E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 103 : కళ్యాణ్ ఏవీకి బ్లాస్టింగ్ ఎలివేషన్… కాఫీ కోసం డెమోన్ ను బుక్ చేసిన ఇమ్మూ, తనూజ… సంజన ఎమోషనల్

Bigg Boss 9 Telugu Day 103 : కళ్యాణ్ ఏవీకి బ్లాస్టింగ్ ఎలివేషన్… కాఫీ కోసం డెమోన్ ను బుక్ చేసిన ఇమ్మూ, తనూజ… సంజన ఎమోషనల్
Advertisement

Bigg Boss 9 Telugu Day 103 : ఇప్పటిదాకా తనూజ, డెమోన్, ఇమ్మానుయేల్ ఏవీలు వేసిన బిగ్ బాస్ ఈరోజు సంజన, కళ్యాణ్ పడాల ఏవీలతో ఆకట్టుకున్నారు. ముందుగా కాఫీ కోసం టాప్ 5 కలిసి బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశారు. “ప్లీజ్ బిగ్ బాస్ మా మొహాలు చూసి కాఫీ పౌడర్ పంపించండి. కాస్త చికెన్ పంపించండి” అని రిక్వెస్ట్ చేశారు. కానీ బిగ్ బాస్ కేవలం ఒక టీస్పూన్ కాఫీని మాత్రమే పంపారు. ఇమ్మానుయేల్ “అది కనీసం ముక్కుతో స్మెల్ చేయడానికి కూడా సరిపోదు” అంటూ వాపోయాడు. తర్వాత “మీరు కాఫీ పంపిస్తే డెమోన్ తో లేడీ డ్రెస్, లిప్ స్టిక్ వేయించి డాన్స్ చేయిస్తాము” అని బిగ్ బాస్ ను వేడుకున్నారు. వెంటనే కెమెరా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రంగంలోకి దిగారు. డెమోన్ కి లేడీ గెటప్ వేయించిన ఇమ్మానుయల్ “ఈరోజు నా పెళ్ళాన్ని పరిచయం చేస్తాను. మీట్ మై పెళ్ళాం పావని” అంటూ డెమోన్ ను తీసుకొచ్చాడు. “మీరు కాఫీ పౌడర్ పంపిస్తే మా ఆయనకి కాఫీ పెడతా. లేదంటే మా ఆయన నన్ను తాగొచ్చి కొడుతున్నాడు” అంటూ బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశాడు డెమోన్. ఆ తర్వాత “ఊ అంటావా మావా” అనే సాంగ్ కి ఇమ్మూ, కళ్యాణ్, డెమోన్ స్టెప్పులేశారు.

కామనర్ తలచుకుంటే… 

“కళ్యాణ్ మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు. ఓనర్ గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. మీతో ఈ ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసితో ఆడి కెప్టెన్ గా నిలిచారు. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాటపటిమ అనే మీ బలాలను ఎప్పుడూ వీడకుండా, లోటుపాట్లన్నీ సరిచేసుకుని చివరికి కెప్టెన్ గా నిలబడమే కాక ఫస్ట్ ఫైనల్ లిస్ట్ గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు” అంటూ కళ్యాణ్ ఏవీని వేశారు.

సంజన కొడుకు గర్వపడే జర్నీ 

Advertisement

సంజన గార్డెన్ ఏరియాలో చేసిన ఏర్పాట్లను చూసి, ఎమోషనల్ అయ్యింది. తన కొడుకు ఫోటోను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. “మమ్మా ఇంట్లో లేదు సారీ. అరగంటలో వస్తా అని చెప్పా. 100 రోజులు దాటినా ఇంకా రాలేదు” అంటూ గుక్కపెట్టి ఏడ్చింది. “సంజన టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5కి చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్ 9 మొదటి కెప్టెన్ గా గెలిచి, ఆరంభం నుంచి ఆటను మీ చేతిలోకి తీసుకున్నారు. ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీ కోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది ? టాస్కులలో మీరు పోటీపడినా, సంచాలక్ గా ఉన్నా… సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతోంది అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించారు. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలి వైపు ఎవరున్నా వెనక్కి తగ్గని ధైర్యం మీ సొంతం. కష్టాలను ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణం చూసి ఏదో ఒక రోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు” అంటూ సంజన ఏవీని వేశారు.

Read Also : ఏంట్రా మనిద్దరి ట్రాక్… ఏవీ చూశాక కళ్యాణ్ దగ్గర తనూజా ఎపిక్ రియాక్షన్

Advertisement

 

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×