E-Paper
Advertisement

Lokesh Kanagaraj : రజినీకాంత్, కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ తెలుగు హీరోలతో?

Lokesh Kanagaraj : రజినీకాంత్, కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ తెలుగు హీరోలతో?
Advertisement

Lokesh Kanagaraj : సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ సక్సెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సక్సెస్ పెడితే వరుస అవకాశాలు రావడం అనేది సహజంగానే జరుగుతుంది అలానే ఒక ఫెయిల్యూర్ పెడితే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. లోకేష్ కనకరాజ్ అంటే ఒక బ్రాండ్.

మా నగరం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. రెజీనా కసాండ్రా సందీప్ కిషన్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత కార్తీ నటించిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఖైదీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ లెవెల్ నెక్స్ట్ రేంజ్ కు వెళ్ళిపోయింది కంప్లీట్ స్టార్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్నాడు.

Advertisement

కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా లోకేష్ కనగరాజ్ సినిమాలకు బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టారు. కానీ కూలి సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందించకపోవడంతో లెక్కలన్నీ కూడా తారుమారు అయిపోయాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మల్టీ స్టారర్ సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది.

తెలుగు హీరోలతో మల్టీస్టారర్ 

లోకేష్ కనగరాజ్ గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని గురించి అధికారకు ప్రకటన రాలేదు. ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మల్టీ స్టారర్ సినిమాను చేయనున్నాడట లోకేష్.

Advertisement

ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ హీరోలుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ ఇద్దరు కూడా స్క్రిప్ట్ విని బాగా ఇంప్రెస్ అయిపోయారు అని కూడా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు వస్తున్న సందేహం ఏంటంటే తమిళ్లో రజనీకాంత్ మరియు కమలహాసన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులనే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ చేస్తున్నాడా అనేది చాలామందికి వస్తున్న సందేహం. అయితే దీని గురించి లోకేష్ మాట్లాడితే తప్ప ఎవరికీ క్లారిటీ రాదు.

ఖైదీ 2 పై నో క్లారిటీ 

మరోవైపు కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమాను లోకేష్ కనగరాజ్ చేయాల్సి ఉంది. కూలి సినిమా తర్వాత అదే ప్రాజెక్ట్ మొదలవుద్ది అని అందరూ ఊహించారు లోకేష్ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించి సరైన క్లారిటీ లేదు. ఇదే విషయాన్ని కార్తి మాట్లాడుతూ కూడా ఖైదీ 2 సినిమా విషయం పైన నాకు కూడా క్లారిటీ లేదు అంటూ తేల్చి చెప్పేసాడు. వీటన్నిటికీ లోకేష్ మాత్రమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి.

Also Read: Champion trailer : శ్రీకాంత్ కొడుకు రోషన్ కోసం రామ్ చరణ్, ఇది కదా అసలైన బాండింగ్

Related News

అందరి కోసం సినిమా తీయలేను.. మౌళి బోల్డ్ కామెంట్స్!

నిశ్చితార్థం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ పోస్ట్..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

బ్లూ శారీలో నిహారిక.. అదిరిపోయే అందంతో కట్టిపడేసిందిగా!

‘బెవర్లీ హిల్స్’ నటి మృతి.. అసలేం జరిగిందంటే?

ఒకేరోజు ముగ్గురు స్టార్ హీరోలు.. క్రిస్మస్‌కు బాక్సాఫీస్ వార్!

సురేఖ వాణి పర్సనల్ వీడియోలపై వివాదం.. స్పందించిన నటి!

‘ రామాయణ’ సినిమా బిగ్ షాక్.. అక్కడ సినిమా బ్యాన్..

ఖుషీ కపూర్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ వరకు.. బాలీవుడ్‌లో పండుగ జోష్!

Big Stories

Advertisement
×