BigTV English

Bigg Boss 8 Telugu: టచ్ చేస్తే నామినేషన్.. పాత కంటెస్టెంట్స్‌ను ఫూల్స్ చేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

Bigg Boss 8 Telugu: టచ్ చేస్తే నామినేషన్.. పాత కంటెస్టెంట్స్‌ను ఫూల్స్ చేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో ఒకరి తర్వాత ఒకరిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ వచ్చేస్తున్నారు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా వచ్చినవారు కొత్తవారేమీ కాదు.. అందరూ ఇంతకు ముందు సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా కనిపించినవారే. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబ్ దిల్‌సే.. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. హరితేజ ఎంటర్ అయ్యింది కాబట్టి ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదని ప్రేక్షకులు అనుకునేలోపే మరొక ధమాకా కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. తనే రోహిని. బుల్లితెరపై ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న రోహిని.. హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే పాత కంటెస్టెంట్స్‌ను ఫూల్స్ చేసేసింది.


డబుల్ ఎంటర్‌టైన్మెంట్

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా వచ్చింది రోహిని. కానీ అప్పుడు రోహిణికి ఇంత పాపులారిటీ, చేతిలో ఇన్ని ఆఫర్స్ లేవు. అప్పటినుండి ఇప్పిటివరకు తనకు బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ లభించింది. అంతే కాకుండా తెలుగు బుల్లితెరపై లేడీ కామెడియన్ అంటే రోహిణి అనిపించుకుంది. అంత క్రేజ్ వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది రోహిణి. తన దృష్టిలో కత్తి ప్రేరణ అని, సుత్తి యష్మీ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే కంటెస్టెంట్ ఎవరు అంటే సీత అని సమాధానమిచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3లో రోహినితో కలిసి కంటెస్టెంట్‌గా ఉన్న శివజ్యోతి.. తనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో మెసేజ్ పంపింది. ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లగానే కంటెస్టెంట్స్‌ను ప్రాంక్ చేయవచ్చని ఆఫర్ ఇచ్చారు నాగార్జున.


Also Read: మళ్లీ వైల్డ్ కార్డ్‌లో తనే, ఈసారి ఆ పవర్ అంతా పాత కంటెస్టెంట్స్ చేతికే..

కంటెస్టెంట్ కాదు

బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంటర్ అవ్వగానే అందరిపై ప్రాంక్ మొదలుపెట్టింది రోహిణి. తనను టచ్ చేసినవాళ్లు కచ్చితంగా నామినేట్ అవుతారని చెప్పినా చాలామంది నమ్మరు. పైగా తను అసలు వైల్డ్ కార్డ్ కాదని కూడా చెప్తుంది. అలా కాసేపు అందరినీ ఎంటర్‌టైన్ చేసినా వెంటనే ఇది ప్రాంక్ అనే విషయం బయటపడిపోతుంది. వెంటనే అందరితో కలిసిపోతూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది రోహిణి. తన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా వచ్చాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 7లో ఒకసారి సీక్రెట్ రూమ్‌కు వెళ్లి అశ్వద్ధామ 2.0గా తిరిగొచ్చి తన ఆటతో అందరినీ మెప్పించాడు గౌతమ్. ఇప్పుడు సీజన్ 8లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.

స్టార్స్‌గా నిలిచారు

గౌతమ్ రాగానే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో తనకు నబీల్ పోటీలాగా అనిపిస్తాడని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కత్తి ఎవరు అంటే ప్రేరణ అని, సుత్తి ఎవరు అంటే యష్మీ అని చెప్పాడు. ప్రియాంక పంపిన వీడియో మెసేజ్‌తో మోటివేట్ అయ్యి హౌస్‌లోకి వెళ్లాడు. అందులోకి వెళ్లిన తర్వాత నలుగురు కంటెస్టెంట్స్‌కు నాలుగు ట్యాగ్స్ ఇవ్వమనగా.. సీతకు ఓవర్ కాన్ఫిడెంట్ అని, విష్ణుప్రియాకు బద్ధకం అని, మణికంఠ ఎక్కువగా ఆలోచిస్తాడని ట్యాగ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిని, గౌతమ్ కలిసి.. సీత, విష్ణుప్రియాతో టాస్క్ ఆడి గెలిచారు. దీంతో వారికి స్టార్ లభించింది. నామినేషన్స్ నుండి వారిని ఆ స్టారే సేవ్ చేస్తుంది అనే విషయం ఇంకా వారికి తెలియదు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×