BigTV English

Bigg Boss 8 Telugu: సోనియా, నిఖిల్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌజ్‌లో మరో ప్రేమకథ? షో తర్వాత ఆ ఇద్దరు హాలిడేకు ప్లాన్

Bigg Boss 8 Telugu: సోనియా, నిఖిల్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌజ్‌లో మరో ప్రేమకథ? షో తర్వాత ఆ ఇద్దరు హాలిడేకు ప్లాన్

Bigg Boss 8 Telugu: మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ప్రేమకథ అనేది చాలా కామన్. బయట వారి పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన తర్వాత కేవలం ఒక కంటెస్టెంట్‌తో మాత్రమే క్లోజ్‌గా ఉండడంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని తోటి కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఫీలవుతారు. అలా బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారం పూర్తయ్యేసరికి నిఖిల్, సోనియా మధ్య క్లోజ్‌నెస్ పెరిగిందని ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ సరిగా గమనిస్తే హౌజ్‌లోకి మరొక జంట కూడా కనిపిస్తుంది. తాజాగా నాగార్జున ముందే ఈ జంట గురించి బయటపడింది.


వారిద్దరే హైలెట్

చీఫ్స్ అయిన యష్మీ, నైనికా టీమ్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం తనకు లేనప్పుడు తనను తాను ఆడపులి అనుకుంటూ, నిఖిల్‌ను ఎదిరించే ధైర్యం తనకు మాత్రమే ఉందంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చి వెళ్లి తన టీమ్‌లో జాయిన్ అయ్యింది సోనియా. తనపాటికి తాను ఉన్నా కూడా నిఖిల్ తనపై అనవసరంగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఇతర కంటెస్టెంట్స్‌కు అర్థమయ్యింది. మెల్లగా సోనియా కూడా నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టింది. ఇదే విషయంపై విష్ణుప్రియా తనను ప్రశ్నించడంతో గొడవ పెద్దగా చేసి ప్రేక్షకుల్లో కూడా తనపై నెగిటివ్ అభిప్రాయం వచ్చేలా చేసుకుంది సోనియా. అలా నిఖిల్, సోనియాల విషయం హైలెట్ అయ్యింది. కానీ షోలో హైలెట్ అవ్వకుండా సైలెంట్‌గా క్లోజ్ అవుతున్న మరొక జంట విష్ణుప్రియా, పృథ్విరాజ్.


Also Read: బిగ్ బాస్‌కు బేబక్క బైబై.. వెళ్లేటప్పుడు కూడా నిఖిల్, సోనియాపై అవే వ్యాఖ్యలు

కాఫీ స్నేహం

మొదటి నుండి పృథ్విరాజ్ కిచెన్ విషయంలో పెద్దగా యాక్టివ్‌గా లేడు. అంతే కాకుండా క్లీనింగ్‌కు కూడా తను పెద్దగా సాయం చేసేవాడు కాదు. దీనివల్ల అందరిలో తనపట్ల ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. కానీ విష్ణుప్రియా మాత్రం ఒకరోజు తనకు కాఫీ కలిపి ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై బేబక్క.. పృథ్విని నామినేట్ చేయడంతో ఈ విషయం మరింత పెద్దగా మారింది. విష్ణుప్రియా.. పృథ్వికి స్పెషల్‌గా కాఫీ కలిపి ఇచ్చిందని అందరికీ తెలిసింది. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి తనకు కాఫీ కలిపి ఇవ్వమని విష్ణుప్రియాకు చెప్పారు. కలిపిన తర్వాత అది పృథ్వికి ఇచ్చేయమన్నారు. దీంతో నాగార్జున ఏ ఉద్దేశ్యంతో అన్నారో అందరికీ అర్థమయ్యింది.

హాలిడేకు ప్లాన్

ఆదివారం ఎపిసోడ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలను టీమ్స్‌గా విభజించి ఇరువురితో సరదా టాస్కులు ఆడించారు నాగార్జున. అందులో ఒక టాస్క్ ఆడుతున్న సమయంలో విష్ణుప్రియాతో పృథ్విరాజ్‌ను పోటీకి దిగమన్నారు. దీంతో అమ్మాయిలంతా ఒక్కసారిగా అరిచారు. ఎందుకు అరిచారు అని అడగగా.. విష్ణుప్రియా, పృథ్వి గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్‌లాగా నటించి చూపించారని, చాలా బాగుందని అన్నారు. అంతే కాకుండా షో అయిపోయిన తర్వాత ట్రిప్‌కు కూడా వెళ్దామని ప్లాన్ చేశారని నైనికా రివీల్ చేసింది. అది విని షాక్ అయిన విష్ణుప్రియా చెప్పొద్దంటూ సైగ చేసింది. దీన్నిబట్టి చూస్తే విష్ణుప్రియా, పృథ్విరాజ్ మధ్య కూడా మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరినట్టు అనిపిస్తోంది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×