OTT Movie : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయంటే… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే పూర్తయ్యేదాకా ఆపలేము. ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సినిమానే మన మూవీ సజెషన్. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
కథలోకి వెళ్తే…
మాంట్రియల్‌లో నివసించే కెల్లీ-అన్నే (జూలియెట్ గారియేపీ) ఒక ఫ్యాషన్ మోడల్, ఆన్‌లైన్ పోకర్ గేమర్, క్రిప్టోకరెన్సీ ట్రేడర్. ఆమె ఒక హై-ప్రొఫైల్ సీరియల్ కిల్లర్ ట్రయల్ పై తీవ్రమైన ఆసక్తిని కనబరుస్తుంది. ఈ ట్రయల్ లుడోవిక్ షెవాలియర్ (మాక్స్‌వెల్ మెక్‌కేబ్-లోకోస్) అనే వ్యక్తి మీద జరుగుతుంది. అతను ముగ్గురు టీనేజ్ అమ్మాయిలను హత్య చేసి, వారి హత్యలను “రెడ్ రూమ్” అనే డార్క్ వెబ్ చాట్ రూమ్‌లో లైవ్‌స్ట్రీమ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటాడు. కొంతమంది జనాలు అలాంటివి చూడడానికి భారీగా డబ్బులు చెల్లిస్తారు. ఈ కేసు మీడియా సర్కస్‌గా మారి, షెవాలియర్ “ఫ్యాన్స్”ను ఆకర్షిస్తుంది. వారిలో కొందరు అతను నిర్దోషి అని నమ్ముతారు.
కెల్లీ-అన్నే రోజూ కోర్టు హాలు దగ్గర మొదటి సీటు కోసం వేచి ఉంటుంది. ఈ కేసు ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన పనిగా మారుతుంది. ఆమె తన అపార్ట్‌మెంట్‌లో ఒక అధునాతన AI-వాయిస్ కంప్యూటర్ సిస్టమ్‌ను ఉపయోగిస్తూ, డార్క్ వెబ్‌లో ఈ కేసు గురించి లోతుగా పరిశోధిస్తుంది. ట్రయల్‌లో ఆమె క్లెమెంటైన్ (లారీ బాబిన్) అనే మరొక యువతిని కలుస్తుంది. ఆమె షెవాలియర్‌ను సమర్థిస్తూ, అతనిని నిర్దోషి అని నమ్ముతుంది. కెల్లీ-అన్నే, క్లెమెంటైన్ మధ్య సంబంధం కథలో ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది. కానీ కెల్లీ-అన్నే అసలు ఉద్దేశం ఏంటో ఎవ్వరికీ తెలియదు.
కథ ముందుకు సాగే కొద్దీ, కెల్లీ-అన్నే ఒక మిస్సింగ్ వీడియోను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. ఇది మూడవ బాధితురాలైన 13 ఏళ్ల అమ్మాయి హత్య రికార్డింగ్. ఈ వీడియో కోసం ఆమె డార్క్ వెబ్‌లో లోతుగా డైవ్ చేస్తుంది. ఆమె హద్దులు దాటి, సైకలాజికల్ గా ఇబ్బంది పడుతుంది. ఈ భయంకరమైన వాతావరణంలో తాను చేస్తున్నది న్యాయం కోసమా? లేక మరింత వక్రమైన ఆకర్షణ కోసమా? అనే ఆలోచనలో పడుతుంది. ఇంతకీ అంతటి దారుణమైన పని చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడింది? అందులో హీరోయిన్ పాత్ర ఏంటి? ఎందుకు ఆమె నిందితుడిని సపోర్ట్ చేసింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
Read Also : అందరి ముందే డ్యాన్సర్ ను లేపేసి అలాంటి పని… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ మూవీ పేరు “రెడ్ రూమ్స్” (Red Rooms – Les Chambres Rouges). 2023లో విడుదలైన ఫ్రెంచ్-కెనడియన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. దీనికి పాస్కల్ ప్లాంట్ దర్శకత్వం వహించారు. జూలియెట్ గారియేపీ (కెల్లీ-అన్నే), లారీ బాబిన్ (క్లెమెంటైన్), మాక్స్‌వెల్ మెక్‌కేబ్-లోకోస్ (లుడోవిక్ షెవాలియర్) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 58 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ మూవీ ఇండియాలో Shudderలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇది ఫ్రెంచ్ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. లేదంటే JustWatch సైట్లో కూడా ఈ సినిమాను చూడవచ్చు.