Pushpa 2 Collection day 2: ఒకప్పుడు సినిమా సక్సెస్ ఆడియన్స్ డిసైడ్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఒక సినిమా సక్సెస్ అనేది కొన్ని రోజులు తర్వాత తెలిసేది. ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లో ఆడట్లేదు గానీ. ఒకప్పుడు ఒక సినిమా 50 రోజులు వంద రోజులు ఆడిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది ఆ సినిమా వసూలు చేసే కలెక్షన్ల మీద ఆధారపడి ఉంది. ఒక సినిమా రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ డే కలెక్షన్లు పోస్టర్ పడుతుంది. అసలు ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ నిజమా, ఫేక్ ఆ కూడా తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కొంతమంది నిర్మాతలు కేవలం ఫ్యాన్స్ ను హ్యాపీ చేయడానికి మాత్రమే పోస్టర్లు వేస్తాము అంటూ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఏ వ్యక్తి కూడా తనకు వచ్చిన లాభాన్ని బయట పెట్టుకోవడం అనేది జగమెరిగిన సత్యం. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు కూడా నేనింతే అనే సినిమాలో ఇదే డైలాగ్ ని కూడా పెట్టాడు.
ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నుంచి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. నాగ వంశీ ఒకవైపు సినిమాలు నిర్మిస్తూ మరోవైపు మంచి కాంబినేషన్లో వచ్చే సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటాడు. అలానే దేవర సినిమాను కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నాగ వంశీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ కూడా విపరీతంగా పోస్టర్స్ వేశారు. ఆ సందర్భంలో నాగ వంశీ మాట్లాడుతూ కలెక్షన్స్ పోస్టర్ అనేది కేవలం ఫ్యాన్స్ హ్యాపీ చేయడానికి మాత్రమే వేస్తామంటూ అఫీషియల్ గా చెప్పాడు. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కూడా పుష్ప సినిమా విషయంలో అదే పని చేస్తుందా లేదంటే నిజంగా సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయా అనేది తెలియని పరిస్థితి.
Also read : Ambati Rambabu: మనవాడికో మాట, పగవాడికో మాటా? ఇది అల్లు అర్జున్‌కు వర్తిస్తుందా అంబటి?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఏ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ డే వసూలు చేయనన్ని కలెక్షన్స్ పుష్ప సినిమా వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజులోనే దాదాపు 290 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజాగా పుష్ప 2 సినిమాకు సంబంధించిన రెండు రోజుల కలెక్షన్స్ ని కూడా అధికారికంగా ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 449 కోట్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ కలెక్షన్స్ నిజంగా వచ్చాయా లేదంటే ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం చిత్ర యూనిట్ వేస్తుందా అనేది ఎవరికి తెలియదు. వచ్చే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా టిక్కెట్ రేట్లు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి.
WILDFIRE at the box-office 🔥🔥#Pushpa2TheRule grosses 449 CRORES WORLDWIDE in 2 days ❤🔥
The fastest Indian film to hit the milestone 💥💥#RecordRapaRapAA 🔥
RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star… pic.twitter.com/3uR8X6Tt7F
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024