BigTV English

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 హోస్ట్ రెమ్యూనరేషన్ పెరిగిందా..? ఎన్ని కోట్లంటే..?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 హోస్ట్ రెమ్యూనరేషన్ పెరిగిందా..? ఎన్ని కోట్లంటే..?

Bigg Boss 9 : బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మందికి మంచి లైఫ్ వచ్చింది. వరుస సినిమాలతో కొంతమంది బిజీగా ఉంటే మరి కొంతమంది సీరియల్స్లలో బిజీగా ఉంటున్నారు. రియాలిటీ షోతో ఎంతో మందికి మంచి లైఫ్ దొరికింది. ప్రేక్షకులకు గుర్తింపు దక్కడంతో పాటు వారి వారి నైపుణ్యాలను బట్టి బుల్లితెరపై సందడిచేసే అవకాశం లభిస్తున్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ 8 గత ఏడాది పూర్తయింది. ఈ సీజన్కు కన్నడ హీరో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అంతకు ముందు సీజన్లో తో పోలిస్తే గత సీజన్లో ఎక్కువగా సీరియల్స్ స్టార్ట్స్ తో షోని అలా లాగించేసారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ షో కి హోస్టుగా చేస్తున్న నాగార్జున రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఓ వార్త అయితే వినిపిస్తుంది.. మరి ప్రస్తుతం నాగార్జున సీజన్ 9 కి ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం..


బిగ్ బాస్ 9 త్వరలోనే ప్రారంభం..

బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదవ సీజన్ మొదలయ్యేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే 9వ సీజన్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ లాగే ఈ సీజన్ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్.. టాస్క్ లు, కంటెస్టెంట్స్ విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హోస్ట్ గా కూడా నాగార్జుననే ఫైనల్ చేస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదట్లో హోస్ట్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ పోస్టుగా వ్యవహరించగా.. రెండో సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదవ సీజన్ వరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్టైల్ కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో మళ్లీ మళ్లీ నాగర్జునని హౌస్ గా రావాలని కోరుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ నాగార్జున సీజన్ 9 కి రెమ్యూనరేషన్ ను పెంచేసినట్లు ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నాగార్జున ఎంత వసూలు చేస్తున్నాడంటే..


Also Read : నితిన్ తమ్ముడుకు అడ్డంకి..టైం చూసి దెబ్బ కొట్టారుగా..

రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిన నాగార్జున.. 

బిగ్ బాస్ షో జరిగిన తర్వాత, ముందు సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం కామన్.. అయితే ఈసారి ఈ షోలో అలాంటివి జరగకుండా చూసుకోవాలని టీం ప్లాన్ చేస్తున్నారట..ఈ సీజన్ విషయంలో నాగార్జున కూడా పూర్తి ఫోకస్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఇదివరకు కన్నా నాగార్జున ఈ సీజన్ కి రెట్టింపు రెమ్యునరేషన్ అడుగుతున్నారని తెలుస్తుంది. బిగ్బాస్ అంటే తెలుగులో నాగార్జుననే అని ఫిక్స్ అయ్యేలా ఆడియన్స్ మైండ్ సెట్ ని నాగార్జున మార్చేసాడు. ఇంకొక హోస్ట్ అంటే ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే నాగార్జున డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం జరగబోతున్న షో కి ఆయన ఏకంగా 30 కోట్ల రెమ్యూనిరేషన్ ని తీసుకోబోతున్నారంటు సమాచారం.. వంద రోజులకి 30 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సినిమా కన్నా ఎక్కువగానే నాగార్జునా తీసుకోబోతున్నాడు. రెమ్యూనరేషన్ ను పెంచారంటే సీజన్ 9 షో గట్టిగానే ఉంటుందని అర్థమైపోతుంది.. మరి ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×