E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 96 : తనూజాకే భరణి సపోర్ట్… ఇమ్మూకి గాయం… సెకండ్ ఫైనలిస్ట్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 9 Telugu Day 96 : తనూజాకే భరణి సపోర్ట్… ఇమ్మూకి గాయం… సెకండ్ ఫైనలిస్ట్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
Advertisement

Bigg Boss 9 Telugu Day 96 : బిగ్ బాస్ ఇమ్యూనిటీ కోసం పెడుతున్న యుద్ధాలలో ఒక్కో టాస్క్ తరువాత ఒక్కొకరిని రేసు నుంచి తప్పిస్తున్నారు. డే 96 ఎపిసోడ్ లో వారం అంతా ఇమ్మూతో ఎడముఖం పెడముఖం అన్నట్టుగా ఉన్న సంజన, తనను తీసేస్తారన్న భయంతో ఇమ్మూతో మాట్లాడింది. తనను తీయొద్దు అని రిక్వెస్ట్ చేసింది. అప్పటికే తనూజకు మాటిచ్చానని చెప్పేశాడు ఇమ్మూ. ఇక ఇప్పుడు భరణి వంతు వచ్చింది. నిన్న రెండు టాస్క్ లలో హౌస్ మేట్స్ అందరూ కలిసి అతన్ని పక్కన పెట్టేయడంతో పాయింట్స్ టేబుల్ లో వెనకబడిపోయాడు. అందుకే అతన్ని రేసు నుంచి తప్పిస్తూ, తను సంపాదించిన 50,000 పాయింట్స్ లో సగం 25 వేల పాయింట్స్, స్కోర్ లో సగం ఎవరికైనా షేర్ చేయమన్నారు. అయితే ఊహించని విధంగా భరణి ఎమోషనల్ అవుతూ తనూజాకు ఇచ్చాడు.

ఇమ్మూ – సంజన రచ్చ

లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి ఇస్తున్న టాస్క్ అంటూ “కీ టూ సక్సెస్” అనే యుద్ధాన్ని మొదలు పెట్టారు బిగ్ బాస్. ట్రేలో ఉన్న కీలలో ఒకసారి ఒకటి తీసుకుని, పూల్ లో ఉన్న తమ కలర్ షేప్స్ ను అన్ లాక్ చేసి టేబుల్ పై సెట్ చెయ్యాలి. ఈ టాస్క్ లో ఇమ్మూ, తనూజా, సంజన ముగ్గురూ ఆడగా, బిగ్ ఫైట్ జరిగింది. సంజన తనూజా కలిసి ఇమ్మూని ఆపడానికి ట్రై చేశారు. టాస్క్ పూర్తి అయ్యాక “మీరే కదా నా దగ్గరకు ముందు వచ్చింది” అని ఇమ్మూ అడిగాడు. “అది గేమ్. వేరే వాళ్ళు వస్తున్నారు అని ఎందుకు అంటున్నావ్” అని అడిగింది సంజన. “మనిద్దరం కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అంటున్నాను. మిమ్మల్ని నేను వేరు చేయలేదు” అని వివరణ ఇచ్చాడు ఇమ్మూ. “ఇంక వదిలేయ్ ఇమ్మూ. ఏడిపించింది చాలు” అని ఏడుస్తూ సంజన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. “మీరు ఆడితే గేమ్. నేను ఆడితే బంధాలా ? వారం నుంచి ఏం పోట్రె చేయాలి అనుకుంటున్నారు ఆవిడ. నేనూ మనిషినే. నాకు ఎమోషన్స్ ఉండవా?. వారం నుంచి ఆమె నాతో ఒక్కసారైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడిందా ? ” అంటూ ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ గేమ్ ఇమ్మూ గెలిచాక… స్కోర్ బోర్డులో ఇమ్మూ 470, తనూజ 350, సంజన 320 పాయింట్స్ స్కోర్ చేశారు. లీస్ట్ లో ఉన్న సంజనను ఈ రౌండ్ లో తొలగించారు.

ఇమ్మూ – తనూజాకు గాయాలు

Advertisement

అనంతరం ‘బ్యాలెన్స్ చెయ్ డ్యూడ్’ అనే టాస్క్ ఆడుతుండగానే ఇమ్మూ కాలికి ఇంజురీ అయ్యింది. వెంటనే అతన్ని మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు. కాసేపటికి ఇమ్మూ కాలికి కట్టు కట్టుకుని వచ్చి, గాయమైన కాలితోనే గేమ్ ఆడి గెలిచాడు. “సెకండ్ ఫైనలిస్ట్ కావడానికి చివరి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన వారికి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది” అంటూ ‘రైజ్ ది బార్’ అనే టాస్క్ పెట్టారు. సాండ్ బ్యాగ్స్ ను స్టిక్స్ సాయంతో బ్యాలెన్స్ చేస్తూ, చివర్లో ఉన్న బాస్కెట్ లో పడేలా చేయాలి. అలా పడ్డ సాండ్ బ్యాగ్ ను చివర్లో ఉన్న బ్యారెల్ లో వేయాలి. ఈ టాస్క్ ఆడుతుండగా… ఇమ్మూ స్టిక్ వెళ్లి తనూజా తలపై పడింది. ఆ నొప్పితో విలవిల్లాడిన తనూజ చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ఆడి గెలిచింది. దీంతో ఇమ్మూ చివరి నిమిషంలో ఒడిపోయినందుకు గుక్క పెట్టి ఏడ్చాడు. చివరికి తనుజాను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి, తను ఆడి గెలిచిన 3 లక్షలతో ఇమ్యూనిటీ, సెకండ్ ఫైనలిస్ట్ ను కొంటారా? అలా కొంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఆ డబ్బు కట్ అవుతుందని… లేదంటే నామినేషన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ తనూజ మాత్రం ఆడియన్స్ నిర్ణయాన్ని గౌరవిస్తానని బిగ్ బాస్ కు షాక్ ఇచ్చింది.

Read Also : తనూజా మీద కోపం కళ్యాణ్ పై… భరణి పప్పెట్ లా మారిన సుమన్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×