BigTV English

Bigg Boss 18: ఆత్మహత్య చేసుకున్న తండ్రి, మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన తల్లి.. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కథ చాలా ఎమోషనల్

Bigg Boss 18: ఆత్మహత్య చేసుకున్న తండ్రి, మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన తల్లి.. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కథ చాలా ఎమోషనల్

Bigg Boss 18: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఇండియాలోకి వచ్చి చాలాకాలం అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడలాంటి సౌత్ భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు చాలా పాపులారిటీ ఉంది. కానీ వీటన్నింటితో పోలిస్తే హిందీలో ఈ షోకు ఎనలేని పాపులారిటీ ఉంది. అందుకే హిందీలో ఇప్పటివరకు బిగ్ బాస్ 17 సీజన్లను పూర్తిచేసుకుంది. తాజాగా బిగ్ బాస్ 18 కూడా ప్రారంభమయ్యింది. ఇందులోకి 18 మంది సెలబ్రిటీలు.. బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయ్యారు. అందులో ఒకరు ఆలిస్ కౌశిక్. బిగ్ బాస్ 18లోకి 18వ కంటెస్టెంట్‌గా ఎంటర్ అయిన ఆలిస్ కథ.. ప్రేక్షకులను సైతం ఎమోషనల్ చేసేసింది.


నిజాన్ని నమ్మలేకపోతున్నాను

ఆలిస్ కౌశిక్.. కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యే ముందు తన లైఫ్‌కు సంబంధించిన వీడియోను చూపించారు బిగ్ బాస్ మేకర్స్. అందులో ఆలిస్ తన జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ‘‘నేను మా నాన్నకు చాలా క్లోజ్. కానీ సడెన్‌గా ఒకరోజు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారని నాకు ఫోన్ వచ్చింది. ఆ విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నాన్న లేడనే నిజాన్ని ఇప్పుడిప్పుడు నమ్మడం మొదలుపెడుతున్నాను. ఆ సమయంలో అమ్మ నాతో కలిసి ఉండకపోయినా తనే నాకు అండగా నిలిచింది’’ అంటూ తన తండ్రి ఆత్మహత్య గురించి బయటపెట్టింది ఆలిస్ కౌశిక్.


Also Read: బిగ్ బాస్ పై పిచ్చితో కెరీర్ ను ఇరకాటంలో పెట్టిన రోహిణి..!

ఇళ్లంతా ఖాళీ

‘‘మా అమ్మ వేరే పెళ్లి చేసుకొని తన భర్తతోనే కలిసుండేది. అయినా నాతో టచ్‌లోనే ఉండేది. కానీ కొన్నేళ్ల తర్వాత అమ్మ కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది’’ అని తన తల్లిదండ్రుల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది ఆలిస్ కౌశిక్. ఇప్పుడు కూడా షూటింగ్ నుండి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఇళ్లంతా ఖాళీగా ఉంటుందని, తన తనను మరింత బాధపడేలా చేస్తుందని చెప్పుకొచ్చింది. ఆలిస్ కథ విన్న తర్వాత సల్మాన్ ఖాన్ కూడా ఫీలయ్యాడు. అందుకే తను కచ్చితంగా షో గెలవాలని మోటివేషన్ ఇచ్చాడు. అంతే కాకుండా ఎల్లప్పుడూ ఇలాంటి స్ట్రాంగ్‌గా ఉండాలని సలహా ఇచ్చాడు. అంతే కాకుండా ఆలిస్ కచ్చితంగా ఫైనల్స్‌కు వెళ్తుందని స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు సల్మాన్ ఖాన్.

బుల్లితెర యాక్టర్స్ సపోర్ట్

ఆలిస్ కౌశిక్ బాలీవుడ్ బుల్లితెర నటి. తను పలు సీరియల్స్‌లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ‘పాండ్యా స్టోర్’ అనే సీరియల్.. ఆలిస్‌ను ఎనలేని గుర్తింపు సంపాదించి పెట్టింది. అందుకే బిగ్ బాస్ 18లోకి కంటెస్టెంట్‌గా వచ్చిన ఆలిస్ కౌశిక్‌కు చాలామంది బుల్లితెర నటీనటుల సపోర్ట్ ఉంది. ప్రస్తుతం తను ‘కతీలాల్ అండ్ సన్స్ – కహానీ అబ్ తక్’ అనే సీరియల్‌లో నటిస్తోంది. బుల్లితెర నటి అయిన ఆలిస్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ ఉంది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన క్యూట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది ఆలిస్.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×