BigTV English

Bigg Boss 8 Telugu: మళ్లీ వైల్డ్ కార్డ్‌లో తనే, ఈసారి ఆ పవర్ అంతా పాత కంటెస్టెంట్స్ చేతికే..

Bigg Boss 8 Telugu: మళ్లీ వైల్డ్ కార్డ్‌లో తనే, ఈసారి ఆ పవర్ అంతా పాత కంటెస్టెంట్స్ చేతికే..

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మొదలయ్యాయి. మొదటి ఇద్దరు కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు హరితేజ, టేస్ట్ తేజ. అయితే సీజన్ అంతా మారిపోవడంతో, కొత్త కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వడంతో.. పాతవాళ్లంతా ఒక టీమ్ అయ్యారు. కొత్తవారంతా మరొక టీమ్ అయ్యారు. పాత కంటెస్టెంట్స్ టీమ్ పేరే ‘ఓజీ’. కొత్త కంటెస్టెంట్స్ టీమ్ పేరు ‘రాయల్స్’. ఇక రాయల్స్ టీమ్ నుండి మొదటి ఇద్దరు కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి వెళ్లిన హరితేజ, టేస్టీ తేజ.. అప్పుడే టాస్కులు మొదలుపెట్టారు. వారు ఆడిన టాస్క్ వల్ల బిగ్ బాస్ 8 ప్రైజ్ మనీ కౌంట్ పెరిగింది. రెండో టాస్కులో మాత్రం పాత కంటెస్టెంట్సే సత్తా చాటుకున్నారు.


వారి ఏడుపే సుత్తి

బిగ్ బాస్ సీజన్ 8లో మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని ఎంటర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 7లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి.. వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయింది ఈ భామ. కానీ వారం రోజుల్లోనే తను ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు మాత్రమే కాదు.. హౌస్‌మేట్స్ కూడా ఊహించలేదు. ఇప్పుడు బిగ్ బాస్ తనకు రెండో అవకాశం ఇచ్చిందని సంతోషంగా స్టేజ్‌పైకి ఎంటర్ అయ్యింది. తన దృష్టిలో ప్రస్తుతం హౌస్‌లో కంటెస్టెంట్స్‌లో కత్తి ఎవరు, సుత్తి ఎవరు అని అడగగా.. నబీల్ కత్తి అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. సుత్తి గురించి మాట్లాడుతూ సీత ప్రతీ విషయానికి ఏడుస్తుందని, మణికంఠ కూడా ఏడుపుతో సుత్తి అనిపిస్తుందని చెప్పింది. అంతే కాకుండా హౌస్‌లో ఉన్న బ్యాచిలర్స్‌కు పాటలు కూడా డెడికేట్ చేసింది.


Also Read: అప్పుడే వచ్చారు, ప్రైజ్ మనీపై కన్నేశారు.. బిగ్ బాస్ హౌస్‌లో రాయల్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

బెస్ట్ ఫ్రెండ్స్

బిగ్ బాస్ సీజన్ 7లో నయని పావనికి, శివాజీకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే సీజన్ 8లో కొత్తగా ఎంటర్ అయిన నయని పావనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో మెసేజ్ పంపించాడు శివాజీ. బిగ్ బాస్ షో అనేది తనకు రెండో అవకాశం ఇచ్చిందని, మరో నాన్నను ఇచ్చిందని సంతోషంగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యింది నయని పావని. తన తర్వాత నాలుగో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చాడు మెహబూబ్ దిల్‌సే. డ్యాన్సర్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న మెహబూబ్.. బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చాడు. తను, సోహైల్ కలిసి చేసిన అల్లరి.. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు మర్చిపోలేదు. సోహైల్ దగ్గర నుండి వచ్చిన వీడియో మెసేజ్ చూసి హ్యాపీగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యాడు మెహబూబ్.

వారికే పవర్

ముందుగా నయని పావని హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే టేస్టీ తేజ.. తనను ఆటపట్టించడం మొదలుపెట్టాడు. మెహబూబ్ వచ్చి కూడా అదే పనిచేశాడు. దీంతో నామినేషన్స్‌లో ముందుగా మెహబూబ్‌నే నామినేట్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది నయని పావని. ఆ తర్వాత ‘జనక అయితే గనక’ టీమ్ వచ్చి కొత్తగా వచ్చిన మెహబూబ్, నయని పావనిని.. మణికంఠ, సీతతో టాస్క్ ఆడించారు. ఆ టాస్క్‌లో గెలిచినవారికి ఒక పవర్ వస్తుందని నాగార్జున ముందే క్లారిటీ ఇచ్చారు. ఇందులో మణికంఠ, సీత గెలవగా.. వారికి పవర్ అందించారు బిగ్ బాస్. ఇకపై బెడ్‌రూమ్, రేషన్ కంట్రోల్ పవర్ వారి చేతికి వచ్చినట్టు ప్రకటించారు. దీంతో టేస్టీ తేజ షాకయ్యాడు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×