Ananthapuram: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బుక్కరాయ సముద్ర మండలం కొర్రపాడు అంబేద్కర్ బాలికల పాఠశాలలో కృష్ణవేణి ఆయాగా పనిచేస్తుంది. ఆమెతోపాటు తన 16 నెలల కూతురు అక్షితను కూడా పాఠశాలకు తీసుకెళ్లింది. కృష్ణవేణి విద్యార్థుల కోసం పాలను వేడి చేసింది. పాలను చల్లార్చేందుకు పెద్ద గిన్నెలో పోసి వేరే పనిలో పడింది. అక్షిత ఆటలాడుతూ పక్కనే ఉన్న వేడి పాలలో పడిపోయింది. పాలు వేడిగా ఉండటంతో చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. అరుపులు విని అక్కడికి చేరిన తల్లి.. ఆ గిన్నె నుంచి చిన్నారిని బయటకు తీసింది. ఆ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి కన్ను మూసింది.