BigTV English

OTT Movie : బాయ్ ఫ్రెండ్ మీనింగ్ ఏంటో తెలియని అమ్మాయికి రొమాన్స్ నేర్పించే 200 ఏళ్ల దెయ్యం… క్రేజీ కొరియన్ హారర్ లవ్ స్టోరీ

OTT Movie : బాయ్ ఫ్రెండ్ మీనింగ్ ఏంటో తెలియని అమ్మాయికి రొమాన్స్ నేర్పించే 200 ఏళ్ల దెయ్యం… క్రేజీ కొరియన్ హారర్ లవ్ స్టోరీ

OTT Movie : హారర్ సినిమాలు ఎంత క్రేజీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఫాంటసీ, లవ్ స్టోరీ కలిగివున్న హారర్ సినిమాలు చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా వీటికి ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతున్నా కొరియన్ అనే జానర్ యాడ్ అయ్యిందంటే ఆ మ్యాడ్ నెస్ నెక్స్ట్ లెవెల్ అంతే. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ క్రేజీ కొరియన్ హారర్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే విషయాలను చూసేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రేజీ హరర్ లవ్ స్టోరీ సినిమా కాదు ఒక వెబ్ సిరీస్. మొత్తం 16 ఎపిసోడ్లతో ఈ హారర్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ సినిమాలంటే పిచ్చిగా ఇష్టపడేవారు కచ్చితంగా ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాల్సిందే. అంతేకాకుండా హరర్ సినిమాలను చూసి చూసి విసిగిపోయిన మూవీ లవర్స్ కొత్తగా ఏదైనా సినిమాలను చూడాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.


కథలోకి వెళ్తే… 

హీరోయిన్ ఈ మూవీలో ఒక కంపెనీకి బాస్. పెళ్లి వయసు దాటిపోయినా ఆమె అస్సలు పెళ్లి, రొమాన్స్ గురించి ఆలోచించదు. బాయ్ ఫ్రెండ్ మీనింగ్ ఏంటో కూడా తెలియదు. ఎప్పుడు చూసినా పని పని అంటూ కంపెనీని బాధ్యతగా నడిపించే బరువును భుజాలపై వేసుకుంటుంది. ఇక జల్సాల ఊసే ఉండదు. ఎప్పుడూ తన దృష్టి మొత్తం కంపెనీ పనుల పైనే ఉంటుంది. ఇలాంటి అరుదైన అమ్మాయి జీవితంలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. అయితే అతను మనిషి కాదు… ఏకంగా 200 ఏళ్ల వయసున్న దెయ్యం. ఈ దెయ్యం హీరో హీరోయిన్ కంపెనీలో ఉద్యోగం కోసం జాయిన్ అవుతాడు. అయితే అతను స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉండడంతో హీరోయిన్ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అతను కూడా ఆమె అంటే ఇష్టం ఉండడంతో నెమ్మదిగా దగ్గరవుతాడు. మొత్తానికి ఓకే కంపెనీలో ఉండి బాస్ ఎంప్లాయ్ ఇద్దరు సీక్రెట్ గా లవ్ స్టోరీని నడిపిస్తారు. కానీ హీరోయిన్ కి అసలు అతను దయ్యం అన్న విషయం అసలు తెలియదు. ఒకానొక టైంలో నీళ్లలో మునిగిపోతున్న హీరోని హీరోయిన్ కాపాడడంతో వీళ్ళ పరిచయం మొదలవుతుంది. ఇక ఆ టైంలో హీరోకి ఉన్న పవర్ హీరోయిన్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ తర్వాతే వీరిద్దరూ మరింత దగ్గరవుతారు. హీరో తన శక్తులన్నీ పోయి సాధారణ మనిషిలా మారడంతో హీరోయిన్ దగ్గర నుంచి తన పవర్స్ తిరిగి పొందడం కోసం దగ్గరవుతూ ప్రయత్నిస్తాడు. మొత్తానికి ఓరోజు తన గురించి హీరోయిన్ కి తెలుస్తుంది. మరి ఆ తర్వాత హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ జంట చివరకు ఒకటయ్యారా? హీరో తన పవర్స్ ని తిరిగి పొందగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘మై డిమన్’ అనే ఇస్ సిరీస్ పై ఒక లుక్కెయ్యండి.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×