BigTV English

Super Typhoon Yagi: నిన్న చైనా.. ఇప్పుడు వియత్నాం.. యాగి తుపాను బీభత్సంతో 14 మంది మృత్యువాత

Super Typhoon Yagi: నిన్న చైనా.. ఇప్పుడు వియత్నాం.. యాగి తుపాను బీభత్సంతో 14 మంది మృత్యువాత

Super Typhoon Yagi Hits Vietnam, 14 Killed: సూపర్ టైఫూన్ యాగి తుపాను బీభత్సం సృష్టిస్తోంది. చైనా, హాంకాంగ్‌లను అతలాకుతలం చేసిన ఈ తుపాను వియత్నాంపై పంజా విసిరింది. వియత్నాంలో ఈ తుపాను ధాటికి ఇప్పటివరకు 14 మంది మృత్యువాత పడగా.. 176 మంది గాయపడ్డారు. ఈ తుపాను గత దశాబ్ధ కాలంలో భయంకర తుపానులో అధికారులు పేర్కొంటున్నారు.


చైనా, హాంకాంగ్ లోనూ యాగి తుపాను బీభత్సం సృష్టించి భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తుపాను తీవ్రత తగ్గినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

రానున్న మూడు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయని వియత్నాం వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈ యాగి ధాటికి వేలాది వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో దాదాపు 30 లక్షల ఇళ్లకు సరఫరా నిలిచిపోయింది. అదే విధంగా లక్షా20వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.


తుపాను ప్రభావానికి నాలుగు విమానాశ్రయాలు మూతపడగా..అనేక విమానాలు రద్దయ్యాయి. క్వాంగ్ నిన్, హైఫాంగ్ ప్రాంతాల్లో దాదాపు 149 కిలోమీటర్ల ప్రచండ వేగంతో తీరం దాటిన తుపాను 15 గంటలపాటు అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో పలు చోట్లు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read: చైనాలో యాగీ తుఫాను బీభత్సం.. నేల కూలిన బిల్డింగులు, ఎగిరిపోయిన వాహనాలు

అంతకుముందు, చైనాలో విజృంభించిన యాగి తీవ్రతకు హైనాన్, గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో నలుగురు చనిపోగా..95మంది గాయపడినట్లు సమాచారం. ప్రముఖ పర్యాటక ప్రాంతమైనా హైనాన్ ను తుపాను అతలాకుతలం చేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×