రి తిన్న ప్లేట్ ని స్వయంగా  తీసిన మంత్రి లోకేష్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 వేలకు పైగా ప్రభుత్వ, ఎయిడెట్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగులు ఘనంగా జరిగాయి. అన్ని పాఠశాల్లోని ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిని వారి తల్లిదండ్రులకు వివరించారు. ఇక బాపట్ల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేషన్ పాల్గొన్నారు. విద్యార్థులు ఎలా మసులుకోవాలి? పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై చంద్రబాబు కీలక విషయాలు చెప్పారు.


తండ్రి భోజనం చేసిన ప్లేట్ తీసిన లోకేష్

ఇక లంచ్ టైమ్ లో స్కూల్లోని మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ తిన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఫుడ్ కు సంబంధించిన క్వాలిటీ గురించి ఆరా తీశారు. చంద్రబాబు నాయకుడు లోకేష్ కంటే ముందే భోజనం చేసి ప్లేట్, అక్కడే పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఫుడ్ కంప్లీట్ చేసిన లోకేష్ తన ప్లేట్ తో పాటు తన తండ్రి ప్లేట్ ను తీశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెద్దల పట్ల ఎలా గౌరవంగా మెలగాలో లోకేషన్ ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కొడుక్కు తల్లి భువనేశ్వరి మంచి సంస్కారం నేర్పిందని కొనియాడుతున్నారు.


పిల్లలకు పెద్ద ఆస్తి చదువు- చంద్రబాబు

అంతకు ముందకకు బాపట్ల పాఠశాల ఆవరణలో కలియతిరుగుతూ, తల్లిదండ్రులతో ముచ్చటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం.. విద్యార్థులకు చదువు అనేది అన్నిటికంటే పెద్ద ఆస్తి అన్నారు.  పిల్లలు బాగా చదువుకునేలా టీచర్లు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారి పేరెంట్ టీచర్ మీట్ పెడుతున్నట్లు చెప్పారు. అటు పిల్లలు స్కూలు రాకపోతే ఫోన్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌లు వస్తాయన్నారు. తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇచ్చే విషయంలో, అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు.

కేజీ టు పీజీ కరిక్యులం మార్చుతున్నా- లోకేష్

అటు ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ ప్రభుత్వం రూపొందిస్తుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు.  కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం మార్చుతున్నామన్నారు. పిల్లలకు చదువుతో పాటు, నైతిక విలువలు నేర్పించాలన్నారు. మహిళలని గౌరవించటం స్కూల్ లెవల్ నుంచే విద్యార్థులకు నేర్పిస్తామన్నారు. పిల్లలకు నైతిక విలువలు నేర్పించటానికి సలహాదారుడిగా చాగంటి కోటేశ్వరరావును నియమించినట్లు చెప్పారు. విద్యా శాఖని ఛాలెంజ్ గా తీసుకున్నట్లు చెప్పారు.  గతంలో పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ రంగులు ఉండేవన్నలోకేష్, తాము అధికారంలోకి రాగానే అవన్నీ తీసేసినట్లు చెప్పారు. విద్యా శాఖలో జరిగే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దల పేర్లు పెట్టి, స్పూర్తి నింపామన్నారు. ఈ సందర్భంగా  పూర్వ విద్యార్ధులు, తల్లిదండ్రుల కోసం నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొని సరదాగా గడిపారు.

Read Also: ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి పొన్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానం

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×