E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి… కెప్టెన్సీ అందని ద్రాక్షే

Bigg Boss 9 Telugu : కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి… కెప్టెన్సీ అందని ద్రాక్షే
Advertisement

Bigg Boss 9 Telugu : అందని ద్రాక్ష పుల్లన అన్నట్టుగా మారింది బిగ్ బాస్ హౌస్ లో భరణి పరిస్థితి. కెప్టెన్సీ కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. పైగా ఈరోజుతో కెప్టెన్ అయ్యే చిట్టచివరి ఛాన్స్ ను కూడా ఆయన చేజేతులా పోగొట్టుకున్నారు. చివరికి కూతురుకు సారీ చెబుతూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని బాధ పడ్డారు.

చివరి ఛాన్స్ చేజారే 

బిగ్ బాస్ హౌస్ లో భరణికి వచ్చినన్ని గోల్డెన్ ఛాన్స్ లు ఇంకెవ్వరికి రాలేదేమో. ఆయనేదో హాస్టల్ కి వెళ్ళి వచ్చినట్టు బిగ్ బాస్ కు వస్తూ పోతూ ఉంటారని ఇమ్మూ కామెడిగా అన్నా కూడా అదే నిజం. ఒకసారి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన భరణి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో బాండింగ్ కారణంగా ఆయన బయటకు వెళ్లాల్సి వచ్చింది. వచ్చాక అయినా ఆటతీరు మారుతుందేమో అనుకుంటే అదే నస. ఎంతమంది చెప్పినా మారకపోవడంతో ఫ్యామిలీ వీక్ లో ఆయన కూతురే స్వయంగా విషయాన్ని చెప్పేసింది. ఎవరైనా కమాండ్ చేస్తే ఊరికే ఉండకండి అని కూతురు ఆరతి, నా కొడుకుతో అలా బిహేవ్ చేయవద్దు జాగ్రత్త అని భరణి తల్లి చెప్పారు. అప్పటికి కూడా భరణి కళ్ళు తెరుచుకోలేదు. కానీ ఆయన గురువు అన్న మాటతో బాండింగ్ ను పక్కన పెట్టి మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.

తీరని భరణి కూతురు కోరిక 

Advertisement

కానీ అప్పటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. మొదట్లో నా ఆట ఏంటో చూపిస్తా అని ఆయన శపథం చేసేలోపే ఎలిమినేట్ అయ్యాడు. నన్ను నామినేట్ చేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నారు అనుకున్న ఆయన కాన్ఫిడెన్స్ భరణిని దెబ్బేసింది. ట్రైన్ టాస్క్ లో, బెడ్ టాస్క్ లో… అలా మొదటి నుంచి కెప్టెన్సీ టాస్క్ ను కూడా ఆయన లైట్ తీసుకున్నాడు.  ఒకరకంగా చెప్పాలంటే త్యాగం చేశారు. చివరకి వచ్చేసరికి ఆ కెప్టెన్సీ అనేది అందని ద్రాక్షగా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే… గత వారం ఫ్యామిలీ వీక్ లో భరణి కోసం కూతురు ఆరతి వచ్చింది. ఆమె తన ఆటతీరును మార్చుకోమని చెప్పడంతో పాటు ఈసారి ఖచ్చితంగా కెప్టెన్ కావాలని కోరింది. భరణి కూడా దానికి ఓకే చెప్పాడు. తాజాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణతో చివరి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడారు. కానీ ఓడిపోయారు. దీంతో కూతురి కోరిక తీర్చలేకపోయాను అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంకేముంది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా మారింది భరణి పరిస్థితి. బిగ్ బాస్ ఏదైనా మెలిక పెడితే తప్ప ఈ సీజన్లో కెప్టెన్ కాని ఒకే ఒక్క కంటెస్టెంట్ గా భరణి మిగిలిపోవడం ఖాయం.

Read Also : కళ్యాణ్ కు అదృష్ట దేవతగా మారిన ప్రియాంక… భరణికి బ్యాడ్ లక్ తీసుకొచ్చిన గౌతమ్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×