BigTV English

Bigg Boss 8 Telugu: సంచాలకుడిగా ఫెయిల్, పులిహోర రాజాగా పాస్.. బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త ప్రేమకథ!

Bigg Boss 8 Telugu: సంచాలకుడిగా ఫెయిల్, పులిహోర రాజాగా పాస్.. బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త ప్రేమకథ!

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8కు చీఫ్‌లుగా నిఖిల్, యష్మీ, నైనికా సెలక్ట్ అయ్యారు. ముగ్గురు చీఫ్‌లలో ఒక్కడే అబ్బాయి కాబట్టి నిఖిల్.. అన్నింటిలో ఈజీగా గెలిచేస్తాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కంటెస్టెంట్స్ అందరినీ టీమ్స్‌గా విడిపోయి తమ చీఫ్స్‌ను సెలక్ట్ చేసుకోమని అడిగినప్పుడు నిఖిల్ టీమ్‌ను కేవలం ఇద్దరు మాత్రమే సెలక్ట్ చేసుకున్నారు. వారే బేబక్క, నాగ మణికంఠ. చివర్లో సోనియాకు వేరే ఆప్షన్ లేకపోవడంతో నిఖిల్ టీమ్‌లోకి వచ్చింది. అలా తన టీమ్‌లో కేవలం ముగ్గురు మాత్రమే చేరారు. దీంతో నిఖిల్‌ను పక్కన పెట్టి యష్మీ, నైనికా మధ్య టాస్కులు పెట్టారు బిగ్ బాస్. అందులో సంచాలకుడిగా వ్యవహరించాల్సిన నిఖిల్.. బాధ్యతలను పక్కన పెట్టి హౌజ్‌లో లవర్ బాయ్‌గా మారాడు.


ఫోకస్ అంతా అక్కడే

ముందుగా యష్మీ, నైనికా టీమ్స్‌లో సమానంగా సభ్యులు ఉన్నందుకు వారిద్దరి పోటీ జరగనుంది అని బిగ్ బాస్ ప్రకటించారు. ఆ పోటీలో గెలిచినవారికి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్‌లో నుండి ఎవరో ఒకరిని తమ టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ టాస్కులకు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొదటి టాస్క్‌లో యష్మీ టీమ్ విన్ అయ్యింది. కానీ రెండో టాస్క్ నుండి టీమ్స్ మధ్య ఆట న్యాయం జరగలేదు. ఇరు టీమ్స్ రూల్స్ బ్రేక్ చేస్తూ గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినా కూడా సంచాలకుడిగా ఉన్న నిఖిల్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతున్నాడు. ఎందుకంటే తన ఫోకస్ అంతా సోనియాపైనే ఉందని స్పష్టంగా తెలుస్తోంది.


Also Read: విష్ణు ప్రియను దూరం పెడుతోన్న హౌస్‌మేట్స్, కారణాలు ఇవేనా.. ఇలాగైతే కష్టమే!

గొడవ మధ్యలో

రెండో టాస్క్‌లో నైనికా టీమ్ స్ట్రాటజీని ఉపయోగించి విన్ అయ్యింది. మూడో టాస్క్‌లో యష్మీ టీమ్ న్యాయంగా ఆడకుండా విన్ అయ్యింది. అయినా కూడా సంచాలకుడిగా ఉన్న నిఖిల్.. ఈ రెండు సందర్భాలను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. టాస్కులు పూర్తయిన తర్వాత టీమ్స్‌కు, తనకు మధ్య గొడవలు కూడా జరిగాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా సోనియా దగ్గరకు వెళ్లి తనతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు నిఖిల్. రెండో టాస్క్ పూర్తవ్వగానే యష్మీ టీమ్‌తో తీవ్ర వాగ్వాదం జరిగినా అది పూర్తి కాకముందే సోనియా ఒంటరిగా ఉందని ఏమైంది అని కనుక్కోవడానికి వెళ్లాడు. టాస్క్ జరుగుతున్నప్పటి నుండి తననే గమనిస్తున్నానని, ఎందుకు డల్‌గా ఉన్నవంటూ తనను ఓదార్చాడు. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని సోనియా చెప్పగానే తనకు ధైర్యం చెప్పాడు.

ఫీల్ అయ్యాడు

నిఖిల్ ఎవరితో అయినా సరదగానే ఉంటాడు. ఎవరికి ఇబ్బంది ఉందని తెలిసినా వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ సోనియా విషయంలో మాత్రం నిఖిల్ కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ప్రేక్షకులు సైతం ఫీలవుతున్నారు. సోనియాను నిఖిల్ ఒంటరిగా వదలడానికి ఇష్టపడడంలేదు. యష్మీ టీమ్ గెలిచి.. సోనియాను వారి టీమ్‌లోకి తీసుకుంటానని ప్రకటించగానే నిఖిల్ ఈ నిర్ణయానికి అస్సలు సంతోషంగా లేడు. పైగా సోనియాను ఏదో ఒక విధంగా సంతోషపెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అలా సీజన్ 8లో నిఖిల్, సోనియాది మంచి లవ్ స్టోరీ అవుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×