E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 79 : కళ్యాణ్ కు అదృష్ట దేవతగా మారిన ప్రియాంక… భరణికి బ్యాడ్ లక్ తీసుకొచ్చిన గౌతమ్

Bigg Boss 9 Telugu Day 79 : కళ్యాణ్ కు అదృష్ట దేవతగా మారిన ప్రియాంక… భరణికి బ్యాడ్ లక్ తీసుకొచ్చిన గౌతమ్
Advertisement

Bigg Boss 9 Telugu Day 79 : సోమవారంతోనే నామినేషన్ల రచ్చ పూర్తవ్వడంతో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు మొదలయ్యాయి. ఎప్పటిలా కాకుండా ఈసారి ఎక్స్ కంటెస్టెంట్స్ తో పోటీ పెట్టారు బిగ్ బాస్.

సంజన వర్సెస్ రీతూ 

ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నిన్నటి నామినేషన్ల రచ్చ ఇంకా కొనసాగినట్టు చూపించారు. రీతూ నాకోసం పవన్ కంటెండర్ ఛాన్స్ వదులుకున్నాడా ? లేదంటే ఓటింగ్ పరంగా బయటకు వెళ్లాడా? అని వెక్కి వెక్కి ఏడ్చింది. అందరూ నా కోసం త్యాగం చేశాడని, ఆటను నాశనం చేసుకుంటున్నాడని అంటున్నారు అని బాధ పడింది. కానీ తనూజా ‘ఎందుకు ఏడుస్తున్నావు ? ఆమె మాటలకు అంత వాల్యూ ఇస్తావా నువ్వు? ఎవరో ఏదో అంటే మన క్యారెక్టర్ బ్యాడ్ అయిపోదు. ఎంత గేమ్ ఆడినా, రీతూకి ఏదైనా ప్రాబ్లం వస్తే డెమోన్ నిలబడుతున్నాడు. దీంతో గేమ్ ను పక్కన పెట్టి అదే పట్టుకుంటున్నారు. అందుకే మొత్తుకుంటున్నా మీ గేమ్ మీరు ఆడండి” అని రీతూ – డెమోన్ లకు తన అనాలసిస్ చెప్పింది తనుజా.

Advertisement

మరోవైపు సంజన చేసింది తప్పు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఇమ్మూ. కానీ ఆమె మాత్రం ఈ హౌస్ లోకి వచ్చాక ప్రతిమూలా గేమే. నేను ఎందుకు సారీ చెప్పాలి. అలాగైతే 12 వారాల నుంచి నా ఆట కనిపించలేదు అని ఆమె అనడం కూడా తప్పే. ఆమె సారీ చెప్తేనే నేను చెప్తా. ఇప్పుడు నేను హౌస్ లో ఉన్నాను అని ఆమెకు అర్థం అయ్యి ఉంటది. ఆమె అంటే నేనెందుకు పడతా ? మంచిది మంచిది అంటూ మంచం కిందకు తోస్తారు. నాకు అన్పించిందే చెప్పాను” అంటూ సంజన లాజిక్ లెస్ వాదన మొదలు పెట్టింది.

ఫస్ట్ కంటెండర్ కళ్యాణ్

“ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ అంకం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ కెప్టెన్సీ కంటెండర్షిప్ లో గెలవడానికి మీలో మీరే యుద్ధం చేశారు. ఈసారి పరిస్థితి మీ ఊహలకు అందని స్థాయిలో ఉండబోతోంది. ఈసారి మీరు యుద్ధంలో బయట నుంచి ఇంట్లోకి వచ్చే యోధులను ఓడించాలి. నా ఛాంపియన్స్ తో ఆట ఓడిపోతే మీకు మరో ఛాన్స్ ఉండడు” అంటూ ప్రియాంక జైన్ ను ఆహ్వానించారు. ఆమె బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్. పైగా నాల్గవ రన్నరప్‌గా నిలిచింది. తాజాగా ఎక్స్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆవిడ హౌస్ మేట్స్ తో కాసేపు ముచ్చటించింది. ఇక ఇమ్మూ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్లర్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రియాంకతో యుద్ధంలో గెలవటానికి హౌస్ మేట్స్ లో ఎవరు కావాలో ఆమెను నిర్ణయించుకోమన్నారు బిగ్ బాస్. ఒక్కొక్కరుగా అందరూ ఈ టాస్క్ ఎందుకు ఆడాలి అనుకుంటున్నారో తమ పాయింట్స్ ప్రియాంక ముందు పెట్టారు. చివరికి ప్రియాంక మాత్రం కళ్యాణ్ ను సెలెక్ట్ చేసుకుంది. ‘సంథింగ్ ఫిషి’ అనే ఈ టాస్క్ లో ఫిష్ స్కెలెటిన్ లో ఫిష్ బోన్స్ ని ఫజిల్ లా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కళ్యాణ్ విన్ అయ్యి మొదటి కంటెండర్ గా నిలిచాడు.

భరణికి కలిసిరాని కాలం 

Advertisement

తరువాత గౌతమ్ ను హౌస్ లోకి ఆహ్వానించారు బిగ్ బాస్. గౌతమ్ కృష్ణ “బిగ్ బాస్ 8 తెలుగు”లో కంటెస్టెంట్. అలాగే రన్నరప్ గా నిలిచాడు. మరోసారి అతను బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్క్ లు ఆడించాడు. డెమోన్ -తనూజ, సుమన్ శెట్టి – సంజన, దివ్య – ఇమ్మూ, కళ్యాణ్ – రీతూ, భరణి – సంజన – సుమన్ ల మధ్య లవ్ ట్రాక్ తో ఫ్లర్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఆ తరువాత రంగంలోకి దిగారు.

గౌతమ్ లో యుద్ధంలో గెలవడానికి, చివరి కెప్టెన్సీకి చేరువవ్వడానికి మీకిస్తున్న టాస్క్ ‘త్వరగా సరిగా’. డెన్ లోని బోర్డులో ఉన్నట్టుగా మొదటి రోలోని కలర్స్ ను గమనించి, మీ బోర్డులో సెట్ చేయాలి. అలా 3 రౌండ్స్ ఆడాక, మూడు బ్లాక్ లను స్వింగ్ పై ల్యాండ్ అయ్యేలా విసరాలి” అంటూ బిగ్ బాస్ టాస్క్ మొదలు పెట్టారు. ఇందులో భరణి – గౌతమ్ పోటీ పడగా, గౌతమ్ గెలిచాడు. దీంతో భరణి తన కూతురికి కెప్టెన్ అవుతాను అని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను అని కన్నీళ్ళు పెట్టుకున్నారు.

Read Also : సుమ్మూ డార్లింగ్ ఏంటి చిరాగ్గా? సంజనాకు సుమన్ శెట్టి మాస్ కౌంటర్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×