E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: టీమ్ సీక్రెట్స్ బయటపెట్టిన విష్ణుప్రియా.. మణికంఠకు గంగవ్వ వార్నింగ్

Bigg Boss 8 Telugu: టీమ్ సీక్రెట్స్ బయటపెట్టిన విష్ణుప్రియా.. మణికంఠకు గంగవ్వ వార్నింగ్
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్.. గత నెల రోజులుగా అదే హౌస్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా 8 మంది కంటెస్టెంట్స్ యాడ్ అయ్యారు. అందుకే పాత కంటెస్టెంట్స్‌కు ‘ఓజీ’ అని, కొత్త కంటెస్టెంట్స్‌కు ‘రాయల్స్’ అని పేర్లు ఇచ్చారు. ఇక రాయల్స్ అనేవారు బిగ్ బాస్ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు.. వీరిని మునుపటి సీజన్స్‌లో ఆల్రెడీ చూసేశాం. అయినా బిగ్ బాస్ 8లోకి కొత్తగా ఎంటర్ అయ్యి, కొత్తగా ఎంటర్‌టైన్మెంట్ పంచడానికి సిద్ధమయ్యారు. అప్పుడే కొందరు ‘ఓజీ’ టీమ్ సభ్యులు.. రాయల్స్‌తో కలిసిపోయారు. అంతే కాకుండా విష్ణుప్రియా అయితే రాయల్స్‌తో తమ టీమ్ సీక్రెట్ సైతం షేర్ చేసేసుకుంది.

పిల్ల బచ్చాగాళ్లు

Advertisement

‘రాయల్స్’ టీమ్ కొత్తగా వచ్చింది కాబట్టి అసలు అందులో ఎవరెవరికి ఎలాంటి కెపాసిటి ఉందని ‘ఓజీ’ టీమ్ చర్చించడం మొదలుపెట్టింది. ఆ కంటెస్టెంట్స్ గురించి తనకు తెలిసిన విషయాలను చెప్పాడు నిఖిల్. ‘‘గౌతమ్ బాగా ఆడతాడు కానీ ఆలోచనలో వీక్. మెహబూబ్ ఎక్కువగా గొడవపెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. రోహిణి కూడా ఫిజికల్ గేమ్స్‌లో బాగా ఆడుతుందని అనిపిస్తుంది. అవినాష్ ఆటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు. వాళ్లు గొడవపడడానికి ట్రై చేస్తే మనం కూడా ఆలోచించకుండా గొడవకు దిగుదాం’’ అంటూ టీమ్‌ను మోటివేట్ చేశాడు నిఖిల్. అదే సమయంలో రోహిణి.. అందరినీ పిల్లబచ్చగాళ్లు అంది అని, దానికి తాను ఫీల్ అయ్యానని మణికంఠ అన్నాడు. అయితే హౌస్‌లోని అబ్బాయిలు వయసులో తనకంటే చిన్న కాబట్టి అలా అంది అని ప్రేరణ క్లారిటీ ఇచ్చింది.

Also Read: ఆత్మహత్య చేసుకున్న తండ్రి, మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన తల్లి.. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కథ చాలా ఎమోషనల్

Advertisement

తప్పు ఒప్పేసుకుంది

ఆ తర్వాత రోహిణితో కలిసి హౌస్‌మేట్స్ గురించి డిస్కషన్ ప్రారంభించింది విష్ణుప్రియా. మణికంఠ అసలు హౌస్‌లో ఉంటాడని రోహిణి అడిగింది. అంతే కాకుండా కంటెస్టెంట్స్ అంతా కలిసి మణికంఠను టార్గెట్ చేసినట్టే అనిపిస్తుందని బయట విషయాలు చెప్పింది. అయితే మణికంఠ మామూలుగా సరదాగానే ఉన్నా కూడా అప్పుడప్పుడు కొంచెం విసుగు తెప్పిస్తాడని, తను పిల్ల బచ్చాగాళ్లు అన్నందుకే ఫీల్ అయ్యాడని రోహిణితో చెప్పేసింది విష్ణుప్రియా. దీంతో రాయల్స్‌లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అదే విషయం ఓజీ టీమ్‌కు కూడా తెలిసింది. మణికంఠ గురించి రోహిణికి తానే చెప్పానని ఒప్పేసుకుంది విష్ణుప్రియా.

నామినేట్ చేస్తా…

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చిన గంగవ్వ.. సీజన్ 8లో కూడా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటిరోజే తాను మెగా చీఫ్ అయ్యానని తనను తాను పరిచయం చేసుకున్నాడు నబీల్. ఆ సమయంలో మణికంఠ కూడా అక్కడే ఉన్నాడు. తాను మెగా చీఫ్ అవ్వాలని అనుకున్నానని కానీ పిల్లోడు ఏడుస్తున్నాడని తనకు ఇచ్చేశానని కామెడీ చేశాడు మణి. అయితే తాను ఎప్పుడు పెళ్లాం, బిడ్డ గురించే ఆలోచిస్తున్నాడని, అలా అయితే బయటికి వెళ్లిపో నామినేట్ చేస్తానని మణికంఠకు కౌంటర్ ఇచ్చింది గంగవ్వ. ప్రతీసారి పెళ్లాం, బిడ్డ పేరు తీసుకురావడం కరెక్ట్ కాదు అన్నట్టుగా మణికంఠకు సలహా ఇచ్చింది. మొత్తానికి ఈసారి గంగవ్వ కూడా ఆటకు ఫుల్ రెడీ అయ్యి వచ్చిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×