BigTV English
Advertisement

Vishnupriyaa: విష్ణు ప్రియను దూరం పెడుతోన్న హౌస్‌మేట్స్, కారణాలు ఇవేనా.. ఇలాగైతే కష్టమే!

Vishnupriyaa: విష్ణు ప్రియను దూరం పెడుతోన్న హౌస్‌మేట్స్, కారణాలు ఇవేనా.. ఇలాగైతే కష్టమే!

Bigg Boss Vishnupriyaa: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో హౌజ్‌కు ముగ్గురు చీఫ్‌లు ఉన్నారు. వారే యష్మీ, నిఖిల్, నైనికా. ఈ ముగ్గురు టాస్కుల్లో బాగా ఆడి చీఫ్‌లుగా నియమితులయ్యాయి. ఇప్పుడు ఈ చీఫ్‌లకు మరింత బలం చేకూరడం కోసం కంటెస్టెంట్స్‌ను టీమ్స్‌గా విభజించాడు బిగ్ బాస్. తమ టీమ్‌లోకి ఏ కంటెస్టెంట్ రావాలి అనే నిర్ణయాన్ని చీఫ్‌లక వదిలేశాడు. కానీ ఒకవేళ ఇద్దరు చీఫ్‌లు ఒకే కంటెస్టెంట్ రావాలని కోరుకుంటే మాత్రం అప్పుడు ఎవరి టీమ్‌లోకి వెళ్లాలి అనే నిర్ణయం కంటెస్టెంట్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఇదంతా జరుగుతున్న క్రమంలో విష్ణుప్రియాను ముగ్గురు చీఫ్‌లు పక్కన పెట్టేశారు. దానికి కారణాలు ఏంటి అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలుపెట్టారు.


అంతా రివర్స్

బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్స్‌గా వచ్చినవారిలో చాలామంది సీరియల్ ఆర్టిస్టులే ఉన్నారు. సీరియల్స్‌ను బాగా ఫాలో అయ్యేవారికి ఈ కంటెస్టెంట్స్ గురించి తెలిసే ఉంటుంది. కానీ సీరియల్ ఆర్టిస్ట్ కాకపోయినా అదే రేంజ్‌లో పాపులారిటీ ఉన్న ఒకేఒక్క కంటెస్టెంట్ విష్ణుప్రియా. బుల్లితెరపై యాంకర్‌గా, సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ఫేమ్ సంపాదించుకుంది ఈ భామ. అందుకే బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టగానే తన గ్లామర్‌తో, గొడవలతో తమను ఎంటర్‌టైన్ చేస్తుందని భావించారు ప్రేక్షకులు. కానీ అలా జరగలేదు. బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి తన లోకం తనదే అన్నట్టుగా ఉండిపోయింది విష్ణుప్రియా.


Also Read: నిఖిల్, యష్మి మధ్య ‘బాడీ’ గొడవ.. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టిన నైనికా, ఆటలో అరటిపండులా సంచాలక్!

పట్టించుకోవడం లేదు

బిగ్ బాస్ అంటేనే గొడవలు. ఆ గొడవలే చాలామంది ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్. అలాంటిది విష్ణుప్రియా మాత్రం ఇతర కంటెస్టెంట్స్ సీరియస్‌గా గొడవపడుతున్నప్పుడు కూడా కామెడీ చేస్తూ తనపాటికి తాను ఉంటూ వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో తను కెమెరా ముందు కనిపించే సమయం కూడా తక్కువే అయిపోయింది. అలా బిగ్ బాస్‌కు ప్రస్తుతం చీఫ్‌లుగా వ్యవహరిస్తున్న నైనికా, నిఖిల్, యష్మీలకు కూడా విష్ణుప్రియా ఆటతీరు నచ్చలేదనుకుంటా. అందుకే కంటెస్టెంట్స్‌ను తమ టీమ్ కోసం సెలక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు విష్ణుప్రియాను సెలక్ట్ చేయడానికి ఒక్క చీఫ్ కూడా ముందుకు రాలేదు. ఇది విష్ణుప్రియా కూడా ఊహించకపోవడంతో తాను కూడా షాకయ్యింది.

వారితో మాత్రమే క్లోజ్

విష్ణుప్రియా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుండి కొందరు కంటెస్టెంట్స్‌తో చాలా సన్నిహితంగా ఉంటుంది. వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. అందులో నిఖిల్ కూడా ఒకడు. అలాంటి నిఖిల్ కూడా విష్ణుప్రియాను తన టీమ్‌లోకి తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో చాలా హర్ట్ అయ్యింది. సింపథీ స్టార్ అయిన నాగ మణికంఠను తన టీమ్‌లోకి తీసుకోవడానికి ముందుకొచ్చిన నిఖిల్.. తనకు మాత్రం అన్యాయం చేశాడని విష్ణుప్రియా ఫీల్ అయ్యింది. చివరికి నైనికా లేచి విష్ణుప్రియాను తన టీమ్‌లోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. మిగతా ఇద్దరు చీఫ్‌లు విష్ణుప్రియాను కంటెస్టెంట్‌గా తీసుకోవడానికి ముందుకు రాని సమయంలో నైనికా లేచి విష్ణును తన టీమ్‌లోకి ఆహ్వానించడం చాలా మంచి విషయమని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Big Stories

×