Bigg Boss 9 Telugu : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడిప్పుడే కాస్త ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. హౌస్ లో ప్రస్తుతం గ్యాంగ్స్ వారు నడుస్తున్న విషయం తెలిసిందే. వీరికి మరింత హైప్ ను ఇచ్చేందుకు సీజన్ 7 విన్నర్ అమర్ దీప్, రన్నర్ అంబటి అర్జున్ పోలీస్ పాత్రల్లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న టాస్కులకు సింక్ అయ్యేలా వీరి గెటప్ లో ఉండడంతో జనాలు బిగ్ బాస్ ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కెప్టెన్సీ కోసం రెండు గ్యాంగులు పోటీపడి మరి టాస్కులలో పర్ఫామెన్స్ చేస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ లో కండక్ట్ చేసిన ఒక టాస్క్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆ టాస్క్ ఏంటో? సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
గతంలో ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్లో ఈ టాస్క్ జనాలని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా.. మీరు విన్నది అక్షరాల నిజం. గతంలో ఫిజికల్ టాస్కులతో బిగ్ బాస్ జనాలని ఎంటర్టైన్ చేశారు. కానీ ఈసారి మాత్రం టాస్కుల పేరుతో చెండాలం చూపిస్తున్నారు అంటూ జనాల నుంచి తిట్లు అందుకుంటున్నారు. తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో నోట్లో నీళ్లు పోసుకుని ఎక్కువ దూరంలో ఉన్న బకెట్‌లో ఉమ్మితే ఎక్కువ పాయింట్లు అట.. ఇది టాస్క్.. మా బకెట్‌లో చుక్క నీరు పడింది.. అక్కడ పడలేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ గేమ్‌లో సంజన టీమ్ గెలిచింది.. ఈ టాస్క్ లో కంటెస్టెంట్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
Also Read :వణుకు పుట్టించే హారర్ సీరియల్స్.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
గ్యాంగ్స్ వార్ లో భాగంగా టీమ్స్ పోటీ పడి మరీ టాస్క్ లను పూర్తి చేశారు.. హౌస్ లోకి వచ్చిన అమర్ దీప్, అర్జున్ కూడా తమదైన స్టైల్ లో కంటెస్టెంట్లతో ఒక ఆట ఆడుకున్నారు.. మొత్తానికి వాళ్ళు వచ్చిన పని దాదాపు పూర్తి అయిపోయింది. బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. సంజన టీం అన్ని టాస్కులలో విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో బిగ్ బాస్ చెప్పినట్లుగా మాధురి టీం మెంబెర్స్ మోకాళ్ళపై కూర్చొని సంజన తోపు.. మేము తుప్పాస్ అంటూ అన్నారు. వాంటెడ్‌పేట గేమ్‌లో రాము, రమ్య దగ్గర ఒక్క రూపాయి లేకపోవడంతో కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నారు. ఇక ఈ వారం కెప్టెన్ గా ఇమ్మానుయేల్ సెలెక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏడు వారం హౌస్ నుంచి ఆయేషా వెళ్ళబోతున్నట్లు కూడా మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళ్తారో తెలియాలంటే ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..