Rangareddy Crime: ఇద్దరు అమ్మాయిలు.. ఓ అబ్బాయి. వారంతా హైస్కూల్ నుంచి స్నేహితులు. వారి మధ్య ఏం జరిగిందో తెలీదు. కాకపోతే రోజు తప్పించి రోజు మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. సంచలనం రేపిన ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు?
ముగ్గురు ఫ్రెండ్స్ ఆత్మహత్యల వెనుక
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామం ఈ ఘటనలకు వేదికైంది. వైష్ణవి-శ్రీజ-రాకేష్ వీరు ముగ్గురు స్నేహితులు. ఇద్దరు అమ్మాయిలకు 18 ఏళ్లు, 21 ఏళ్ల రాకేష్. వీరంతా ఒకటే గ్రామం. 6 నుంచి పదో తరగతి వరకు వీరంతా కలిసి చదువుకున్నారు. ఒకటే గ్రామంలో కావడంతో ఏ చిన్న వచ్చినా పరిష్కరించుకునేవారు. వీరిని చూసి ఊళ్లోవారు రకరకాలుగా ముచ్చట్లు పెట్టుకునేవారు. వారి పేరెంట్స్ అవేమీ పట్టించుకోలేదు.
చివరకు ఏమైందో తెలీదు. రోజు తప్పించు రోజు మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్యలకు కలకలం రేపింది. స్నేహితులుగా ఉండే ఈ ముగ్గురు ఒకేసారి సూసైడ్ చేసుకోవడం అంతుబట్టడం లేదు. దీనిపై ఆ గ్రామంలో రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. వైష్ణవి అనే యువతి కడుపు నొప్పితో బాధపడుతుండేది. మూడు రోజుల కిందట కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులు భావించారు.
రోజు తప్పించి రోజు
స్నానం చేసి వస్తానని తల్లితో చెప్పి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతకూ తలుపులు ఓపెన్ కాకపోవడంతో పగలగొట్టారు తల్లిదండ్రులు. అప్పటికే వైష్ణవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఈ ఘటనను చూసి షాకయ్యారు తల్లిదండ్రులు. ఈ ఘటన మంగళవారం జరిగింది. వైష్ణవి క్లాస్‌మేట్ రాకేష్. బుధవారం రాత్రి సమీపంలోని షట్టర్ రూమ్‌కి నిద్రపోవడానికి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు.
గురువారం ఉదయం రాకేష్ తల్లి వాకిలు ఊడ్చుతుండగా రాకేష్‌ని చూసి ఒక్కసారిగా షాకైంది. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో మిగతా కొడుకులు వచ్చి రాకేష్‌ని కిందకు దించారు. అప్పటికే చనిపోయాడు. దీని తర్వాత మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన నర్సింహకు ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు శ్రీజ. పదో తరగతి వరకు చదివింది, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది.
ALSO READ: కర్నూలు బస్సు ప్రమాదం.. ఓ ఫ్యామిలీలో నలుగురు మృతి
నర్సింహ డ్యూటీకి బయలుదేరే సమయానికి కుమార్తెలు నిద్ర పోతున్నారు. ఉదయం 12 గంటల సమయంలో మూడో కూతురు వెళ్లి సమీపంలోని తన కజిన్ సోదరుడికి ఏదో విషయం చెప్పింది. అతడు వచ్చేసరికి తలుపు గడియ పెట్టి ఉంది. తలుపులు విరగ్గొట్టి చూసేసరికి శ్రీజ కూడా ఆత్మహత్యకు పాల్పడంది. వైష్ణవి విషయం తెలిసి రాకేష్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
వారిద్దరి మరణాల గురించి తెలిసి శ్రీజ ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ముగ్గురు ఆత్మహత్యలపై రకరకాల కథనాలు ఆ గ్రామంలో హంగామా చేస్తున్నారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరి పోలీసుల విచారణలో ముగ్గురు ఫ్రెండ్స్ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.