E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు ఆ పని చేయను.. కంటెస్టెంట్స్ కోసం నబీల్ త్యాగం

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు ఆ పని చేయను.. కంటెస్టెంట్స్ కోసం నబీల్ త్యాగం
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాయల్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆట కాస్త మారింది. మణికంఠ లాంటి కంటెస్టెంట్స్‌లో కొత్త ఊపు వచ్చింది. అంతే కాకుండా కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలయ్యింది. మామూలు సమయాల్లో అందరూ బాగానే ఉన్నా టాస్కుల విషయం వచ్చేసరికి హౌస్ అంతా ఓజీ వర్సెస్ రాయల్స్‌గా మారిపోతుంది. సీరియస్‌గా టాస్కులు ఆడడానికే కంటెస్టెంట్స్ ఇష్టపడుతున్నారు. కానీ కొందు మాత్రం తమ టీమ్‌కు కాకుండా తమ పక్క టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓజీ టీమ్ మొత్తం ప్రేరణకు శత్రువుల్లాగా మారిపోయారు. ఇక అందరు కంటెస్టెంట్స్ కోసం నబీల్ ఒక త్యాగం చేయాల్సి వచ్చింది.

అందరూ దూరమే

Advertisement

నామినేషన్స్ సమయంలో ఓజీ టీమ్ నుండి ఒక్కరు కూడా ప్రేరణకు సపోర్ట్ చేయలేదు. అందరూ తననే నామినేట్ చేయాలని పగపట్టారు. ఆఖరికి యష్మీ కూడా ముందుగా ప్రేరణను నామినేట్ చేయాలని ఉందని చెప్పి.. తర్వాత తనకే సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్లేట్ మార్చింది. ఇక పృథ్వి అయితే తను నామినేషన్స్‌లో ఉండడానికి ప్రేరణనే కారణమని తనపై పూర్తిగా పగ పెంచేసుకున్నాడు. ఇదంతా గమనిస్తున్న ప్రేరణ కిచెన్ డిపార్ట్‌మెంట్ నుండి పూర్తిగా తప్పుకున్నట్టు చెప్పింది. ఎవరైనా వెళ్లి అడిగితే ప్రేరణ ఒప్పుకుంటుందని యష్మీ చెప్పినా పృథ్వి మాత్రం రివర్స్‌లో తనపైనే సీరియస్ అయ్యాడు. తాను ఏడుస్తున్నప్పుడు వచ్చి ఓదార్చాలేదనే కారణంతో విష్ణుప్రియాను సైతం దూరం పెడుతోంది ప్రేరణ.

Also Read: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

Advertisement

మాట నిలబెట్టుకోలేదు

నామినేషన్స్ తర్వాత ఓజీ టీమ్‌లోనే మనస్పర్థలు వచ్చాయని మణికంఠతో చెప్పుకొని ఫీల్ అయ్యాడు నబీల్. ఆ తర్వాత బీబీ సూపర్ మార్కెట్‌ను ఓపెన్ చేశాడు బిగ్ బాస్. మెగా చీఫ్ అయిన మెహబూబ్.. ఈసారి ఆ సూపర్ మార్కెట్‌కు వెళ్లి అందరికీ కావాల్సిన రేషన్‌ను తీసుకురావాలి. కానీ అక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. నబీల్.. స్వీట్స్ త్యాగం చేస్తే ఈసారి అందరికీ అన్‌లిమిటెడ్ రేషన్ వస్తుందని ప్రకటించారు. బాగా ఆలోచించుకున్న నబీల్.. తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు స్వీట్స్ ముట్టుకోనని మాటిచ్చాడు. కానీ టాస్క్ జరుగుతున్న సమయంలో ఎవరికీ తెలియకుండా ఒక ప్యాకెట్ తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు.

చీఫ్ కంటెండర్ ఎవరు

కంటెస్టెంట్స్ అందరినీ నవ్వించే బాధ్యతను మరోసారి అవినాష్, రోహిణికి అప్పగించారు బిగ్ బాస్. అందుకే తాజాగా జరిగిన నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ అందరూ ఎలా ప్రవర్తించారో ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్వించారు. మధ్యలో గౌతమ్, తేజ కూడా యాడ్ అయ్యారు. అలా అవినాష్, రోహిణి.. అందరినీ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి కిచెన్ టైమింగ్‌ను రెండు గంటలు ఎక్స్‌ట్రా పెంచాడు బిగ్ బాస్. ఇక రాయల్స్ టీమ్ నుండి చీఫ్ కంటెండర్ ఎవరు అవ్వాలనే చర్చ మొదలయినప్పుడు ఎవరికి వారు తామే అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. కానీ గతవారంలో టేస్టీ తేజ, గంగవ్వకు ఛాన్స్ రాలేదు కాబట్టి వారిద్దరిలో ఒకరు అవ్వాలని మెహబూబ్, గౌతమ్ అనుకున్నారు. తేజ తనంతట తాను తప్పుకోవడంతో గంగవ్వ మెగా చీఫ్ కంటెండర్ అయ్యింది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×