Kohli- Misbah : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆసియా కప్ కి దూరమయ్యాడు. అయితే ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ 2025లో భాగంగా రేపు ఆడబోయే టీమిండియా-పాక్ మ్యాచ్ లో భారత జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్తాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ పేర్కొన్నారు. ” గత పదేళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమిండియా టీ-20 టోర్నీలు ఆడలేదు. అసలు టాపర్డర్ ను పాకిస్తాన్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్ లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేడు. భారత్ ను దెబ్బతీసేందుకు ఇది ఒక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే వారిని మాత్రం ఆపలేము “అని తెలిపారు.
Also Read : Hardik pandya : రోబో కంటే దారుణంగా మారిపోతున్న హార్దిక్ పాండ్యా… అందుకే నటాషా వదిలేసిందా !
ప్రస్తుతం మిస్బా ఉల్ హక్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాలిబన్లు కూడా ఆయన క్రేజ్ మామూలుగా లేదనే చెప్పడం గమనార్హం. ప్రముఖ ఉగ్రవాద సంస్థ తాలిబన్ కీలక సభ్యుడు అనాస్ హక్కా నీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ 50 ఏళ్లు వచ్చేంత వరకు క్రికెట్ ఆడుతూ ఉండాలి. తాలిబన్లు కోహ్లీ బ్యాటింగ్ చూడటం తెగ ఎంజాయ్ చేస్తారని వెల్లడించాడు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఆటగాడు కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ తలపడ్డ మ్యాచ్ ల్లో పలువురు బ్యాట్స్ మెన్స్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా తరపున విరాట్ కోహ్లీ 11 టీ-20 మ్యాచ్ లు ఆడి మొత్తం 492 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
మరీ రేపు జరుగబోయే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరిలో ఒకరూ పాకిస్తాన్ పై సెంచరీ చేయడం గ్యారెంటీ అంటూ టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఆదివారం జరుగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొందరూ మాత్రం పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని పేర్కొంటున్నారు. బీసీసీఐ, భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. యూఏఈ తో ఆడిన అదే టీమిండియా.. పాకిస్తాన్ తో కూడా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. వాస్తవానికి టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో స్పిన్నర్లదే హవా కొనసాగనుంది. అయితే టీ-20 టాప్ స్పిన్నర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ ర్యాంకుల్లో భారత్ తరపున మెరుగైన బౌలర్ కూడా అతడే కావడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.అక్షర్ పటేల్ స్పిన్ ఆల్ రౌండర్ గా అదుర్స్ అనిపిస్తున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. మరోవైపు పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ నవాజ్ అత్యంత ప్రమాదకరమైన బౌలర్ అని చెప్పవచ్చు. అబ్రార్ అహ్మద్, సయూమ్ అయూబ్, సుఫియాన్ ముకీమ్ వంటి పార్ట్ స్పిన్నర్లు వికెట్లు తీసే బౌలర్లే కావడం విశేషం. భారత బ్యాటర్లు పాక్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.